Home లైఫ్‌స్టైల్ Belly Fat loss Tips: బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా! పొట్ట తగ్గించే ఈ చిట్కాలు...

Belly Fat loss Tips: బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా! పొట్ట తగ్గించే ఈ చిట్కాలు తెలుసుకోండి

obesity, stop, stop obesity
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ చిట్కాలు తెలుసుకోండి Photo by Tumisu on Pixabay

Belly Fat loss Tips: బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఏం చేయాలని సతమతమవుతున్నారా? బెల్లీ ఫ్యాట్ రావడానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మ‌నం తినే ఆహ‌రం, మ‌న జీవ‌న‌శైలిలో మార్పులు, ముఖ్యంగా త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వ‌ల్ల పొట్ట చుట్టూ అధిక‌ కొవ్వు ఏర్ప‌డి ఒక్క బెల్లీ ఫ్యాట్ రావ‌డం మాత్ర‌మే కాదు మ‌రెన్నో స‌మ‌స్య‌లకు దారితీస్తుంది. చాలామందికి ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనే కోరిక ఉన్న‌ప్ప‌టికీ ఇప్పుడున్న బిజీలైఫ్‌లో అది కోరిక‌గానే మిగిలిపోతుంది. అయితే ఇక్క‌డ తెలిపిన ఈ చిన్న చిట్కాల ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా త‌గ్గించుకోవ‌చ్చు.  

బొడ్డు చుట్టూ కొవ్వులు అధికంగా పేరుకుపోవడాన్ని బెల్లీ ఫ్యాట్ అంటారు. దీనినే  విసెరల్ ఫ్యాట్ అని కూడా పిలుస్తారు. ఇది పురుషులలో ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి త‌గినంత  వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన డైట్ అనుసరించడం ముఖ్యం. అస‌లు ఈ బెల్లీ ఎలా వ‌స్తుంది? ఏ కార‌ణాల చేత వ‌స్తుంది? ఇప్పుడు చూద్దాం.

బెల్లీ ఫ్యాట్‌కు కార‌ణాలు:

  1. హార్మోన్స్ ప్రాబ్ల‌మ్
  2. జీవ‌న‌శైలి మార్పులు
  3. స‌మ‌యానికి తిన‌క‌పోవ‌డం
  4. స‌రైన నిద్ర లేకపోవ‌డం
  5. జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం
  6. శారీర‌క శ్ర‌మ లేకపోవ‌డం
  7. ఆల్కహాల్ తీసుకోవడం
  8. ధూమపానం
  9. అధిక కొవ్వులు, షుగర్ కంటెంట్‌తో కూడిన ఆహారం

బెల్లీ ఫ్యాట్ వ‌ల్ల ఎదుర్కొనే స‌మ‌స్య‌లు:

  1. బెల్లీ ఫ్యాట్ పెరగడం ఊబ‌కాయానికి దారితీస్తుంది
  2. మూత్ర‌పిండాల స‌మ‌స్య‌లు
  3. గుండె స‌మ‌స్య‌లు
  4. ర‌క్త‌పోటు పెరగడం
  5. లివ‌ర్ స‌మ‌స్య‌లు
  6. క్యాన్స‌ర్ బారిన ప‌డ‌డం
  7. ఆర్థ‌రైటిస్
  8. గ‌ర్భ‌దార‌ణ స‌మ‌స్య‌లు  
  9. డయాబెటిస్

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు చిట్కాలు:

1. క్యాప్సిక‌మ్:

క్యాప్సికమ్ లేదా చిల్లీ పెప్పర్ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. అలాగే, శరీరంలో కొవ్వు వినియోగాన్ని ప్రోత్సహించడానికి క్యాప్సికమ్ పనిచేస్తుంది. త‌రుచూ మ‌నం తినే ఆహారంలో క్యాప్సిక‌మ్ భాగం చేసుకోవ‌డం అవ‌స‌రం. పొట్టలోని కొవ్వును సుల‌భంగా తగ్గించడంలో క్యాప్సిక‌మ్ చ‌క్క‌ని వంట‌కం.

2. అల్లం:

కొవ్వును తగ్గించాలనుకునే వాళ్ల‌కు అల్లం మంచి మార్గం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అల్లం తీసుకోవడం వ‌ల్ల శరీరంలో కొవ్వు శాతం త‌గ్గి క్ర‌మంగా బెల్లీని అరిక‌ట్ట‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. అల్లం శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో కొవ్వు పదార్ధాల వినియోగాన్ని కూడా సులభతరం చేస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి, దీని వలన శరీర బరువు మొత్తం తగ్గుతుంది. 

