ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు .. బీటెక్ ఏఐ కోర్సు .. కుర్రకారులో చాలా క్రే జ్ తెచ్చిన కోర్సు ఇది. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపుచ్చుకుంటున్న ఈ తరుణంలో రాబోయే దశాబ్దమంతా ఈ కోర్సుకు ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే ఉన్న ఉద్యోగాలకు నిపుణుల కొరత ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు అందిస్తున్న కళాశాలల జాబితా తెలుసుకోవాలనుందా? డియర్ అర్బన్ డాట్ కామ్ మీకోసం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. 2019–20లో ఈ కోర్సు అందించిన కళాశాలల జాబితా ఇస్తున్నాం.
2020–21లో కొత్తగా ఏఐసీటీఈ అనుమతి పొంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు అందించే కళాశాలల వివరాలను కూడా త్వరలోనే అప్‌డేట్ చేస్తాం. కింద ఇస్తున్న జాబితా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించింది. అంటే బీటెక్ తత్సమాన కోర్సు.
రాష్ట్రం ఏఐ కోర్సు అందిస్తున్న కళాశాల
తెలంగాణ 1. ఇక్ఫాయ్(డీమ్డ్ వర్శిటీ), దొంతనపల్లి, హైదరాబాద్
2. విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్
3. అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్, హైదరాబాద్
కర్ణాటక 1. బీఎంఎస్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, బెంగళూరు
2. అమృత విశ్వ విద్యాపీఠం(డీమ్డ్ వర్శిటీ) బెంగళూరు క్యాంపస్
తమిళనాడు 1. ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(డీమ్డ్ వర్శిటీ)
2. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూర్
3. అమృత విశ్వవిద్యాపీఠం(డీమ్డ్ వర్శిటీ) కోయంబత్తూర్
4. శ్రీరామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (డీమ్డ్ వర్శిటీ)
కేరళ 1. అమృత విశ్వవిద్యాపీఠం, అమృతపురి క్యాంపస్, కొల్లాం
మహారాష్ట్ర 1. జి.హెచ్.రాయ్‌సోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, నాగ్‌పూర్
రాజస్తాన్ 1. జేఐఈటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ, జోద్‌పూర్
ఉత్తరప్రదేశ్ 1. ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, ఘాజియాబాద్
2020–21 విద్యా సంవత్సరానికి ఏఐ కోర్సు మరిన్ని కళాశాలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏఐసీటీఈ ఈ కోర్సుకు ఇటీవలే ప్రత్యేకంగా సిలబస్ రూపొందించింది.
ఏఐ అంటే ఏమిటి?
కంప్యూటర్ సిస్టమ్ ఎలా అడాప్ట్ చేసుకుంటుంది? ఎలా అభివృద్ధి చెందుతుంది? ఎలా నేర్చుకుంటుంది? వంటి అంశాలతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముడివడి ఉంటుంది. ప్రతి రంగంలో ఇది అప్లై అవుతోంది. ఇదొక పెద్ద సాంకేతిక మార్పు. పారిశ్రామిక విప్లవం, కంప్యూటర్ ఆవిష్కరణ, స్మార్ట్ ఫోన్ విప్లవం వంటిదే ఈ ఏఐ కూడా.
ఇప్పటికే ఆరోగ్య రంగంలో, రక్షణ రంగంలో, వ్యవసాయ రంగంలో, స్మార్ట్ ఫోన్లలో మనం ఏఐ వినియోగిస్తున్నాం. మానవ మేథస్సు కృత్రిమ మేథస్సు రూపంలో అందించడమే ఈ ఏఐ.
ఉదాహరణకు మనం మొబైల్‌లో టైప్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన వర్డ్స్ మనకు ముందుగానే కీపాడ్ సూచిస్తుంది. అంటే అక్కడ కృత్రిమ మేథస్సు పనిచేస్తోందన్నమాట.
అలాగే ఓకే గూగుల్, అలెక్సా వంటివన్నీ ఈ కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) ఆధారంగా పనిచేస్తున్నవే.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో ఉండే సిలబస్ ఏంటి?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు చేసేందుకు పైథాన్ బేసిక్ ప్రోగ్రామింగ్ తెలిసి ఉంటే మంచిది. అలాగే డేటా స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి. సెర్చ్‌కు, గేమ్స్‌కు బిల్డింగ్ ఏజెంట్లను రూపొందించడం, ఏఐ సమస్యలను పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా పరిష్కరించడం, అల్గారిథమ్స్ ద్వారా ఆప్టిమైజేషన్ ఇలాంటి అంశాలు నేర్చుకునేందుకు వీలుగా ఏఐసీటీఈ సిలబస్ రూపొందించింది.
ఇవి కూడా చదవండి