Home హెల్త్ Hot Lemon Water: ఉద‌యాన్నే వేడినీరు, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతున్నారా! ఈ అద్భుత ప్ర‌యోజ‌నాలు పొందిన‌ట్లే

Hot Lemon Water: ఉద‌యాన్నే వేడినీరు, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతున్నారా! ఈ అద్భుత ప్ర‌యోజ‌నాలు పొందిన‌ట్లే

lime juice on drinking glass beside sliced limes
ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం తాగడం వల్ల ఉపయోగాలు Photo by Francesca Hotchin on Unsplash

Hot Lemon Water:  ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మ‌ రసం కలిపి తాగితే అద్భుతమైన ఔషధ ప్రయోజనాలు ఉంటాయని పౌష్ఠికాహార నిపుణులు చెబుతున్నారు. నిమ్మ‌కాయ‌లో ఉండే సి విట‌మిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. పొట్ట కొవ్వును సులువుగా క‌రిగించుకోవ‌డానికి ఈ గోరువెచ్చ‌ని నిమ్మ‌ ర‌సాన్ని తాగుతుంటారు. ఇంకా ఎలాంటి ఉప‌యోగాలు క‌లుగుతాయో తెలుసుకుందాం.

నిమ్మ రసం వాత రోగాల‌ను పోగొట్ట‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. జీర్ణ శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. అలాగే పొట్ట‌లో ఉండే క్రిముల‌ను చంపేస్తుంది. మనం తాగే నీటి ద్వారా, తినే ఆహ‌రం ద్వారా చాలా మ‌లినాలు మ‌న శ‌రీరంలో తిష్ట వేస్తాయి. వీటి వ‌ల్ల అనారోగ్యం బారిన ప‌డే అవ‌కాశం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. వీటికి నిమ్మ‌కాయ ఒక మంచి దివ్యౌష‌ధం. మలినాలన్నీ తొలగిపోతాయి.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో నిమ్మ‌కాయ‌ను మించిన ఔష‌ధం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ ర‌సంలో విట‌మిన్ సి తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా నిమ్మ‌కాయ‌ యాంటీబ‌యోటిక్, యాంటీ  ఫంగ‌ల్, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాల‌తో నిండి ఉంటుంది. అలాగే  ఇన్‌ఫెక్ష‌న్లకు, కిడ్నీలో రాళ్ల‌కు కూడా చెక్ పెట్టొచ్చు.  

వేడినీళ్లు, నిమ్మ‌ర‌సంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు:

1. ప్ర‌తి రోజూ ఉద‌యం ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సాన్ని వేసి క‌లిపి తీసుకుంటే ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. క్ర‌మంగా షుగ‌ర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవ‌చ్చు.

2. రోజూ ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాలు తొల‌గిపోతాయి. శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు పోతాయి. ఫలితంగా జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు పరిష్కారమవుతాయి.

3. వేడి నీళ్లు, నిమ్మ‌రసం తాగ‌డం వ‌ల్ల అధిక బరువుతో బాధ‌ప‌డేవారు ఉపశమనం పొందవచ్చు. పొట్ట‌లోని కొవ్వును త‌గ్గించే శ‌క్తి ఈ నిమ్మ‌ర‌సానికి ఉంది. 

4. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల బాడీ మెట‌బాలిజం రోగ‌నిరోధకతను అందిస్తుంది. అలాగే యాంటి వైర‌ల్ ల‌క్ష‌ణాలు స‌హ‌జ‌సిద్దంగా ఉండ‌డం వ‌ల్ల చాలా ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు తేలిక‌గా తగ్గించుకోవ‌చ్చు.

5. కొంచెం గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తాగ‌డం వ‌ల్ల గాస్ట్రిక్ స‌మస్య త‌గ్గుతుంది. దీని వ‌ల్ల శ‌రీరానికి ఇత‌ర మిన‌ర‌ల్స్ గ్ర‌హించే శ‌క్తి పెరుగుతుంది. క‌డపు ఉబ్బ‌రం, అల‌స‌ట‌ను దూరం చేస్తుంది.

6. చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు తొల‌గిపోతాయి. రోజూ నిమ్మ ర‌సాన్ని నేరుగా లేదా గ్లాస్ నీటిలో తేనె  క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం స‌హ‌జమైన కాంతిని అందిస్తుంది.

7. నిమ్మ‌ర‌సంలో తేనెను క‌లిపి తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి. అలాగే కిడ్నీలో రాళ్ల  స‌మ‌స్యలు త‌గ్గుతాయి. దగ్గు, జ‌లుబు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షణ లభిస్తుంది. 

8. నిద్ర‌లేమి స‌మ‌స్యతో బాధ ప‌డే వారు రోజుకు రెండు పూట‌లా నిమ్మ ర‌సాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లుపుకుని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది. దీని వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే శ‌రీరం డీహైడ్రేట్ అవ్వ‌డం వ‌ల్ల ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఉద‌యం ఈ నీటిని తాగితే రోజంతా చాలా రీఫ్రెష్‌గా, యాక్టివ్‌గా ఉంటారు.

9. నిమ్మ కాయలో ఉండే విటమిన్ సి శ‌రీరంలో ఆక్సిజ‌న్‌ త‌గినంత ఉండే విధంగా చూస్తుంది.  అలాగే చ‌ర్మం పై దుర‌ద‌లు, దద్దుర్లు త‌గ్గుతాయి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version