Latest

[yasr_overall_rating null size=”medium”]

మూవీ : చోక్డ్‌ (హిందీ) రేటింగ్‌ : 3/5 (choked meaning in telugu: చోక్డ్ అంటే ఊపిరి ఆడ‌క‌పోవ‌డం. ఊపిరి ఆడ‌కుండా చేయ‌డం. ఉక్కిరి బిక్కిరి చేయ‌డం.)

విడుదల : నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ , జూన్‌ 5
నటీనటులు : సయామీ ఖేర్, రోషన్‌∙మాథ్యూ, రాజ్‌శ్రీ దేశ్‌పాండే, అమృతా సుభాష్‌
నిర్మాతలు : అనురాగ్‌ కశ్యప్, ధృవ్‌ జగాసియా, అక్షయ్‌ థక్కర్‌
దర్శకుడు : అనురాగ్‌ కశ్యప్‌

చోక్డ్‌ కథ :

 భర్త సుశాంత్‌ (రోషన్‌ మాథ్యూ) ఏ ఉద్యోగంలోనూ నిలకడగా ఉండడు. కుటుంబ ఆర్థిక అవసరాలన్నీ భార్య సరితా పిళ్లై (సయామీ ఖేర్‌) తీర్చాల్సి వస్తుంది. బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న సరితా పిళ్లై.. భర్త చేసిన అప్పుల భారం కూడా మోస్తుంది. అనుకోకుండా కిచెన్‌లో సింక్‌ కనెక్ట్‌ అయ్యే ఔట్‌ పైపు నుంచి సీల్డ్‌ కవర్లలో నోట్ల కట్టలు దొరుకుతాయి. ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయనుకున్న తరుణంలో తిరిగిన మలుపులే ఈ కథ.

చోక్డ్ రివ్యూ :

ముంబై మిడిల్‌ క్లాస్‌ సొసైటీలో ఓ చిన్నసింగిల్‌ బెడ్‌ రూమ్‌ పోర్షన్‌లో సరితా పిళ్లై–సుశాంత్‌ దంపతులు, వాళ్లబ్బాయి సమీర్, వారి చుట్టుపక్కల పోర్షన్లలో జీవితాలను మన ఇంటి కిటికీలోంచి పక్కింట్లోకి చూసినట్టే ఉంటుంది.

అందరి ఇళ్లల్లో మనస్ఫర్థలు వచ్చేది ఆర్థిక చిక్కులతోనే. సరితా, సుశాంత్‌ల గిల్లికజ్జాలన్నీ వీటి చుట్టే. వీరి చిన్న చిన్న గొడవల మధ్య వాళ్లబ్బాయి సమీర్‌ మధ్యవర్తిలా ఉండడం మన ఇళ్లల్లో జరిగేదే.

సరిత బ్యాంకు ఉద్యోగం చూసుకోవడంతోపాటు ఇంటి పనులు, సమీర్‌ హోంవర్క్‌లతో సతమతమవడం, సుశాంత్‌ పనీపాటా లేకపోగా భార్యకు ఎలాంటి సాయం చేయకపోవడం, ఆయన చేసిన అప్పులను సరిత తీర్చాల్సి రావడం వంటి అంశాలతో ముంబై మధ్యతరగతి బతుకులను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు.

అంతకుముందు సరిత గాయనిగా ఎదగాలని కల కంటుంది. సుశాంత్‌ సంగీతం నేర్చుకుని ఉంటాడు. కానీ వారి కళల్లో వారు రాణించలేదన్న వైఫల్యం వారిని వెంటాడుతుంది. వీటికి తోడు ఆర్థిక చిక్కులతో సరిత సతమతమవుతున్న తరుణంలో సింక్‌ అటాచ్‌ అయి ఉన్న పైప్‌ నుంచి వచ్చే నోట్ల కట్టలను భర్తకు తెలియకుండా మేనేజ్‌ చేస్తుంది.

రోజూ కొన్ని కట్టలు వస్తుంటే వాటిని తీసి దాచిపెడుతుంది. వాటిని ఖాతాలో జమచేసే లోపు డీమానిటైజేషన్‌ ప్రకటన వస్తుంది. పాత నోట్లను ఎక్స్ఛేంజ్‌ చేసే గడువు ముగిసే రోజు రానే వస్తుంది. ఈలోపు సరితన ఓ బ్లాక్‌ మెయిలర్‌ వెంటాడుతుంటాడు. అతడికి సరితకు ఏంటి సంబంధం? తన బ్యాంకులో నోట్లు మార్చగలిగిందా? ఆమె ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? పొరుగింటి మనస్తత్వాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ చోక్డ్‌ సినిమాలో చూడాల్సిందే.

Choked meaning in english

మధ్యతరగతి జీవుల ఆశలు, ఆకాంక్షలు, అవి నెరవేరక ఉసూరుమనిపించే జీవితం, కష్టాలు కన్నీళ్లు పంచుకునే భార్యాభర్తల బంధం.. వీటి చుట్టూ దర్శకుడు కథ బాగా అల్లాడు. నోట్ల రద్దు అంశాన్ని సెటైరిక్‌గా చెప్పాలనుకున్నాడు. మధ్య తరగతి జీవితంలో తెలివిగా ఈ అంశాన్ని చొప్పించాడు. నోట్ల రద్దు నాడు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పరిస్థితి, పేద, మధ్య తరగతి జీవులు ఎలా ఇబ్బంది పడ్డారు? వంటి అంశాలన్నీ సినిమాలో చూపించారు. choked అంటే ఊపిరాడకపోవడం అనే అర్థానికి తగ్గట్టుగా ఈ మూవీ కథ ఉంటుంది.

నోట్ల రద్దు అంశం పాతపడడంతో ఇప్పుడు అంతగా కనెక్ట్‌ కాకపోయినా నాటి కష్టాలను మరొకసారి గుర్తుకు తెస్తుంది. నేపథ్యం నోట్ల రద్దు అయినప్పటికీ సంసార జీవితంలో ఉండే కష్టాలనే ఎక్కువగా చూపిస్తుంది.

సిల్వస్టర్‌ ఫొన్సెకల్‌ సినిమాటోగ్రఫీ చీకటి, ఇరుకు గదుల్లో మధ్య తరగతి జీవితాన్ని ఆసక్తికరంగా చూపింది. గౌతమ్‌ నాయర్‌ సౌండ్‌ డిజైన్‌ నోట్ల కట్టలు బయటకు వెలువడుతున్నప్పుడు ఉత్కంట రేపేలా ఉంటుంది. భార్యాభర్తల మధ్య డైలాగులు, బ్యాంకులో కస్టమర్లతో సంభాషణ ఆకట్టుకుంటుంది.

సయామీ ఖేర్, రోషన్‌ మాథ్యూ తమ పాత్రల్లో జీవించారు. గొప్ప అనుభూతి మిగిల్చే సినిమా ఏం కాకపోయినా.. దర్శకుడు ఓ చారిత్రక ఘట్టాన్నినెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా తెరమీదికి తెచ్చిన ప్రయత్నం అభినందనీయం.

ఇవీ చదవండి


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version