Home ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫ్రీ మూవీస్‌ ఆన్‌లైన్‌ సైట్స్‌ ఏవో తెలుసా?

ఫ్రీ మూవీస్‌ ఆన్‌లైన్‌ సైట్స్‌ ఏవో తెలుసా?

free movies online
చిత్రం: ఎంఎక్స్ ప్లేయర్ యాప్ నుంచి

ఫ్రీ మూవీస్‌ ఆన్‌లైన్‌ సైట్స్‌ కోసం వెతుకుతున్నారా? అంతేగా మరి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా టీవీ, జీ5, సోని లివ్, ఎంఎక్స్ ప్లేయర్.. ఇలా ఎన్నింటికి సబ్‌స్క్రిప్షన్‌ కట్టగలం.. హాయిగా ఆన్‌లైన్‌లో ఫ్రీ మూవీస్‌ చూసే అవకాశం ఉన్నప్పుడు డబ్బులు ఎందుకు దండగ చేయడం.

కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఉచితంగా సినిమా చూసే అవకాశం ఉన్నా.. పైరసీ మూవీస్‌ చూడడం చాలా మందికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు అందుబాటులో ఫ్రీ గా మూవీస్‌ చూసే అవకాశం కల్పిస్తున్న కొన్ని వెబ్‌సైట్స్, యాప్స్‌ వివరాలు మీకోసం.. మరీ లేటెస్ట్‌ రిలీజ్‌ మూవీస్‌ దొరకకపోవచ్చు.. కానీ మీ అభిరుచిని బట్టి మూవీస్‌ తప్పక చూడొచ్చు.

ఆన్‌లైన్ మూవీస్ అందించే వెబ్ సైట్లలో కొన్ని పైరసీ మూవీలను కూడా ప్రసారం చేసే ప్రమాదం ఉంది. అందువల్ల సైట్ల నాణ్యతను పరిశీలించి, సెక్యూరిటీ అంశాలు పరిగణనలోకి తీసుకుని, స్పామ్ లేని సైట్లను మాత్రమే సందర్శించండి.

ఐ బొమ్మ మూవీస్ తెలుగు

ఐ బొమ్మ పేరుతో ఉన్న వెబ్ సైట్ ఇటీవల ట్రెండీగా మారింది. ఐ బొమ్మ సైట్‌లో కొత్త, పాత తెలుగు మూవీస్ అందుబాటులో ఉన్నాయి. తెలుగు ప్రేక్షకుల కోసం ఎక్స్‌క్లూజివ్ వెబ్ సైట్ అని చెప్పొచ్చు. మొబైల్‌లో డౌన్ లోడ్ చేసుకుని చూడొచ్చు. వీడియో స్ట్రీమింగ్, వీడియో డౌన్ లోడ్ ప్లాట్ ఫామ్‌గా ఈ వెబ్ సైట్ పరిచయం చేసుకుంది.

యూ ట్యూబ్‌

యూట్యూబ్‌ లో అనేక మూవీస్‌ అందుబాటులో ఉన్నాయి. కీ వర్డ్‌ యూజ్‌ చేసేటప్పుడు మూవీ పేరుతోపాటు ఫుల్‌ మూవీ అని టైప్‌ చేస్తే చాలు మీరు కోరుకున్న మూవీ అందుబాటులోకి వస్తుంది. అయితే అన్ని సినిమాలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు.

యూ ట్యూబ్‌లో ఆన్‌లైన్‌ పాఠాల నుంచి ఆన్‌లైన్‌ సినిమాల వరకు అసలు దొరకని విజ్ఞానం లేదనుకోండి. కొన్ని తెలుగు సినిమాలు హిందీలో డబ్‌ అవగానే ఒకే రోజులో మిలియన్, రెండు మిలియన్‌ వ్యూస్‌ వస్తాయంటే వాటికి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.. డబ్బింగ్‌ హక్కులు తీసుకొని నేరుగా యూట్యూబ్‌లో సినిమాలు రిలీజ్‌ చేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి.

కిడ్స్‌ మూవీస్, కామెడి మూవీస్, యాక్షన్‌ మూవీస్, రొమాంటిక్‌.. ఒకటేమిటి.. అన్ని రకాలు చిత్రాలు చూసేయొచ్చు. టీవీ షోలు కూడా చూడొచ్చండీ..

మొబైల్‌ నెట్‌వర్క్‌ యాప్స్‌లో..

ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెట్ వర్క్ ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్ పేరుతో ఓటీటీ సేవలు అందిస్తోంది. లైబ్రరీలో ఉన్న సినిమాలు ఉచితంగా చూడొచ్చు. అత్తారింటికి దారేది, జాన్‌ విక్, జురాసిక్‌ పార్క్, ట్విలైట్‌ వంటి పాపులర్‌ మూవీస్‌తో కూడిన లైబ్రరీ ఉంది. అనేక హాలీవుడ్‌ మూవీస్‌ తెలుగులోకి డబ్బింగ్‌ అయినవీ ఉన్నాయి. ఎవర్‌ గ్రీన్‌ క్లాసిక్స్, కిడ్స్, షార్ట్‌ ఫిల్మ్స్ వంటి కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి.

