నార్త్ హైదరాబాద్‌లోని శామీర్‌పేట్ ప్రాంతం ఇప్పుడు ఇన్వెస్టర్లకు అడ్డాగా మారింది. ఇక్కడి లాల్‌గడి మలక్‌పేటలో కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ‘ఓం భానూరి ఏషియన్ సెరీన్ సిటీ’ (Om Bhaanoori Asian Serene City) లాంఛ్ అయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలు ‘డియర్ అర్బన్’ పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాం.
ప్రాజెక్టు ప్రొఫైల్: నమ్మకం, నాణ్యత
ఓం సాయి రియల్ ఎస్టేట్ ఇండియా LLP ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు సుమారు 33 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉంది. ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవనాన్ని కోరుకునే వారికి ఇది కేరాఫ్ అడ్రస్.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు:
-
మొత్తం ప్లాట్లు: 378 ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్లు.
-
ప్లాట్ సైజులు: 190 గజాల నుండి 500 గజాల వరకు (సుమారు 1,940 – 2,683 చ.అడుగులు).
-
అనుమతులు: ఈ వెంచర్ పూర్తిస్థాయిలో HMDA, RERA గుర్తింపు పొందింది..
-
పొసెషన్: ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్లాట్ల అమ్మకాలు కూడా మొదలయ్యాయి.
ఏషియన్ సెరీన్ సిటీలో ప్లాటు ధర ఎంత?
2026 నాటి రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ప్రకారం, శామీర్‌పేట్ ఏరియాలో ధరలు నిలకడగా పెరుగుతున్నాయి. ‘ఓం భానూరి ఏషియన్ సెరీన్ సిటీ’లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. డియర్ అర్బన్ 2026 జనవరి రెండో వారంలో అక్కడికి వెళ్లినప్పుడు గజం రూ. 30 వేలు ఉందని చెప్పారు. కూర్చొని మాట్లాడుకుంటే బహుశా ఒక 5 నుంచి 10 శాతం తగ్గే అవకాశం ఉంటుంది.
ప్రపంచ స్థాయి వసతులు
ఈ కమ్యూనిటీని కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా, ఒక లగ్జరీ రిసార్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు:
-
మౌలిక సదుపాయాలు: 30 అడుగుల నుండి 50 అడుగుల వెడల్పైన బ్లాక్ టాప్ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, ప్రత్యేక పవర్ సబ్‌స్టేషన్.
-
క్రీడలు & ఆరోగ్యం: సెంట్రల్ పార్క్, స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్నాసియం, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, మల్టీపర్పస్ అవుట్‌డోర్ కోర్ట్స్.
-
పర్యావరణం: ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యంతో కూడిన అవెన్యూ ప్లాంటేషన్, వర్షపు నీటి నిల్వ (Rainwater Harvesting) గుంతలు.
-
భద్రత: చుట్టూ కాంపౌండ్ వాల్, 24/7 సిసిటివి నిఘా, సెక్యూరిటీ సిబ్బంది.
లొకేషన్ అడ్వాంటేజ్: కనెక్టివిటీనే అసలు బలం
ఈ ప్రాజెక్టు శామీర్‌పేట్ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట (Lalgadi Malakpet) లో ఉంది.
-
ఔటర్ రింగ్ రోడ్ (ORR): ఓఆర్ఆర్ ఎగ్జిట్ 7 (శామీర్‌పేట్)కు ఆరేడు కిలో మీటర్ల దూరం మాత్రమే ఉండటం వల్ల గచ్చిబౌలి, హైటెక్ సిటీ, విమానాశ్రయానికి వెళ్లడం చాలా సులభం.
-
విద్యా సంస్థలు & ఆసుపత్రులు: సమీపంలో ఆసుపత్రులు, పలు అంతర్జాతీయ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి.
-
ఆధ్యాత్మికం: ప్రసిద్ధ రత్నాలయం దేవాలయం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు ఇది చేరువలో ఉంది.
ఇది పెట్టుబడికి సరైన సమయమేనా?
శామీర్‌పేట్ ప్రాంతం ఇప్పటికే ఫార్మా రంగానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్, మెట్రో రానున్నందున భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ హబ్‌గా మారనుంది. ఓం భానూరి ఏషియన్ సెరీన్ సిటీ లో ప్లాట్ కొనడం అనేది కేవలం ఆస్తిని సమకూర్చుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం ఒక బలమైన ఆర్థిక పునాది వేసుకోవడం కూడా. ప్రశాంతతతో కూడిన లగ్జరీ లైఫ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.




