Progesterone injection in pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్లు కొందరికి ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్ progesterone injection వాడాలని సూచిస్తారు. గర్భస్రావం అయిన వారికి, తరచుగా ఇలా అవుతున్న వారికి ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది. నిజానికి ప్రొజెస్టెరాన్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ పురుషుల్లోనూ, మహిళల్లోనూ ఉంటుంది. అయితే రుతుస్రావం, గర్భధారణ సమయంలో మహిళలల్లో ప్రొజెస్టెరాన్ భిన్నస్థాయిలో ఉంటుంది.
ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉపయోగాలు?
ప్రెగ్నెన్సీ సమయంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఫలదీకరణ చెందిన అండం కోసం గర్భాశయాన్ని రెడీ చేయడానికి ప్రొజెస్టెరాన్ సహాయపడుతుంది. అంటే గర్భాశయంలో ఇంప్లాంట్ అవడానికి, పిండం పెరుగుతున్నప్పుడు రక్తనాళాలు విస్తరించడానికి తోడ్పడుతుంది. సుమారుగా 10వ వారంలో ప్లాసెంటా ఏర్పడి, సొంతంగా రక్తసరఫరా వ్యవస్థను మెరుగుపరుచుకునే వరకు ప్రొజస్టెరాన్ సాయపడుతుంది.
అంతేకాకుండా ప్రొజెస్టెరాన్ గర్భాశయం (యుటెరస్) గోడలను పటిష్టం చేయడానికి ఉపయోగడపడుతుంది. అలాగే బ్రెస్ట్‌లో కణజాలం వృద్ధి చేస్తుంది. డెలివరీ అయ్యేంతవరకు పాలు పడకుండా ఈ ప్రొజెస్టెరాన్ సాయపడుతుంది.
ఇన్ని రకాల ప్రయోజనాలు అందిస్తున్నందునే గర్భస్రావం జరిగిన మహిళలకు, సంతానం కోసం చాలాకాలం ఎదురుచూస్తున్న మహిళలకు వైద్యులు ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్లు రాస్తారు. అయితే ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్ల వల్ల పెద్దగా ఉపయోగం లేదని కూడా కొన్ని అధ్యయనాలు వివరణాత్మక నివేదికలు ప్రచురించాయి. అయితే ప్రొజెస్టెరాన్ వల్ల దుష్ప్రభావాలు ఏవీ లేవని పలు అధ్యయనాలు సూచించాయి.
ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్లను కొంతమంది వైద్యులు 4 వారాల నుంచి 12 వారాల వరకు, మరికొందరు 16 వారాల నుంచి 20 వారాల మధ్య సూచిస్తారు. ప్రెగ్నెంట్ మహిళ కండిషన్ బట్టి, అవసరాన్ని బట్టి సిఫారసు చేస్తారు.
ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్లు ఆసుపత్రికి వెళ్లకుండా సమీపంలో ఉన్న నర్సుల ద్వారా గానీ, ఇంటికి వచ్చి వేసే నర్సుల ద్వారా గానీ ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ వల్ల కాస్త నొప్పిని అనుభవించాల్సి ఉంటుంది.
ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్ వల్ల ఇబ్బందులు ఉన్నాయా?
ఒకవేళ ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్ (progesterone injection) వల్ల రక్తం గడ్డకట్టినట్టు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా కాళ్లలో ఆకస్మిక నొప్పి లేదా వాపు, కాలుపై ఎర్రబడడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటివి ఎదురైనప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.
సాధారణంగా అండం సక్రమంగా ఎదగనప్పుడు 8 వారాల సమయంలో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. దీనికి హార్మోన్ల ప్రభావం, పూర్తిగా ఆరోగ్యంగా లేని స్పెర్మ్ వంటి అనేక కారణాలు ఉంటాయి. అందువల్ల తగిన వైద్యుడిని సంప్రదించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీరు పండంటి పాపాయికి జన్మనివ్వవచ్చు. ఈరోజుల్లో గర్భస్రావాలు, సంతానలేమి చాలా సర్వసాధారణమైంది. వెనకటి రోజుల్లో లాగా కాకుండా ఇప్పుడు అన్ని సంతానలేమికి, గర్భస్రావాలు జరగకుండా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల విచారం చెందకుండా పరిష్కారం గురించి ఆలోచించడం ఫలితాన్నిస్తుంది. బీ పాజిటివ్. మంచి ఆహారం తీసుకుంటూ ముందుకు సాగండి.
ఇవి కూడా చదవండి
pregnancy symptoms in telugu: ప్రెగ్నెన్సీ ఎన్ని రోజులకు తెలుస్తుంది ? ప్రెగ్నెన్సీ ఎలా తెలుస్తుంది?
IVF process: ఐవీఎఫ్ ఎప్పుడు? ఎందుకు? ఎలా? ఖర్చెంత? రిస్క్ ఏంటి?
Pregnancy food chart: ప్రెగ్నెన్సీ ఆహారం : ఫుడ్ ఛార్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి?