Home ఫుడ్ బత్తాయి రసం .. సీ విటమిన్‌ సహితం.. రోగాలకు ఔషధం

బత్తాయి రసం .. సీ విటమిన్‌ సహితం.. రోగాలకు ఔషధం

sweetlime juice
Image by Shutterbug75 from Pixabay

బత్తాయి రసం లేదా మోసంబి లేదా స్వీట్‌ లైమ్‌ జ్యూస్ .. పేరేదైనా సీ విటమిన్‌ మెండుగా ఇస్తూ రోగ నిరోధక శక్తిని ఇచ్చి కరోనా తదితర ఫ్లూ రోగాలను దరి చేరనివ్వని ఈ జ్యూస్ కు సీజన్‌ ప్రారంభమైంది. కరోనా తదితర వైరస్‌లను ఎదుర్కొనేందుకు మన శరీరానికి కావాల్సినంత రోగ నిరోధక శక్తిని నింపుకోవల్సిన సమయం ఇది. మరి బత్తాయి జ్యూస్ ద్వారా సమకూరే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

1. బత్తాయి నిండా సీ విటమిన్‌

బత్తాయి పండ్లలో సీ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. సీ విటమిన్‌ను ఆస్కార్బిక్‌ యాసిడ్‌ అని కూడా పిలుస్తారు. శరీరంలో అనేక జీవక్రియలు సక్రమంగా సాగడానికి ఇది తోడ్పడుతుంది. ఈ విటమిన్‌ను శరీరంలో నిల్వ చేసుకోలేం. అందువల్ల ఎప్పటికప్పుడు రోజువారీ ఆహారంలో తీసుకోవాలి.

బత్తాయి ద్వారా మనం పుష్కలంగా ఈ విటమిన్‌ను తీసుకోవచ్చు. అలాగే సీ విటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వైరస్‌లను, ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.

శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ ద్వారా కలిగే నొప్పులను కూడా బత్తాయి హరిస్తుంది. జలుబు, ఫ్లూ వంటి వాటì కి చికిత్సగా ఉపయోపడుతుంది.

2. బత్తాయితో శరీర మలినాలు ఖతం

బత్తాయి రసం శరీరంలో మలినాలను తొలగిస్తుంది. ఇదొక క్లెన్సర్‌లా పనిచేస్తుంది. లివర్‌ను శుద్ధి చేస్తుంది. కాలుష్యం, ఒత్తిడి, మద్యం, దూమపానం వంటి కారణాల వల్ల శరీరంలో తయారయ్యే టాక్సిన్లను తొలగిస్తుంది.

బత్తాయి జ్యూస్ తీసుకోగానే తరచుగా మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అంటే మీలో టాక్సిన్లు ఎక్కువగా ఉన్నప్పుడు మలం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.

మల బద్దకం ఉన్న వారికి కూడా ఇదొక ఔషధంలా పనిచేస్తుంది. ఇందుకు కారణం ఈ పండులో ఉండే ఫైబర్‌. ఈ ఫైబర్‌ జీర్ణ క్రియ సాఫీగా సాగేలా చేస్తూ మల బద్ధకాన్ని నయం చేస్తుంది.

3. స్కర్వీకి ఔషధంలా బత్తాయి రసం

విటమిన్‌ సీ లోపం వల్ల వచ్చే స్కర్వీ వ్యాధి నివారణకు బత్తాయి ఔషధంలా పనిచేస్తుంది. పళ్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం, శరీరంపై రాషెస్‌ రావడం, నీరసం వంటి లక్షణాలు ఈ స్కర్వీ వ్యాధిలో కనిపిస్తాయి. బత్తాయి రసం దీనికి ఔషధంలా పనిచేస్తుంది.

4. కండరాలు, చర్మం, వెంటుక్రలకు శక్తినిచ్చే బత్తాయి

కొందరికి కండరాల నొప్పులు ఉంటాయి. కొందరికి పిక్క వద్ద కండరాలు పట్టేస్తుంటాయి. శరీరంలో అనేక భాగాల్లో కండరాల నొప్పులు ఎదురవుతాయి. ముఖ్యంగా వర్కవుట్లు చేసే వారికి, అథ్లెట్లకు ఈ సమస్య ఉంటుంది. దీనికి బత్తాయి ఔషధంలా పనిచేస్తుంది. అలసటను తీరుస్తుంది. శక్తినిస్తుంది.

అలాగే ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడుతుంది. మలినాలు తొలగించే గుణాలు ఉన్నందున మొటిమలు ఉన్నవారికి ఔషధంగా పనిచేస్తుంది. శరీరం ముడతలు పడకుండా నివారిస్తుంది. అలాగే వెంటుక్రలు ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.

5. ఎముకలకు, కంటి చూపు కాపాడేందుకు బత్తాయి

ఓస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వల్ల ఎదురయ్యే ఎముకల నొప్పులకు బత్తాయి రసం ఔషధంలా పనిచేస్తుంది. ఎముకలు పుష్టిగా ఉండేందుకు తోడ్పడుతుంది.

బత్తాయిలో ఉండే యాంటిఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టిరియల్‌ గుణాల కారణంగా కంటి చూపు కాపాడేందుకు దోహదం చేస్తుంది. కాటరాక్ట్‌ రాకుండా కాపాడుతుంది.

బత్తాయి రసం ఆరోగ్య ప్రయోజనాలు చూశారు కదా.. ప్రస్తుతం బత్తాయి పండ్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నందున తరచుగా రసం రూపంలో తీసుకోండి. మీలో నూతనోత్సాహాన్ని గమనించండి..

ఇవి కూడా చదవండి..

  1. కొవ్వు, మలినాలు తొలగించే ఆహారం ఇదిగో..
  2. ఆరోగ్యం కాపాడుకునేందుకు ఆరు మార్గాలు
  3. హెల్త్ ఇన్సూరెన్స్ .. ఆరోగ్యానికి ధీమా
Exit mobile version