Latest

బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌ తాను అడిసన్‌ వ్యాధి బారిన పడి ఎలాంటి కష్టాలు పడ్డారు? ఎలా కోలుకున్నారో యూట్యూబ్‌లో ఓ వీడియో సందేశం పెట్టారు. 2014 సెప్టెంబరులో సుస్మితాసేన్‌ అడిసన్‌ అనే ఆటోఇమ్యూన్‌ వ్యాధిబారిన పడ్డారు. దాని గురించి ఆమె ఎమన్నారో ఆమె మాటల్లో చదవండి..

‘అప్పుడు నాలో ఇక పోరాడే శక్తి లేదన్న భావన కలిగింది. తీవ్ర నిరాశ, ఆవేశంతో పాటు అలసటతో కూడిన శరీరం. నా కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు నా నాలుగేళ్ల చీకటి కాలాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేయలేకపోయాయి.

కార్టిసాల్‌(మన శరీరంలో ఉండే స్ట్రెస్‌ హార్మోన్‌) కలిగి ఉండేందుకు స్టెరాయిడ్స్‌ తీసుకోవాల్సివచ్చేది. దాని అసంఖ్యాక దుష్ప్రభావాలతో జీవించాల్సి వచ్చేది. దీర్ఘకాలిక అనారోగ్యంతో జీవించడం కంటే అలసట ఏదీ లేదు. కానీ జరిగింది చాలు.

నా మనస్సును బలోపేతం చేసుకునేందుకు ఒక మార్గం కావాలి. శరీరానికి తగినది అనుసరించేందుకు నా మనస్సు అనుమతించేలా ఉండాలి. ఇలాంటప్పుడే నేను ‘నుంచకు’తో ధ్యానం చేశాను. ఆవేశం, కోపం పోయాయి.

తిరిగి ఫైట్‌ చేసేందుకు శక్తి వచ్చింది. నొప్పి ఒక కళారూపంగా మారింది. సమయానికి నేను కోలుకున్నాను. నాలోని అడ్రినల్‌ గ్రంథులు మేల్కొన్నాయి. ఇక స్టెరాయిడ్ల వినియోగం లేదు. వాటి ఉపసంహరణ ప్రభావాలు కూడా లేవు. 2019 నాటికి ఆటో ఇమ్యూన్‌ కండిషన్‌ కూడా లేదు..’ అని సుస్మితా సేన్‌ ఈ సందేశంలో పేర్కొన్నారు.

ఇదొక పాఠం

సుస్మితాసేన్‌ తన సందేశాన్ని కొనసాగిస్తూ ‘పాఠం: మీ శరీరం గురించి మీ కంటే బాగా మరెవ్వరికీ తెలియదు. అందువల్ల మీ శరీరం చెప్పినట్టు వినండి. మనందరిలో ఒక యోధుడు ఉన్నాడు.

ఎన్నడూ పోరాటం వదిలేయకండి. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా గురువు నుపుర్‌ శిఖారేకు ధన్యవాదాలు. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను..’ అంటూ సందేశం ఇచ్చారు.

వ్యాధులు మనల్ని కుంగదీసినప్పుడు కుంగిపోకుండా.. ఫైట్‌ చేయడం మొదలుపెడితే మన జీవితం గతంలో కంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం పోరాడగలమని నిరూపితమవుతుంది.

లవ్‌ యూ ఆల్‌..

WARRIOR

Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version