అలాగే జియో మొబైల్‌ నెట్‌ వర్క్స్‌ కూడా జియో సినిమా పేరుతో ఉచితంగా మూవీస్, టీవీ షోస్‌ అందిస్తోంది. వోడాఫోన్‌ కూడా ఉచితంగా ఫలు సినిమాలు అందిస్తోంది.

ఎంఎక్స్‌ ప్లేయర్‌

ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో పాపులర్‌. దీనిలో వెబ్‌ సిరీస్‌లతోపాటు అనేక సినిమాలు ఉచితంగా చూడొచ్చు. భాషలవారీగా ఎంపిక చేసుకోవచ్చు. అలాగే కామెడీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, హారర్‌ వంటి జనర్స్‌లో మూవీస్‌ అందుబాటులో ఉన్నాయి.

ట్యూబి టీవీ

ట్యూబి టీవీ లో కూడా కొత్త సినిమాలు దొరకకపోవచ్చు. కానీ అనేక క్లాసిక్‌ మూవీస్, హిట్‌ మూవీస్‌ అందుబాటులో ఉన్నాయి. పాపులర్‌ సినిమాలు గోయింగ్‌ టు అమెరికా, లవ్‌ ఫర్‌ సేల్, 2020 ఫాలెన్‌ ఎర్త్‌ వంటి మూవీస్‌ ట్యూబి టీవీలో చూడొచ్చు. ట్యూబి టీవీ యాప్‌ కూడా అందుబాటులో ఉంది.

హూప్లా డిజిటల్‌

హూప్లా డిజిటల్‌ లో కూడా అనేక మూవీస్‌ ఉచితంగా చూడొచ్చు. పబ్లిక్‌ మూవీ లైబ్రరీగా ఆ సైట్‌ తనను వర్ణించుకుంది. మొబైల్‌లో కూడా యాప్‌ ద్వారా చూడొచ్చు. ఇందులో రిలీజ్‌ డేట్‌ ఆధారంగా, గడిచిన ఏడు రోజుల్లో, గడిచిన నెల రోజుల్లో, గడిచిన ఏడాదిలో జత అయిన సినిమాలను ఎంచుకునే వీలుంది. అలాగే పాపులర్‌ మూవీస్‌ కేటగిరీ కూడా ఉంది. స్టార్‌ రేటింగ్‌ను బట్టి మూవీస్‌ చూడొచ్చు.

వూడూ

వూడూ వెబ్‌సైట్‌లో సినిమా అద్దె ప్రాతిపదికన చూడొచ్చు. కొనుగోలు చేసి చూడొచ్చు. అలాగే అనేక సినిమాలు, టీవీ షోలు కూడా చూడొచ్చు. అయితే మధ్య మధ్య యాడ్స్‌ వస్తుంటాయి.

సబ్‌స్క్రిప్షన్ రుసుము చెల్లించి చూడగలిగేవి..

అమెజాన్ ప్రైమ్ వీడియోస్

అమెజాన్ సంస్థ ప్రైమ్ వీడియోస్ ద్వారా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ .. ఇలా అన్ని భాషల చిత్రాలను చూడొచ్చు. అయితే సంవత్సరానికి దీని సబ్ స్క్రిప్షన్ రూ. 999గా ఉంది. విభిన్న భాషల్లో పాతవి, కొత్తవి, పాపులర్ మూవీస్ చూడొచ్చు. అలాగే అమెజాన్ ఒరిజనల్ వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి.

నెట్ ఫ్లిక్స్

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తరహాలోనే నెట్ ఫ్లిక్స్ కూడా అన్ని భాషల చిత్రాలను అందిస్తోంది. మొబైల్ డివైజ్‌పై సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలంటే నెలకు రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కూడా విభిన్న జోనర్లలో మూవీలు అందుబాటులో ఉంటాయి. టాప్ మూవీస్, టాప్ వెబ్ సిరీస్, ఇలా రకరకాల కేటగిరీలుగా అందుబాటులో ఉంటాయి. స్పానిష్, మెక్సికన్ భాషల్లో పాపులర్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి.

ఆహా టీవీ

తెలుగు నిర్మాత అల్లు అరవింద్ తెచ్చిన ఓటీటీ ఆహా టీవీలో కూడా చాలా మూవీస్ అందుబాటులో ఉన్నాయి. దీని సబ్ స్క్రిప్షన్ ఏడాదికి రూ. 399. ఆఫర్లలో రూ. 299కే లభిస్తుంది. ఇందులో కూడా వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇవే కాకుండా, జీ 5, సోనీ ఎంటర్‌టైన్మెంట్ వారి సోనీలివ్ వంటి అనేక యాప్‌లు, వెబ్ సైట్లు ఆన్‌లైన్ మూవీస్ కోసం వేదికగా పనిచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

  1. బెస్ట్ ఓటీటీ సర్వీసులేంటి?
  2. తప్పకచూడాల్సిన వెబ్ సిరీస్ ఏంటి
  3. ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ రివ్యూ
Exit mobile version