ఇన్ఫినిక్స్ హాట్ 8 సిరీస్ విజయవంతమైన నేపథ్యంలో హాట్ 9, హాట్ 9 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. స్మార్ట్ ఫోన్ల రంగంలో తన వాటాను మరింత బలోపేతం చేసేందుకు తాజాగా రూ. 10 వేల లోపు ధరలో ఈ రెండు మొబైల్స్ విడుదల చేసింది.
ప్రీమియం డిజైన్, హెచ్డీ + డిస్ప్లే , శక్తివంతమైన ధ్వని, అత్యుత్తమ కెమెరా పనితీరు, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ డిడిఆర్4 ర్యామ్, హెలియో పి22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో ఉత్తమ పనితీరు, ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్‌తో పాటు డ్యూయల్ విఓఎల్టీఈ వంటి ప్రత్యేకతలతో తాజా సిరీస్ స్మార్ట్ ఫోన్లను తెచ్చింది.
హాట్ 9 ప్రో మరియు హాట్ 9 ఫ్లిప్ కార్ట్ లో జూన్ 5, జూన్ 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటాయి. హాట్ 9 ధర రూ. 8,499గా, హాట్ 9 ప్రో సిరీస్ ధర రూ. 9,499గా ఉంది.
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90.5% స్క్రీన్-టు-బాడీ రేషియో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్‌లు 4 జీబీ ర్యామ్ / 64 జిబి రామ్‌తో ఆక్టా-కోర్ మీడియా టెక్లియో పి 22 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 10 ఎక్స్‌ఓఎస్ 6.0 డాల్ఫిన్‌పై పనిచేస్తాయి.
సోషల్ టర్బో వాట్సాప్ కాల్ రికార్డర్, వీడియో కాల్ బ్యూటీ, స్టిక్కర్ మేకర్ మరియు క్లీన్ వాట్సాప్ వంటి అనేక కొత్త ఫీచర్లను అందిస్తోంది. స్టిక్కర్ మేకర్ ఫన్నీ స్టిక్కర్లను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. వినూత్న వీడియో బ్యూటీ మోడ్ మీ వీడియో ఫీడ్‌ను ప్రత్యక్ష కాల్‌లో అందంగా మార్చడానికి వీలుకల్పిస్తుంది.
ఈ ఆవిష్కరణ గురించి ఇన్ఫినిక్స్ ఇండియా సిఇఒ అనీష్ కపూర్ మాట్లాడుతూ, “భారతదేశం అంతటా ఉన్న మా వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా, ప్రపంచ స్థాయి స్మార్ట్‌ఫోన్ అనుభవాలను ఇన్ఫినిక్స్ ద్వారా అందించడానికి కొత్త ఆవిష్కరణలు చేయడంపై మా దృష్టి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొత్త బెంచిమార్కు ఏర్పరుస్తుందని మేం విశ్వసిస్తున్నాం..” అని వివరించారు.
ఇన్ఫినిక్స్ ఇప్పటికే భారతదేశంలో స్మార్ట్ 3 ప్లస్, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 5 లైట్, ఎస్ 5 ప్రో మరియు హాట్ 7, హాట్ 7 ప్రో మరియు హాట్ 8 తో సహా దాని హాట్ సిరీస్‌లోని ఫోన్‌లతో సహా అనేక పరికరాలను విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ నోయిడాలోని కంపెనీ తయారీ కేంద్రం నుంచి ఫోన్‌లను తయారు చేస్తుంది.
ఇవీ చదవండి