3. పసుపు:

పసుపులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు శరీరంలో యాంటీబ‌యాటిక్ ల‌క్ష‌ణాలు క‌లిగి ఉండ‌డం వ‌ల్ల పొట్ట‌లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. చాలా  అధ్యయనాల ప్రకారం ఇది శరీర కొవ్వు మరియు శరీర బరువును తగ్గించడంలో కూడా  మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంది.  క‌నుక రోజూ  ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కానీ గోరువెచ్చ‌ని పాల‌ల్లో గానీ ప‌సుపు వేసి  ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుంది.

4. జీలకర్ర:

జీలకర్ర లేదా జీరా అనేది  సుగంధ ద్రవ్యంగా ఉపయోగించే ఒక సాధారణ విత్తనం. జీలకర్ర అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అంతేకాక  తరచుగా అతిసారం మరియు ఇతర పొట్ట స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డేవారికి  ఇది చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. జీలకర్ర తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు విచ్ఛిన్నమవుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.  జీలకర్ర వ‌ల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన  కొవ్వును తగ్గించడంలో మరియు ఆరోగ్యకరమైన బరువును పొందడంలో బాగా  సహాయపడతుంది. రోజూ జీల‌క‌ర్ర నీటిని తీసుకంటే బెల్లీ ఫ్యాట్ క్ర‌మంగా త‌గ్గించుకోవ‌చ్చు.

  1. నిమ్మకాయ:

నిమ్మ‌కాయ కూడా బెల్లీ ఫ్యాట్‌ను త‌గ్గించ‌డంలో కీల‌కంగా ప‌నిచేస్తుంది. చ‌ర్మ సంబంధిత వ్యాధులను నివారించడంలో నిమ్మకాయ ఆరోగ్యానికి విలువైనది. ఉదాహరణకు  నిమ్మకాయ కొవ్వు జీవక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. శరీర బరువు మరియు కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. నిమ్మ‌కాయ‌లో ఉండే విట‌మిన్ సి అనేది కొవ్వును క‌రిగించ‌డంలో  ముందుంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. 

6. గ్రీన్ టీ:

గ్రీన్ టీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుది. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల అనేక  వ్యాధులను నివారించుకోవ‌చ్చు. ముఖ్యంగా పొట్ట‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చు.  అనేక జంతు అధ్యయనాల ప్రకారం, గ్రీన్ టీ తీసుకోవడం కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. కొవ్వును తగ్గించడానికి, బరువును నియంత్రించ‌డానికి ప్రతి ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి.  

7. వ్యాయామం:

ఆహార‌పు అలవాట్ల‌తో పాటు శారీరక వ్యాయామం చేయడం కూడా త‌ప్ప‌నిస‌రి. బరువును తగ్గించడంలో సహాయపడటానికి మీరు ప్రతిరోజూ 40 నుంచి 60 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చేయడం అవ‌స‌రం. తక్కువ సమయంతో ప్రారంభించి వ్యాయామ వ్యవధిని నెమ్మదిగా పెంచుకోవచ్చు. బరువులతో వ్యాయామం చేయడం పొట్ట  కొవ్వును క‌రిగించ‌డానికి  సమర్థవంతమైన మార్గం. మరొక ప్రభావవంతమైన వ్యాయామం సిట్-అప్. అలాగే యోగా చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ముఖ్యంగా వ్యాయామంలో ప్లాంక్ చేయాలి.  

8. డైట్ ఫాలో అవండి

శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నియంత్రించే ముఖ్యమైన అంశం ఆహారం ఏం తినాలి, ఎంత ప‌రిమాణంలో తినాలి అనేది చాలా ముఖ్యం. దానిపై చాలా శ్రద్ధ వహించాలి. కూరగాయలు, పండ్లు మరియు తృణధాన్యాలు మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోండి. వైట్ బ్రెడ్, చక్కెర పానీయాలు, శుద్ధి చేసిన ధాన్యాలు వంటి సాధారణ కార్బోహైడ్రేట్లను నివారించండి. ఆరోగ్యకరమైన జీవనం కోసం మీ ఆహారంలో  తగినంత విటమిన్లు మరియు ఖనిజాలు ఉండే విధంగా చూసుకోవాలి.

వీటిని తిన‌కండి:

కేకులు, బిస్కెట్లు, వనస్పతి, పేస్ట్రీలు, ఫ్రైస్, వేయించిన ఆహారాలలో కనిపించే ట్రాన్స్ కొవ్వులు సూపర్ ఇన్‌ఫ్లమేటరీ, శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను కూడా సృష్టిస్తాయి. దీని వలన పొట్ట కొవ్వు సులభంగా పేరుకుపోతుంది. ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version