Home న్యూస్ కరోనా మరణాలు లక్షన్నర.. రోజూ 80 వేలకు పైగా కొత్త కేసులు

కరోనా మరణాలు లక్షన్నర.. రోజూ 80 వేలకు పైగా కొత్త కేసులు

corona virus deaths
Photo by Markus Spiske from Pexels

కరోనా మరణాలు 1,52,551 కు చేరుకున్నాయి. ఇవి ఏప్రిల్‌ 19 రాత్రి 9.30 గంటల సమయానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదికలోని గణాంకాలు. ఇదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 పాజిటివ్‌ కేసులు 22,41,359 గా నమోదయ్యాయి.

మార్చి 6వ తేదీన 1,01,254 కేసులు ఉండగా.. ఈ 43 రోజుల్లో మరో 21.40 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు 50 వేల కొత్త కేసులు. కానీ ఇటీవల రోజుకు సగటున 80 వేలకు పైగా కేసులు నమోదవుతుండడం కలవరపెడుతోంది.

ఏప్రిల్‌ ఒకటి నుంచి సగటున రోజుకు 70 వేల మేర కొత్తగా కోవిడ్ 19 కేసులు వస్తున్నాయి. ఏప్రిల్‌ 11న ఒకేరోజు అత్యధికంగా 90,778 కేసులు కొత్తగా వచ్చాయి. ఏప్రిల్‌ 17న ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు అత్యధికంగా 8,478 కరోనా మరణాలు సంభవించాయి.

భారత దేశంలో ఏప్రిల్‌ 19 రాత్రి 9.30 గంటల సమయానికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 15,712 నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇందులో 1334 కేసులు కొత్తగా నమోదైనట్టు తెలిపింది.

అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాలు (ఏప్రిల్‌ 19 రాత్రి 9.30 గంటల సమయానికి)

దేశం               పాజిటివ్‌ కేసులు               కరోనా మరణాలు
అమెరికా              6,95,353                32,427
స్పెయిన్‌              1,91,726                20,043
ఇటలీ                 1,75,925                23,227
జర్మనీ                1,39,897                  4,294
యూకే                1,14,221                15,464
ఫ్రాన్స్‌                 1,10,721                19,294
చైనా                     84,201                  4,642
టర్కీ                     82,329                  1,890
ఇరాన్‌                   80,868                  5,031
రష్యన్‌ ఫెడరేషన్‌        42,853                      361
బెల్జియం                37,183                   5,453
బ్రెజిల్‌                   33,682                   2,141

ఇవి కూడా చదవండి

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది

కరోనా నేర్పిన పది జీవిత పాఠాలు ఇవే

Exit mobile version