Latest

Breakfast Food: ఉదయాన్నే తినే అల్పాహారం రోజంతా మనిషిలో చాలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ రోజుల్లో చాలామంది చేసే పొరపాటు అల్పాహారాన్ని పూర్తిగా మానేయడమే. బరువు పెరుగుతున్నామనో లేక సమయం కుదరట్లేదనో ఇంకేవో కారణాల చేత ఉదయం బ్రేక్ ఫాస్ట్ వదిలేస్తున్నారు. మనిషి అరోగ్యం చాలావరకు ఉదయం తినే అల్పాహారం మీదే ఆధారపడి ఉంటుంది. మరి అల్పాహరంలో ఎలాంటి పదార్ధాలను చేర్చితే రోజంతా ఉత్సాహంగా ఉంటారో ఈ స్టోరీలో మీ కోసం అందిస్తున్నాం.

గ్రీక్ యోగర్ట్ పాఫే (Greek Yogurt Parfait)

గ్రీకు పెరుగు, వివిధ రకాల బెర్రీలు, తేనె, గ్రానోలా.. మొదలైనవాటిని ఒక బౌల్‌లో ఒక్కొక్కటిగా పొరలుగా వేయాలి. ఈ ప్రోటీన్ ప్యాక్డ్ ఫుడ్ చాలా బలం ఇస్తుంది.

గుడ్లు, పాలకూర:

గుడ్లు, పాలకూర, చీజ్, ఉప్పు, మిరియాల పొడి కలిపి తీసుకోవాలి. ఉడికించిన గుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పాలకూర శరీరంలో రోగ నిరోధకతను అందించి అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. 

క్వినోవా బ్రేక్‌ఫాస్ట్:

ఉడికించిన క్వినోవా, అవకాడో, చెర్రీ టమోటా, చికెన్ బ్రెస్ట్, గుమ్మడి గింజలు, నిమ్మరసం తీసుకోవాలి. క్వినోవాను ఉడికించాలి. అవకాడో ముక్కలు, సగానికి తరిగిన చెర్రీ టమోటా, ఉడికించిన చికెన్ బ్రెస్ట్ వేయాలి. గుమ్మడి విత్తనాలు కూడా  అరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

కాటేజ్ చీజ్, ఓట్స్:

కాటేజ్ చీజ్, గుడ్లు, ఓట్స్ పిండి, బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎస్సెన్స్, బెర్రీలు తీసుకోవాలి. బెర్రీలు మినహాయిస్తే మిగిలినవి అన్నీ మిక్స్ చేసుకుని పెనం మీద దోశల్లా వేసుకోవాలి. రెండువైపులా గోల్డ్ కలర్ వచ్చేవరకు కాల్చి తర్వాత బెర్రీలను పైన అలంకరించి సర్వ్ చేయాలి.

సాల్మన్, బ్రెడ్ స్లైసెస్ అవకాడో టోస్ట్:

హోల్ మీల్ బ్రెడ్ స్లైసెస్, స్మోక్డ్ సాల్మన్, అవకాడో, నిమ్మరసం, ఛిల్లీ ప్లేక్స్ తీసుకోవాలి. బ్రెడ్ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. అవకాడోను మెత్తగా చేసి కాల్చిన బ్రెడ్ మీద స్ప్రెడ్ చేయాలి. కాల్చిన సాల్మన్ ముక్కలను, తాజా నిమ్మరసాన్ని దీనిపై వేయాలి.

వీటిని తింటే మంచి ఆరోగ్యంతో పాటు ఉత్సాహం లభిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యాల బారి నుంచి కూడా బయటపడొచ్చు. ఈ ఆహారాల్లో పోషకాలతో పాటు ప్రొటీన్ ఉంటుంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending