Home ట్రావెల్ మనోడు బాగా హర్ట్ అయ్యాడు..!

మనోడు బాగా హర్ట్ అయ్యాడు..!

google maps
Image Source: Instagram

నం ఏదైనా పనిమీద ఒక మహానగరానికి వెళ్లాల్సి వస్తే మనకు కావాల్సిన చిరునామా ఎలా కనుక్కోవాలంటూ తెగ మదనపడిపోయేవాళ్లం. ఊరి నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి మహానగరం చేరే వరకు మనకు కావాల్సిన చిరునామా కోసం ఎవర్ని అడగాలి, అలా అడి కనుక్కొని వెళ్లేలోపు మనం గమ్యం ఎప్పుడు చేరతాం.. ఇవే ఆలోచనలు ఇన్నాళ్లపాటు మన బుర్రలో తిరుగుతుండేవి.

కానీ గూగుల్ మ్యాప్స్ వచ్చాక మనకు ఆ బెంగ దాదాపుగా తీరిపోయిందనే చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్లాలన్న మనం మన ప్రయాణం ప్రారంభించిన చోటు నుంచి గమ్యం చేరే వరకు గూగుల్ మ్యాప్స్ మనకు సహాయం చేస్తుంటాయి. మన గమ్యం ఎంతదూరం ఉంది, ఎలా వెళ్లాలి అన్న మన బెంగ తీర్చే విషయాలను వాయిస్ అసిస్ట్ ద్వారా మనకు గూగుల్ మ్యాప్స్ తెలియజేస్తూ ఉంటుంది.

కానీ మహానగరాల్లో అధిక సంఖ్యలో ఫ్లై ఓవర్లు, యూటర్నులు ఉండడం వల్ల ఒకింత ఇబ్బంది పడాల్సి రావొచ్చు. గమ్యం చేరేందుకు కాస్త ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావొచ్చు. ఒక రహదారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో ఫ్లై ఓవర్ వస్తుంది.. అది ఎక్కకుండానే మనం పక్కకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి ఉండొచ్చు.

అలాంటప్పుడు మన చిన్నిపాటి ఫోన్లోని స్ర్కీన్లో, లేదా కారులోని స్క్రీన్ లో అది కనిపించకపోవచ్చు. దీంతో మనం యూటర్న్ తీసుకోవాల్సిన చోటు తెలియక ఫ్లై ఓవర్ ఎక్కేస్తాం. ఇక ఫ్లై ఓవర్ ఎక్కిన తరువాత చేసేది ఏముంటుంది..!

మొత్తం ఫ్లై ఓవర్ ఎలా కట్టారో ఒకసారి చూసుకొని మళ్లీ యూటర్న్ తీసుకొని వెళ్లాల్ని ఉంటుంది. ఇలాంటి సమస్యే స్టాండప్ కమేడియన్ కార్తిక్ అరోరాకు వచ్చింది. దీంతో బాగా హర్ట్ అయినట్టు ఉన్నాడు.. అసలే మనోడు స్టాండప్ కమేడియన్. ఇక తనదైనశైలిలో స్పందిస్తూ గూగుల్ కు ఒక సందేశం పంపాడు.

ఫ్లై ఓవర్ ఎక్క మంటారా!.. లేదా కిందికెళ్లి పొమ్మంటారా!

గూగుల్ మ్యాప్స్ లో ఫ్లై ఓవర్ ముందున్న డిఫ్లెక్షన్ (మలుపు) చిన్నపాటి స్క్రీన్ లో కనిపించకపోయే సరికి కార్తిక్ ఆరోరా ఫ్లై ఓవర్ ఎక్కేశాడు. దీంతో చేసేదేముంది..! ఫ్లై ఓవర్ ను దాటుకొని మళ్లీ వెనక్కు వచ్చాడు. తను ఎదుర్కొన్న, తను భావిస్తున్న ఈ అతిపెద్ద సమస్యను ఎలాగైనా గూగుల్ కు తెలియజేయాలని వారికి ఒక సందేశం పాంపాడు.

డియర్ గూగుల్,

‘ఇంత మంచి యాప్ రూపొందించారు. అందులో ఇంకో ఫీచర్ కూడా జోడించి.. ఫ్లై ఓవర్ ఎక్కాలా! లేదా కింద నుంచి పోవాలో కూడా చెప్పేస్తే బాగుంటుంది. ఐదు అంగుళాల స్ర్కీన్ లో సగం మిల్లీమీటర్ డిఫ్లెక్షన్ ఎలా కనిపిస్తుంది మనుషులకు’

ఇట్టు మీ విధేయుడు,

రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి యూటర్న్ తీసుకున్న వ్యక్తిని..

..అంటూ గూగుల్ కు సందేశం పంపాడు. దీనికి గూగుల్ ఇండియా కూడా కవితాత్మకంగా బదులిచ్చింది.

ఈ ప్రయాణం ఆగదు నా తోటి ప్రయాణికుడా..

(షుకర్ మనాతే హే ఆప్ జైసే యూజర్ కా, జో హమే సహీ రాహ్ దిఖాతేహే. బెహతర్ బంతే జానేకా ఈ సఫర్ కభీ రూఖేగా నహీ, మేరే హంసఫర్)

నిరంతరం సరైన మార్గాన్ని చూపే మీ లాంటి యూజర్స్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నిరంతరం అభివృద్ధి చెందుతూ సాగే ఈ ప్రయాణం ఎన్నటికీ ఆగదు.. నా తోటి ప్రయాణికుడా! అంటూ గూగుల్ కవితాత్వకంగా బదులిచ్చింది. గూగుల్ ఈ సమస్యకు పరిష్కారం చూపేవరకు.. అలా అన్ని ఫ్లై ఓవర్లు ఎక్కేసి ఎలా కట్టారో చూసేద్దాం.

Exit mobile version