Home మనీ SUV new launches: త్వరలో 5 కొత్త ఎస్‌యూవీ కార్లు.. మారుతీ జిమ్నీ, హ్యుందాయ్ కాస్పర్ ఇంకా

SUV new launches: త్వరలో 5 కొత్త ఎస్‌యూవీ కార్లు.. మారుతీ జిమ్నీ, హ్యుందాయ్ కాస్పర్ ఇంకా

0
SUV new launches: త్వరలో 5 కొత్త ఎస్‌యూవీ కార్లు.. మారుతీ జిమ్నీ, హ్యుందాయ్ కాస్పర్ ఇంకా
Image credit: pixahive

SUV new launches: ఇండియాలో ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. త్వరలోనే 5 కొత్త ఎస్‌యూవీలు లాంచ్ కాబోతున్నాయి. ఇప్పటికే టాటా నెక్సన్, టాటా పంచ్, మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ వెన్యూ, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, మహీంద్రా అండ్ మహీంద్రా బొలెరో, స్కార్పియో, కియోస్ సెల్టోస్, సొనెట్ వంటి ఎస్‌యూవీలు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఆయా కార్లు గతంలో ఎన్నడూ లేనంతగా అమ్ముడయ్యాయి.

Maruti suzuki Jimny 5- door: మారుతీ సుజుకీ నుంచి జిమ్నీ 5 డోర్ ఎస్‌యూవీ

మారుతీ సుజుకీ నుంచి జిమ్నీ పేరుతో కొత్త మోడల్ ఎస్‌యూవీ రానుంది. ఇప్పటికే ఇది టెస్టింగ్ దశలో ఉంది. లద్దాఖ్‌లో హై ఆల్టిట్యూడ్ టెస్టింగ్ సమయంలో సందర్శకుల కంటపడింది. ఈ మారుతీ సుజుకీ జిమ్నీకి ఐదు డోర్లు ఉండడం విశేషం. లాంగర్ వీల్‌బేస్, వెనక కూర్చునే వాళ్లకు విస్తృతమైన లెగ్ రూమ్ ఉండడం విశేషం. కొత్త సంవత్సరంలో జరిగే ఆటో ఎక్స్‌పో సందర్భంగా ఇది వెలుగుచూడనుంది. తరువాత అధికారికంగా దీనిని మారుతీ సుజుకీ లాంచ్ చేస్తుంది. 

Hyundai Casper SUV: హ్యుందాయ్ క్యాస్పర్ ఎస్‌యూవీ

కాంపాక్ట్ లేదా మైక్రో ఎస్‌యూవీ కార్లలో టాటా పంచ్‌కు ఆదరణ బాగుంది. ఈ స్పేస్ ఆక్రమించేందుకు హ్యుందాయ్ మోటార్స్ త్వరలోనే మైక్రో ఎస్‌యూవీ మోడల్ ఆవిష్కరించనుంది. క్యాస్పర్ పేరుతో ఈ మోడల్‌ను కొరియన్ మార్కెట్‌లో ఇప్పటికే ఆవిష్కరించింది. ఫంకీ స్టైల్‌తో ఎస్‌యూవీ డిజైన్ ఎలిమెంట్స్‌తో వస్తోంది. దీని క్యాంపాక్ట్ డైమెన్షన్స్ ఆకట్టుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో వచ్చే ఆటో ఎక్స్‌పోలో ఈ హ్యుందాయ్ కాస్పర్ ఎస్‌యూవీ చూపరులను ఆకట్టుకోనుంది. కానీ ఇండియన్ మార్కెట్లోకి వచ్చేందుకు మరికొంత కాలం.. అంటే వచ్చే ఏడాాది పండగ సీజన్ వరకూ ఆగాల్సిందే.

maruti suzuki Baleno Cross: మారుతీ సుజుకీ బాలెనో క్రాస్

మారుతీ సుజుకీ నుంచి కొత్తగా బ్యాలెనో క్రాస్ ఎస్‌యూవీ రాబోతోంది. ఇప్పటికే మారుతీ సుజుకీ నుంచి మారుతీ బ్రెజా, మారుతీ గ్రాంట్ విటారా ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీపడుతున్నాయి. ఈ బ్యాలెనో క్రాస్ ప్రీమియం హాచ్‌బ్యాక్ శ్రేణిలో అగ్రభాగాన ఉంటుంది. ఈ కారు ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉంది. ఇది లో సెట్ రూఫ్ లైన్‌లో రానుంది. బ్యాలెనో క్రాస్ ఎస్‌యూవీ ధర రూ. 10 లక్షల లోపే ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Tata Curvv Coupe SUV: టాటా కర్వ్ ఎస్‌యూవీ ఈవీ

టాటా మోటార్స్ నుంచి టాటా పంచ్, టాటా నెక్సాన్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాప్ లేపుతున్నాయి. ఇప్పుడు సరికొత్తగా టాటా కర్వ్ ఎస్‌యూవీ రాబోతోంది. టాటా నెక్సాన్ తరహాలో ఉండబోతోందని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇది తొలుత ఎలక్ట్రిక్ వెహికిల్ వెర్షన్‌లో రానుంది. తదుపరి పెట్రోల్ వెర్షన్‌లో రానుంది.

Honda Amaze based SUV: హోండా అమేజ్ తరహా ఎస్‌యూవీ

హోండా మోటార్స్ నుంచి ఇప్పటికే బీఆర్-వీ, డబ్ల్యూఆర్-వీ మోడల్స్‌తో కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్స్ ఉన్నాయి. అమేజ్ మోడల్ ఆధారిత ఎస్‌యూవీని త్వరలో ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. ఇది 7 సీటర్‌గా రానున్నట్టు సమాచారం. 4 మీటర్ల పొడవుతో, డబ్ల్యూఆర్-వీకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రాబోతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article high cholesterol: హై కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో బాధ పడుతున్నారా? ఇలా తగ్గించుకోండి
Next article God father Movie OTT release date: చిరు గాడ్‌ఫాదర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.