హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్తును రూపుదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 (Telangana Rising Global Summit) ఈరోజు, డిసెంబర్ 8న ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు ఫ్యూచర్ సిటీ వేదిక అవుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల దిగ్గజాలు పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) తొలి రోజు షెడ్యూల్, ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
ముఖ్యమంత్రి షెడ్యూల్: గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేడుకలు ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి.
-
వేదికకు సీఎం రాక: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు.
-
ప్రారంభోత్సవ వేడుక: మధ్యాహ్నం 1:30 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
-
సీఎం ప్రసంగం: ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలను, అలాగే తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన ప్రణాళికలను వివరిస్తారు.
వన్ టు వన్ రౌండ్ టేబుల్ సమావేశాలు
ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందాలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
-
సమావేశాల వివరాలు: ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 15 వన్ టు వన్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రతి 15 నిమిషాలకు ఒక సమావేశం ఉంటుంది.
-
ముఖ్య ప్రతినిధులు: ఈ సమావేశాల్లో పాల్గొనే వారిలో ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, విదేశీ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఉంటారు.
-
రంగాల వారీగా చర్చలు: టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ MSMEలు, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ రంగ ప్రతినిధులతో పాటు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల ప్రముఖులు కూడా సీఎంను కలుస్తారు.
-
అంతర్జాతీయ సహకారం: యూనివర్సిటీ ఆఫ్ లండన్, వంతార, VinGroup వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.
-
విందు: రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
తొలి రోజు ప్యానెల్ చర్చా వేదికలు
గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ సమావేశం ముగియగానే, ప్రపంచంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తుకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలపై చర్చలు మొదలవుతాయి. ప్రధాన వేదికతో సమాంతరంగా ఏర్పాటు చేసిన నాలుగు మీటింగ్ హాళ్లలో ఈ ప్యానెల్ డిస్కషన్లు జరుగుతాయి. తొలి రోజున 12 అంశాలపై ఈ చర్చా వేదికలు ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖల మంత్రుల సారధ్యంలో ఆయా రంగాల నిపుణులు, మేధావులు ఈ చర్చల్లో పాల్గొంటారు.
మొదటి సెషన్: మధ్యాహ్నం 3:00 నుంచి 4:00 వరకు
-
హాల్ 1: ది జస్ట్ ట్రాన్సిషన్ ఇన్ టూ 2047 – పవరింగ్ తెలంగాణాస్ ఫ్యూచర్. తెలంగాణ భవిష్యత్తు ఇంధనం – గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగుపై చర్చ.
-
హాల్ 2: గ్రీన్ మొబిలిటీ 2047 – జీరో ఎమిషన్ వెహికిల్స్. ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్-ఎమిషన్ టెక్నాలజీ అవకాశాలు.
-
హాల్ 3: టెక్ తెలంగాణ 2047 – సెమీకండక్టర్స్ & ఫ్రాంటియర్ టెక్నాలజీస్. సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్, ఫ్రంటియర్ టెక్నాలజీపై అవకాశాలపై చర్చ.
-
హాల్ 4: తెలంగాణ యాజ్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్. విద్యా రంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్‌గా తీర్చిదిద్దే వ్యూహాలపై చర్చ.
రెండో సెషన్: సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు
-
హాల్ 1: తెలంగాణ ఫ్లయింగ్ హై – ది రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ & డిఫెన్స్. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ వృద్ధిపై చర్చ.
-
హాల్ 2: టాలెంట్ మొబిలిటీ (TOMCOM & MEA). అంతర్జాతీయ అవకాశాలు, నైపుణ్య మార్పిడి విధానాలపై చర్చ.
-
హాల్ 3: ఏ హెల్తీ తెలంగాణ ఫర్ ప్రాస్పెరోస్ తెలంగాణ. ఆరోగ్య రంగం అభివృద్ధి దిశగా చర్చ.
-
హాల్ 4: ఈ సెషన్ రెండు దేశాల చర్చలతో సాగుతుంది.
-
కొరియా (4:10–4:50 PM)
-
ఆస్ట్రేలియా (4:50–5:30 PM)
-
ఈ రెండు దేశాలతో వివిధ రంగాల్లో సాంకేతిక, నైపుణ్యాల సహకారం, పెట్టుబడి భాగస్వామ్యంపై చర్చిస్తారు.
-
మూడో సెషన్: సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు
-
హాల్ 1: తెలంగాణ పార్టనరింగ్ విత్ ఆసియాన్ టైగర్స్. ఆసియా దేశాలతో ఆర్థిక భాగస్వామ్యంపై చర్చ.
-
హాల్ 2: గిగ్ ఎకానమీ – రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్. గిగ్ వర్కర్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చ.
-
హాల్ 3: ది RARE స్ట్రాటజీ – ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్‌కం త్రూ వాల్యూ చైన్స్. రైతుల ఆదాయం పెంపొందించే వ్యూహాలపై చర్చ.
-
హాల్ 4: ఈ సెషన్ రెండు అంశాలపై జరుగుతుంది.
-
కెనడా సెషన్.
-
ఫాస్టరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఉమెన్.
-
కెనడాతో వివిధ రంగాల్లో సహకార భాగస్వామ్యాలు, పారిశ్రామికవేత్తలుగా మహిళల సాధికారతపై చర్చలు ఉంటాయి.
-
ఈ సమావేశాలు, చర్చలు తెలంగాణ భవిష్యత్తు ప్రగతికి కొత్త దారులను తెరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
Discover more from Dear Urban
Subscribe to get the latest posts sent to your email.


