Home న్యూస్ Maruti suzuki jimny: మారుతీ సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?

Maruti suzuki jimny: మారుతీ సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?

0
Maruti suzuki jimny: మారుతీ సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
మారుతీ సుజుకీ జిమ్ని

Maruti suzuki jimny: మారుతి సుజుకి జిమ్నీ అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. భారతీయ మార్కెట్లోకి రావాల్సి ఉంది. తాజాగా ఆస్ట్రేలియన్ మార్కెట్ కోసం సుజుకి జిమ్నీ స్పెషల్ హెరిటేజ్ ఎడిషన్ ఆవిష్కరించింది. ఈ కొత్త ఎడిషన్‌లో కేవలం 300 యూనిట్లు మాత్రమే విడుదల చేసింది. దీని ధర భారతీయ కరెన్సీలో సుమారు రూ.18 లక్షలు. కొత్త ఎడిషన్ అనేక మార్పులతో కూడి ఉంది. సుజుకి జిమ్నీ కొత్త హెరిటేజ్ ఎడిషన్ ఎస్‌యూవీ జిఎల్ఎక్స్ వేరియంట్ ఆధారంగా ఉంటుంది. ఎస్‌యూవీ సాధారణ రూపానికి భిన్నంగా ఉండటానికి లుక్‌లో కొన్ని మార్పులు చేశారు. 

జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్ బ్లాక్ పెర్ల్, జంగిల్ గ్రీన్, వైట్, మీడియం గ్రే వంటి అనేక కొత్త రంగుల్లో వచ్చింది. వీటిలో వైట్ కలర్ మాత్రమే స్టాండర్డ్ వెర్షన్‌లో లభిస్తుంది. సుజుకి జిమ్నీలోని ఫీచర్లలో లెదర్‌తో కూడిన స్టీరింగ్ వీల్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నావిగేషన్, క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, డ్యూయల్ స్పీకర్ ఆడియో సిస్టమ్ అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.

కాగా ఈ ఐదు డోర్ల మారుతి సుజుకి జిమ్నీ ఇండియాలో విడుదల కావాల్సి ఉంది.  ఈ ఎస్‌యూవీ 2023 ఆటో ఎక్స్ పోలో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అయితే మారుతీ సుజుకీ ఈ కొత్త ఎస్‌యూవీ కోసం బుకింగ్ ప్రారంభించింది. ఎస్‌యూవీ ధరపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఈ కారు స్పెసిఫికేషన్లు, ఇండియన్ మార్కెట్ ను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఎస్‌యూవీ ధర రూ. 10-18 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఇది లాంచ్ అయిన తరువాత మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా వంటి వాటికి పోటీగా ఉంటుంది.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.