Home న్యూస్ మన సొంత సమస్యల మాటేంటి..!

మన సొంత సమస్యల మాటేంటి..!

tamanna

దేశంలో, ప్రపంచంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు సంఘనలు మానవత్వానికి మచ్చ తెస్తున్నాయి. మనుషులమన్న కనీస విచక్షణ కోల్పోయి సాటి మనషుల పట్ల, జంతువుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మన నాగరికతను సవాల్ చేస్తున్నాయి.

నోరున్న మనిషి కాపాడమని వేడుకుంటున్నా కనికరం లేకుండా పోతోంది. ఇక నోరులేని మూగజీవాలపై మనిషి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. ఆమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్, కేరళలో గర్భం దాల్చిన ఏనుగు మృతికి గల కారణాలు మనషి విచక్షణను ప్రశ్నిస్తున్నాయి.

ఈ ఘటనలపై యావత్తు ప్రపంచం, దేశం గళం విప్పుతోంది. తమ నిరసన తెలుపుతోంది. ‘ఈ స్పందన’ మన దేశంలో కొత్త చర్చకు తెరలేపిందింప్పుడు.

అమెరికాలో ఒక నల్లజాతీయుడిని అక్కడి పోలీసులు తొక్కిపట్టి నరహత్యకు పాల్పడితే స్పందించిన మన దేశం.. మన సొంత సమస్యలపై మౌనం వహిస్తోందా! అన్న చర్చకు దారితీసిందంటున్నాయి కొన్ని వర్గాలు.

అగ్రరాజ్యమైన ఆమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి, వివక్షకు వ్యతిరేకంగా అక్కడి ఆఫ్రికన్ అమెరికన్ ప్రజలు ఉద్యమించారు. ఉద్యమించడమే కాకుండా యావత్తు ప్రపంచం మద్దతును కూడగట్టగలిగారు.

మన దేశంలో కూడా అనేక మంది వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అభినందనీయమే. కానీ, ‘ఆ స్పందన’ మన సొంత సమస్యలపై నిజంగానే లేదా!.

మనం ఎదుర్కొంటున్న, మన దేశ పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలకు మనం ‘జార్జ్ ఫ్లాయిడ్ ఉద్యమ స్పందన’ను జోడించలేమా అన్నది ఇప్పుడు చర్చకు దారి తీసిన అంశం.

లాక్ డౌన్ కారణంగా వేల కిలో మీటర్లు కాలినడక బయలుదేరింది మన దేశ పౌరుడే. అలా గమ్యం చేరే క్రమంలో రైలు పట్టాలపై పడుకొని మృత్యువాత పడిందీ మన దేశ పౌరుడే.

శ్రామిక్ రైలులో గమ్య స్థానం చేరే క్రమంలో తనువుచాలించింది ఒక తల్లి. చనిపోయిన తల్లిని లోకం తెలియని ఒక పసివాడు లేపడానికి ప్రయత్నించిన దృష్యాన్ని యావత్తు దేశం చూసింది. లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నదీ మన పౌరులే.

ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తీసేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. జీతాల్లో కోత విధిస్తూ, ఉద్యోగులను సెలవులపై పంపేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్యాయి.

ఇలా మన దేశంలో ఉన్న సమస్యలపై జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంలో స్పందించినంతగా మనం మన సమస్యలపై స్పందిస్తున్నామా? ప్రభుత్వాల్ని, వ్యవస్థల్ని, వ్యక్తుల్ని ప్రశ్నించగలుగుతున్నామా? అనేదే నేటి భారతంలో చర్చనీయాంశం.

ఆ ఉద్యమాన్ని మన సమస్యలకు అన్వయించుకుందాం..

అమెరికాలో నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని మనం మన దేశ సమస్యలకు అన్వయించుకుందాం అంటున్నాడు బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్. ఈ ఉదంతంపై స్పందించిన సెలబ్రిటీలు, మధ్య తరగతి ప్రజలు కాస్త మన సమస్యలపై దృష్టిసారించి ఉద్యమించాలని కోరుతున్నాడు.

వివక్షపై అమెరికన్లు ఉద్యమించిన తీరును మన సమస్యలపై మనం అన్వయించుకోవాలంటున్నాడు. అది కూడా హింస లేకుండా. ‘మన ఉద్యమాన్ని ప్రారంభిద్దాం.. మన సమస్యలపై. అదే #blacklifematter ఉద్యమం మనకు నేర్పుతోంది‘ అని గుర్తు చేశాడు ఈ బాలీవుడ్ నటుడు.

అలా మన దేశంలో వలస జీవులు, మైనారిటీ, పేదల సమస్యలపై హాష్ టాగ్ లతో తన గళం విప్పాడు.

మీ మౌనం మిమ్మల్ని రక్షించదు..

‘మీ మౌనం మిమ్మల్ని రక్షించదు. ప్రతి జీవితం ముఖ్యం కాదా? అది మనిషిదైనా, మూగజీవాలదైనా. ఏ రకమైన జీవి గొంతునొక్కడం సృష్టి ధర్మానికి విరుద్ధం. మనం మళ్లీ మనుషులుగా మనుగడ సాధించడం, కరుణ చూపడం, ప్రేమించడం నేర్చుకోవాలి’ అంటోంది నటి తమన్నా.

ఈ విషయాన్ని వ్యక్తపరుస్తూ తమన్నా పంచుకున్న ఫోటో ఆలోచింపజేస్తోంది. నోటిని ఎవరో నొక్కిపట్టిన విధంగా నల్ల రంగు ముద్రలతో తన సందేశాన్ని పంచుకుంది.  #AllLivesMatter #WakeUpWorld అంటూ పిలుపునిచ్చింది.

 

Exit mobile version