ఆన్ లైన్ వాహన విక్రయ సంస్థ డ్రూమ్ ఇంటిముంగిటే టెస్ట్ డ్రైవ్, హోమ్ డెలివరీ, ఇంటి వద్దే ధ్రువీకరణ, కాంటాక్ట్-లెస్ చెల్లింపు వంటి సేవలను అందిస్తోంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో డ్రూమ్ ఇటీవల తన కొత్త సి-కామర్స్ సేవలను ఆవిష్కరించింది.
దీనిని భారతదేశమంతటా ప్రారంభించినందున, అధిక సంక్రమణ గల వైరస్ నుండి సమాజాన్ని సంరక్షించడానికి, సామాజిక దూర మార్గదర్శకాలను సమర్థించటానికి, డ్రూమ్ తన కాంటాక్ట్-లెస్ సేవలను అందించడానికి వీలు కల్పిస్తోంది.
ఈ ప్రయత్నంలో భాగంగా డ్రూమ్ తన వినియోగదారులకు డ్రూమ్ డిస్కవరీ, ఓబీవీ, డ్రూమ్ హిస్టరీ మరియు ఎకో తనిఖీ ద్వారా ఆన్‌లైన్‌లో నిశితమైన వాహన తనిఖీని చేయడానికి వీలుకల్పిస్తుంది.
దీనిని అనుసరిస్తూ డోర్ స్టెప్ టెస్ట్ డ్రైవ్, ఇంటి ముంగిటే వాహన ధృవీకరణతో పాటుగా, హోమ్ డెలివరీ విక్రయ సేవలను అందిస్తోంది. డ్రూమ్ పూర్తి ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులు మరియు ఆటోమేటెడ్ ఆర్‌సీ రిజిస్ట్రేషన్, ఆర్సీ బదిలీ సేవలు అందిస్తోంది.
డ్రూమ్ వ్యవస్థాపకుడు సందీప్ అగర్వాల్ మాట్లాడుతూ, “100 సంవత్సరాల ప్రీ-ఓన్డ్ ఆటోమొబైల్ క్లాసిఫైడ్స్ విభాగాన్ని ఆన్‌లైన్ ఎండ్-టు-ఎండ్ కామర్స్ లావాదేవీల విభాగంగా మార్చడానికి డ్రూమ్ గత 6 సంవత్సరాల సమయాన్ని వెచ్చించింది. వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఈ సమయంలో మేం సాంకేతికత మరియు వినియోగదారు అనుభవాల యొక్క అత్యంత అభివృద్ధిని సాధించడమే కాకుండా, 500 వేలకు పైగా వాహనాలను విక్రయించాం.
ఋణాలు, బీమా సౌకర్యం, మరమ్మత్తు, తనిఖీ మొదలైనవాటిని అందించాం. అది కూడా 100% ఆన్‌లైన్ విభాగంలో అందించాం. కోవిడ్-19 మహమ్మారి వినియోగదారుల మనోభావాలలో మార్చలేని పరివర్తనకు దారితీసింది. వినియోగదారుల అవసరాలను సమర్ధవంతంగా తీర్చడంలో మా తాజా నమూనా వీలుకల్పిస్తుంది..” అని వివరించారు.