Odisha Beaches: ఒడిషాలోని సంద‌ర్శ‌న‌కు అద్భుత‌మైన బీచ్‌లు ఇవే..

a group of people standing next to a boat on a beach
ఒడిశాలోని బీచ్ Photo by Ashish Kumar Senapati on Unsplash

Odisha Beaches: వేసవి సెల‌వుల‌ను ఎంజాయ్ చేయ‌డానికి ఒడిషాలోని కొన్ని ర‌కాల బీచ్‌లు ఉత్త‌మ‌మైన‌వి. ఇక్కడి స‌ముద్ర‌తీరాన ఎంతో హాయిగా, ఆహ్లాదంగా రోజంతా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.  ప్ర‌కృతి ర‌మ‌ణీయత‌ను చ‌ల్ల‌గాల‌లు మ‌ధ్య ఆనంద‌ంగా గ‌డ‌ప‌వ‌చ్చు. వ‌చ్చే పోయే అల‌ల‌తో ఆడుకుంటూ మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను అనుభ‌వించ‌వ‌చ్చు. అందుకే పిల్లలు కూడా బీచ్‌ అన‌గానే గంతులేసుకుంటూ కేరింత‌ల‌తో ఆడుకుంటుంటే వారి ఆనందానికి హ‌ద్దులుండ‌వు. ఒడిషాలోని బీచ్‌లు ప‌ర్యాట‌క  ప్ర‌దేశాలుగా పేరు గాంచిన‌వి. ప్ర‌శాంత‌త‌కు మంచి నిలయం. మ‌రి అలాంటి బీచ్‌లు ఏమేం ఉన్నాయో ఇప్ప‌డు తెలుసుకుందాం.

ఒడిషా భార‌త‌దేశానికి తూర్పున ఉన్న రాష్ట్రం. 480 కి.మీ పొడ‌వైన అంద‌మైన తీర ప్రాంతం దీని సొంతం. ఈ తీర‌ప్రాంతం ఎంతో అందంగా, ఆహ్ల‌దంగా, ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌కు మారుపేరుగా నిలుస్తాయి. ఇక్క‌డ దేవాల‌యాలు, గిరిజ‌న ఆచారాలు ఎంతో విశిష్ట‌త‌ను సంత‌రించుకుంటాయి. ఈ అంద‌మైన తీర ప్రాంతాల్లో బీచ్‌ల సంద‌ర్శన అద్బుత‌మైన అనుభూతిని ఇస్తుంది. వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ, అభ‌యార‌ణ్య కేంద్రాలుగా ప్ర‌సిద్ది చెందాయి. ఒడిషాలో ర‌మ‌ణీయ‌త‌ను చాటే అంద‌మైన బీచ్‌లు ఇక్క‌డ చూసేద్దాం.

ఒడిషాలోని సంద‌ర్శించాల్సిన ప్ర‌సిద్ద బీచ్‌లు:

1. పూరి బీచ్ – పూరీ

పూరీ ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. అక్క‌డ అందమైన బీచ్‌లతో పాటు, పూరీ జగన్నాథుని స్థానం కూడా ఆన‌వాలుగా నిలిచింది. చాలామంది ఇక్క‌డికి తీర్థయాత్రల కోసం ఎంద‌రో భ‌క్తులు వస్తూ ఉంటారు. చుట్టుప‌క్క‌ల ఉన్న చక్రతీర్థం మరియు స్వర్గద్వార్ అనే ప్రాంతాలు కూడా  ప‌ర్యాట‌కుల‌కు ఎంతో ఊర‌ట‌నిస్తాయి. కాక‌పోతే అధిక రద్దీతో నిండి ఉంటాయి. ఇది అక్టోబ‌ర్ మ‌రియు ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య సంద‌ర్శ‌న‌కు అనుకూల‌మైన స‌మ‌యం.

2. గోపాల్‌పూర్ బీచ్ –  గంజాం

ఇది బ్రహ్మపూర్ ప‌ట్ట‌ణం నుండి 16 కి.మీ దూరంలో ఉంది. ఇది పూరి కంటే కూడా రద్దీ త‌క్కువ‌గానే  ఉంటుంది. స‌ముద్ర తీరంలో అల‌ల‌ను ఆస్వాదించే మంచి ప్రాంతం. ఇక్క‌డ  మత్స్యకారులు వారి జీవ‌నాన్ని సాగిస్తూ ఉంటారు. ఇది నిర్మ‌ల ప్ర‌దేశంగా పేరుగాంచింది. దీని సంద‌ర్శ‌న‌కు ఉత్త‌మ స‌మ‌యం చ‌లికాలం.

3. చంద్రభాగ బీచ్ –  కోణార్క్

కోణార్క్‌లోని ప్రసిద్ధ బీచ్ చంద్ర‌భాగ బీచ్. సూర్య దేవాలయం నుండి చంద్రభాగ బీచ్ కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం పర్యాటకుల తాకిడితో ర‌ద్దీగా ఉంటుంది. ఇది ఒడిశాలోని అత్యంత పరిశుభ్రమైన మరియు పర్యావరణ అనుకూల బీచ్‌లలో ఒకటి. అంతేకాకుండా ఇక్క‌డ దగ్గ‌ర‌లో వాటర్ స్పోర్ట్స్, సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాల యొక్క సుందరమైన అందాలను ఆస్వాదించవచ్చు.

4. రాంచండీ బీచ్ – కోణార్క్

కోణార్క్‌లో మ‌రో అంద‌మైన బీచ్ రాంచండీ బీచ్. రోడ్డు మార్గంలో కేవలం 7 కి.మీ. ఉంటుంది. కుశభద్ర నది మరియు బంగాళాఖాతం జంక్షన్ వద్ద ఉన్న రాంచండి ఈ ప్రాంతంలోని అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి. ఈ బీచ్‌లో ప్రత్యేకించి పండుగ సమయంలో బోటింగ్, సర్ఫింగ్, సెయిలింగ్, వాటర్ స్కీయింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్‌కు ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డ చాలా అంద‌మైన ప్రాంతాల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. కుటుంబంతో క‌లిసి బాగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

5. చండీపూర్ బీచ్ – బాలాసోర్

ఇది సౌత్ ఈస్టర్న్ రైల్వే మార్గంలో బాలాసోర్ రైల్వే స్టేషన్ నుండి కేవలం 16 కి.మీ దూరంలో ఉన్న అనుకూలమైన ప్రదేశం. సముద్ర తీరం నుండి రోజుకు రెండుసార్లు సుమారు 5 కి.మీ దూరంలో ఉన్నందున ఈ బీచ్ స్నానానికి అనుకూలం కాదు. అందువల్ల మీరు నీటిలో సముద్రంలోకి లోతుగా నడవవచ్చు. పర్యాటకులు ఈ సముద్ర తీరంలో సముద్ర వనరులు సేకరించడం మరియు ఎర్ర పీతలను వెంబడించడం కూడా ఆనందిస్తారు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleఈ వారం థియేట‌ర్, ఓటీటీ రిలీజ్ చిత్రాలు.. సినీ ప్రియులకు పండగే
Next articleనేరేడు పండు తింటున్నారా! అయితే ఇన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలు పొందిన‌ట్లే