ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ( airport lounge access ) క్రెడిట్ కార్డుతో ఉచితంగా పొందవచ్చు. విమాన ప్రయాణం చేసిన వారికి విమానాశ్రయంలో లాంజ్ అనే బోర్డు కనిపించే ఉంటుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే ఇది ఇది ప్రయాణికులు వేచి ఉండేందుకు ఉద్దేశించిన విశ్రాంతి గది.
బార్ అండ్ రెస్టారెంట్, స్పా వంటి వసతులు ఉంటాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్లలలో చిన్న లాంజ్ ఉంటుంది. పడక మంచాలు వంటివి మందులు అందుబాటులో ఉంటాయి. అదే విమానాశ్రయం లాంజ్ అయితే కాస్త విలాసవంతంగా ఉంటుంది. ఇందులో మనం సేదతీరవచ్చు.
ఎయిర్ పోర్టు లాంజ్ లో సోఫాలు ఫ్రీ వైఫై, పేపర్లు, మ్యాగజీన్లు, స్నానాల గదులు, స్పా, బార్ రెస్టారెంట్ వంటి సదుపాయాలు ఉంటాయి. వీటన్నింటికీ మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వీటిలో లో సగం వసతులను మనం ఉచితంగా కూడా పొందవచ్చు. అదెలాగో చూద్దాం.
చాలాసార్లు మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేసే వాళ్ళు ఫలానా క్రెడిట్ కార్డు లో ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఉందని చెబుతుంటారు. అవును క్రెడిట్ కార్డ్ ఉన్నప్పుడు మనం ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి ఉచితంగా ప్రవేశించి కొన్ని సేవలను ఉచితంగా పొందవచ్చు.
ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ క్రెడిట్ కార్డు తో ప్రయోజనాలు
రెస్టారెంట్ లో ఆఫర్ చేసే ఫుడ్ ఉచితంగా తినొచ్చు. భోజన సమయం అయితే భోజనం ఉంటుంది. బఫే తరహాలో మనమే మనకు నచ్చిన ఫుడ్ ప్లేట్లో వడ్డించుకుని తినొచ్చు. స్నాక్స్ అనేక రకాలు ఉంటాయి. ఇవన్నీ ఉచితంగా తినవచ్చు. స్నాక్స్ లో నాన్ వెజ్ స్నాక్స్, దక్షిణాది వంటకాలు అందుబాటులో ఉంటాయి.
సాఫ్ట్ డ్రింక్స్, టీ, కాఫీ, వాటర్ బాటిల్స్ కూడా ఉచితంగానే తీసుకోవచ్చు. ఒక్క బార్లో లభించే ఆల్కహాల్ కు మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాస్త ఖరీదు గానే ఉంటాయి.
ఇంకా స్నానాల గదులు, స్పా, మసాజ్ ఇలాంటి వాటికి డబ్బులు చెల్లించాల్సిందే. మన క్రెడిట్ కార్డు లో నిర్దిష్టంగా పేర్కొన సేవలు అన్నీ ఉచితంగా లభిస్తాయి.
ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ఎన్నిసార్లు ఉచితంగా వాడుకోవచ్చు
మన కార్డు స్థాయిని బట్టి సంవత్సరం లో దేశీయంగా విమానాశ్రయాల్లో ఎన్నిసార్లు వాడుకోవచ్చు.. విదేశాల్లో ఎన్నిసార్లు వాడుకోవచ్చు వంటి వివరాలు అన్నీ క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడే తెలుసుకోవడం ఉత్తమం. సాధారణంగా బేసిక్ క్రెడిట్ కార్డు.. అంటే రుసుము రహిత క్రెడిట్ కార్డుపై ఇలాంటి వెసులుబాటు ఉండదు.
కానీ ఏడాదికి రూ. 500 నుంచి రూ. 1000 రుసుం ఉండే క్రెడిట్ కార్డులపై సాధారణంగా క్వార్టర్లీ రెండుసార్లు ఎయిర్ పోర్టు లాంజ్ యాక్సెస్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఉదాహరణకు హెచ్ డీ ఎఫ్ సీ రెగాలియా ఫస్ట్ క్రెడిట్ కార్డు పైన క్వార్టర్లీ రెండుసార్లు ఈ ప్రయోజనం పొందవచ్చు.
ఇంకాస్త లగ్జరీ క్రెడిట్ కార్డు అయితే ఇంకా ఎక్కువ సార్లు వినియోగించుకోవచ్చు. అయితే కార్డు ప్రైమరీ హోల్డర్ కు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మనతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉంటే వారికి నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి వస్తుంది. కనీసంగా రూ. 1,500 వరకు ఈ చార్జి ఉంటుంది. రెండేళ్ల లోపు పిల్లలు ఉంటే వారికి చెల్లించాల్సిన అవసరం లేదు. 2 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకి రుసుము ఉంటుంది. కానీ కొంత రాయితీ ఉంటుంది.
ఎప్పుడు ఉపయోగపడుతుంది..
విమానం ఇంకా ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు గానీ, మనం ముందుగానే ఎయిర్ పోర్టు చేరుకున్నప్పుడు కానీ ఎయిర్ పోర్టు లాంజ్ లలో సేద తీరవచ్చు. అప్పటివరకు ఉన్న బడలిక తగ్గించుకొని హాయ్ గడపవచ్చు. మనం సిటీలోకి వెళ్లాల్సిన పని లేకుండా నేరుగా లాంజ్ కు వెళ్లి ఉచితంగా భోజనం చేయొచ్చు. దేశీయంగా అన్ని ఎయిర్ పోర్టులలో లాంజ్ లు ఉన్నాయి. మన క్రెడిట్ కార్డు తరహాను బట్టి ఏయే లాంజ్ లలో యాక్సెస్ ఉందో తెలుసుకోవచ్చు.
airport lounge access card ఎలా వినియోగించుకోవాలి..
మన జాబితాలో ఉన్న ఎయిర్ పోర్టు లాంజ్ రిసెప్షన్ వద్దకు వెళ్లి మన క్రెడిట్ కార్డు ఇస్తే వాళ్లు స్పైప్ చేసి కార్డు ఇచ్చేస్తారు. నామమాత్రంగా రూ. 2 రుసుము విధిస్తారు. అంతే మనం వెళ్లి ఎంజాయ్ చేసేయొచ్చు.
ఇవి కూడా చదవండి