Home ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ రివ్యూః పొన్మగల్‌ వంధల్‌ : రేప్‌ బాధితుల గొంతుక

మూవీ రివ్యూః పొన్మగల్‌ వంధల్‌ : రేప్‌ బాధితుల గొంతుక

ponmagal vandal review
[yasr_overall_rating null size=”medium”]

మూవీ రివ్యూ : పొన్మగల్‌ వంధల్‌
మూవీ రేటింగ్ : 3/5
డైరెక్టర్ : జేజే ఫ్రెడ్రిక్‌
నిర్మాత : సూర్య
నటీనటులు : జ్యోతిక, పార్తీబన్, భాగ్యరాజ్, త్యాగరాజన్, ప్రతాప్‌ పోతన్‌

పొన్మగల్‌ వంధల్‌ ఓటీటీలో నేరుగా విడుదలైన తమిళ సినిమా. అమెజాన్‌ ప్రైమ్ ‌లో శుక్రవారం విడుదలైంది. నటుడు సూర్య నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక జ్యోతిక. లాక్‌డౌన్‌ కాలంలో కొత్త సినిమాలు లేక ప్రేక్షకులకు నిరాశ మిగలగా.. అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల చేసి కొత్త సినిమాలు లేవన్న లోటును పూడ్చారు.

అయితే థియేటర్‌ లాక్‌డౌన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం. పొన్మగల్‌ వంధల్‌ అంటే ప్రేమపాత్రమైన అమ్మాయి వచ్చింది అని అర్థం. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రానికి ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉండడంతో తమిళ సినిమా అయినప్పటికీ సులువుగా అర్థమవుతుంది.

పొన్మగల్ వంధల్ కథ:

మనం రోజూ రేప్‌ గురించి, చిన్న పిల్లల కిడ్నాప్, అత్యాచారం గురించి వార్తల్లో వింటాం. నిర్భయ వంటి కేసులో, దిశ వంటి కేసులో వచ్చినప్పుడు తాత్కాలికంగా కొద్దికాలం స్పందిస్తాం. ఆ తరువాత వదిలేస్తాం.

రోజువారీ వచ్చే అత్యాచారాలు, హత్యలు మనల్ని పెద్దగా కదిలించవు. వారిని బాధితురాలిగా చూస్తాం. కానీ స్వయంగా బాధితురాలిగా ఉండి న్యాయం కోసం పదిహేనేళ్ల తరువాత పోరాడిన ఓ అమ్మాయి గాథ ఇది. రేప్‌ బాధితులు, కిడ్నాప్‌కు గురైన చిన్నారులు, వారి తల్లిదండ్రులకు గొంతుక ఇది.

చిన్నారులను కిడ్నాప్‌ చేసి వరుస హత్యలకు పాల్పడుతున్న జ్యోతి అనే మహిళ ఎన్‌కౌంటర్‌కు గురైందన్నది పోలీసుల కథనం. పదిహేనేళ్ల క్రితం వార్త ఇది.

న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టిన ఓ అమ్మాయి(జ్యోతిక) ఈ క్రిమినల్‌ కేసుపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తుంది. ఈ కేసులో అసలు వాస్తవాలను వెలికి తీయాలన్న ఆలోచనతో పదిహేనేళ్లుగా ఈ కేసు గురించి అనేక సాక్ష్యాధారాలు సేకరిస్తుంది.

ఈ కేసుతో జ్యోతికకు ఏంటి సంబంధం? జ్యోతిక పోరాడింది ఎవరి కోసం? కేసును పోలీసులు ఎందుకు తారుమారు చేశారు? ఎవరిని రక్షించారు? జ్యోతిక ఈ కేసు నెగ్గిందా? ఇలాంటి ట్విస్టులన్నింటికీ విచారణ క్రమంలో సమాధానం దొరుకుతుంది.

విశ్లేషణ :

రేప్‌ బాధితులు అనుభవించిన మానసిక క్షోభ, వారి జీవిత పోరాటాన్ని ఈ సినిమా కళ్లకు కడుతుంది. పలుమార్లు గుండెల్ని పిండేస్తుంది. కంట తడి పెట్టిస్తుంది.

రేప్‌ బాధితులు గొంతు విప్పేందుకు ప్రేరణ కల్పిస్తుంది. సినిమా ద్వితీయార్థం అంతా కోర్టు విచారణ, సాక్ష్యాలను ప్రవేశపెట్టడం వంటి సన్నివేశాలతోనే నడవడం, జ్యోతిక వద్ద నేరాన్ని నిరూపించేందుకు పూర్తిస్థాయిలో సాక్ష్యాలు లేకపోయినా న్యాయస్థానం దోషులకు శిక్ష విధించడం వంటి లోపాలు కనిపించాయి.

ఎక్కువగా భావోద్వేగపూరిత సన్నివేశాలపైనే దర్శకుడు ఆధారపడ్డాడు. సందేశాత్మక చిత్రం కాబట్టి కొద్దిగా లోపాలను కవర్‌ చేసుకోగలిగాడు.

నటీనటుల పర్‌ఫార్మెన్స్:

జ్యోతిక ద్విపాత్రాభినయం చేసింది. రెండు పాత్రలకూ న్యాయం చేసింది. ఎన్‌కౌంటర్‌కు గురైన జ్యోతిగా, న్యాయవాది వెంబ గా రెండు విభిన్నపాత్రలు. జోతి పాత్రలో ఒదిగిపోయింది. తన పాపకు జరిగిన అన్యాయాన్ని చూసి చలించిన తీరు కంటతడిపెట్టిస్తుంది.

న్యాయవాది వెంబ తండ్రి పాత్రలో భాగ్యరాజ్‌ జీవించారు. అలాగే ప్రాసిక్యూటర్‌గా పార్తీబన్‌ కూడా అలరించారు.

ఇవీ చదవండి:

  1. ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ రివ్యూ
  2. ఆర్టికల్ 15 మూవీ రివ్యూ
Exit mobile version