ఓ పిట్టకథ .. ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ పేరుతో భవ్య క్రియేషన్స్ కొత్త సినిమాను త్వరలో విడుదల చేయబోతోంది. కామెడి, థ్రిల్లింగ్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. నిర్మాత వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చందు అందిస్తున్నారు.
పోస్టర్‌ను ఆవిష్కరించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు దర్శకుడు మూడు నాలుగు టైటిల్స్ వినిపించగా ఓ పిట్టకథ టైటిల్ నాకు బాగా నచ్చిందని చెప్పాను. అలాగే ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ అన్న కాప్షన్ పెట్టాలని సూచించాను. ఈ కథ విన్నాను. టైటిల్ బావుంది. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కథ కూడా విన్నాను. నాకు బాగా నచ్చింది..’ అని తెలిపారు.

చిత్ర దర్శకుడు చందు మాట్లాడుతూ ‘‘ఒక విలేజ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతోపాటు ప్రతి సన్నివేశం సహజంగా ఉంటూ తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంటను రేపుతుంది. క్లైమాక్స్ వరకూ సస్పెన్స్ ఉంటుంది. బలమైన స్క్రీన్ ప్లే ఉంటుంది..’ అని వివరించారు.
నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ గతంలో పైసా వసూల్, శౌర్యం, సౌఖ్యం, లౌక్యం వంటి కమర్షియల్ సినిమాలు చేశామని, ఇప్పుడు కొత్తవాళ్లతో సినిమా తీద్దామని ఈ సినిమా తీస్తున్నామని వివరించారు.
ఓ పిట్టకథ .. ఇట్స్ ఏ లాంగ్ స్టోరీలో దుద్దుంపూడి విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. శ్రీజో ఈ చిత్రానికి పాటలు రాయగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అన్నే రవి వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి
మంచి కథ ఉందా.. ఓటీటీకి ఇవ్వండి
వెబ్ సిరీస్లో తప్పక చూడాల్సినవి ఏంటి
Discover more from Dear Urban
Subscribe to get the latest posts sent to your email.



You must be logged in to post a comment.