కోవిడ్ -19కు చికిత్సగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ సానుకూల ఫలితాలను ఇచ్చినట్టు అమెరికా కంపెనీ గిలియాడ్ సైన్సెస్ (gilead sciences) ప్రకటించింది. ఎబోలా వైరస్ చికిత్సలో వాడే ఈ రెమ్ డెసివిర్ (remdesivir) ఇంజెక్షన్ ను కోవిడ్-19 వ్యాధికి నేరుగా ఉపయోగించే ఔషధంగా గిలియాడ్ సైన్సెస్ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.
ఐదు రోజుల డోసెజ్, పది రోజుల డోసెజ్ చికిత్స విధానంలో పరీక్షించామని, రెమ్డెసివిర్ కోవిడ్ వైరస్ ను నియంత్రించడంలో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని బుధవారం ఆ కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకు 397 మంది కోవిడ్ పేషెంట్లపై ట్రయల్స్ చేసినట్టు కంపెనీ తెలిపింది.
యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ ఈ యాంటీ వైరల్ మెడిసిన్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అనుమతులు లభిస్తే ట్రీట్ మెంట్ ప్రోటో కాల్ లో రెడ్ మెసివిర్ చేరుతుంది.
10 రోజుల పాటు ఈ ఇంజెక్షన్ ను ఇస్తే వెంటిలేటర్ సహాయం లేకుండానే తీవ్ర న్యూమోనియో నుంచి రోగులు కోలుకున్నట్టు గిలిడియా ప్రకటించింది.
కోవిడ్-19 కు నేరుగా పనిచేసే చికిత్సా విధానం సక్సెస్ అవడంతో అమెరికా షేర్ మార్కెట్ కోలుకుంది. సదరు కంపెనీ షేర్లు 9 శాతం మేర పెరిగాయి.
ప్రస్తుతం ఒక ఇంజెక్షన్ ధర రూ. 76 పలుకుతోందని సమాచారం. ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి