Home హెల్త్ పాల‌ల్లో పంచ‌దార‌కు బదులు బెల్లం వేసుకుంటే క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..

పాల‌ల్లో పంచ‌దార‌కు బదులు బెల్లం వేసుకుంటే క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..

clear glass mug with white liquid
బెల్లం పాలు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి Photo by Ibrahim Rifath on Unsplash

Jaggery with Milk: పాలు ఆరోగ్యానికి చాల మంచివని అంద‌రికీ తెలుసు. కానీ ఆ పాలల్లో పంచ‌దార వేసుకుంటే మంచిదా?  బెల్లం వేసుకుంటే మంచిదా? అని ఎంత‌మందికి తెలుసు. బెల్లం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల‌సిన కొన్ని పోషకాలు ల‌భిస్తాయి. పాలు, బెల్లం రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల త‌రుచుగా అల‌స‌ట‌, నీర‌సం, అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మంచి  ఔష‌ధంగా ప‌నిచేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మరి ఇందులో లాభాలేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.

పాలు, బెల్లం ఈ  రెండూ కూడా మన ఆరోగ్యానికి మంచి ఔషధాలు. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవ‌డం వ‌ల్ల  చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ రెండింటిలో దాగి ఉన్న పోష‌కాలు మ‌రే ఇత‌ర వాటిలో కూడా క‌నిపించ‌వు. ఎక్కువ మొత్తంలో శ‌రీరానికి  కాల‌సిన అన్ని ర‌కాల పోష‌కాలు, ఖనిజ లవణాలు ఈ రెండింటి  కాంబినేష‌న్‌లో లభిస్తాయి. క‌నుక పాలు తీసుకునేట‌ప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవ‌ల‌సింది బెల్లం మాత్ర‌మే. పంచ‌దారను పూర్తిగా మానేయ‌డం శ్రేయ‌స్క‌రమ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి అవసరమైనవన్నీ ఎముకలు, దంతాలను బలంగా మార్చ‌డానికి ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి. దృఢత్వాన్ని పెంచుతాయి. అలాగే శరీరానికి విటమిన్ D లభిస్తుంది. పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే శరీరాన్ని హెల్తీగా ఉంచడమే కాకుండా.. రక్తాన్నిశుద్దిచేయడంలో ఇది కీల‌క పాత్ర పోషిస్తుంది. అందుకే పిల్ల‌ల‌కు రోజూ ఒక గ్లాసు బెల్లం పాల‌ను ఇవ్వాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని ఉప‌యోగాల‌ను ఇప్పుడు  తెలుసుకుందాం..

పాలు, బెల్లం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు:

  1. పాలు, బెల్లం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల  శర‌రంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది. పాల‌లో ఉండే కాల్షియం, బెల్లంలో ఉండే ఐర‌న్ రెండూ కూడా రోగాన్ని త‌ట్టుకోగ‌లిగే శ‌క్తిని అందివ్వడంలో ముందంజలో ఉంటాయి. వీటిలో ఉండే అనేక పోష‌కాలు వివిధ ర‌కాల బాక్టీరియాల‌ను పోగొట్టి శ‌రీరానికి రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డంలో  స‌హాయ‌ప‌డుతుంది. అలాగే  బెల్లం సహజమైన  యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలను క‌లిగి ఉండడం వ‌ల్ల  రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.
  1. ఈ రెండింటీని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. అలాగే క‌డుపులో గ్యాస్, అసిడిటీ వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. ప్రేగుల‌లో మ‌ల‌విస‌ర్జ‌న సాఫీగా సాగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, వివిధ ర‌కాల పొట్ట స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
  1. అలాగే అధిక బ‌రువు ఉన్న‌వారు సులువుగా బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌క‌రిస్తుంది. బెల్లం పాలు శ‌రీర కొవ్వును నియంత్రిస్తాయి. పాలలో బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలోని అదనపు కొవ్వు, అధిక బ‌రువు, స్థూలకాయం వంటి స‌మ‌స్య‌లను నివారిస్తుంది. బరువును అదుపులో ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది.
  1. రోజూ పాల‌ల్లో బెల్లం క‌లిపి తీసుకుంటే ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. ముఖ్యంగా మ‌హిళ‌లు, పిల్లలు ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో ఎక్కువ‌గా బాధ‌పడుతున్నారు. అలాంటి వారికి బెల్లం పాలు మంచి ఔష‌ధం. ఇది శ‌రీరంలో డీటాక్స్‌లా ప‌నిచేసేలా చేస్తుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌ప్పుడు ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు లోన‌వ్వాల్సి ఉంటుంది. క‌నుక క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ పాల‌ను త‌సుకుంటే ర‌క్తంలో హీమోగ్ల‌బిన్ శాతాన్ని పెంచి ర‌క్త‌హీనత స‌మ‌స్య రాకుండా కాపాడుకోవ‌చ్చు.
  1. బెల్లం పాలలోని పోషకాలు జుట్టు మెరిసేలా చేస్తాయి. వీటి సంరక్షణకు బెల్లం పాలు టానిక్‌లా ప‌నిచేస్తాయి.దీని వల్ల   జుట్టు రాలడం, చుండ్రు స‌మ‌స్య‌ను  నయం చేస్తుంది. అలాగే జుట్టు మంచి పోష‌ణ అంది జుట్టు రాల‌కుండా, తెల్ల‌బ‌డ‌కుండా, స‌హ‌జ‌మైన కాంతిని అందిస్తుంది.

6.బెల్లంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. త‌ద్వారా మ‌హిళ‌ల‌కు  బహిష్టు సమయంలో వచ్చే విపరీతమైన కడుపునొప్పి, నడుము నొప్పికి బెల్లం పాలు దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది.

  1. ఉద‌యం అల్పాహారం త‌ర్వాత గోరువెచ్చ‌ని బెల్లం పాలు తాగ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే శ‌రీరంలో త‌గినంత‌గా పోష‌కాలు అంది నీర‌సం, అల‌స‌ట‌ను దూరం చేస్తాయి. కండ‌రాలు బలంగా గ‌ట్టిప‌డ‌తాయి. ఫ‌లితంగా మంచి నిద్ర‌ను పొంద‌వచ్చు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version