Aloe vera benefits: కలబందతో అందం, ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు. ప్రతీ ఇంట్లొ విరివిగా పెంచుకుంటారు. సాధారణంగా కలబంద ఒక రకమైన ఔషధ మొక్క. కలబందతో అందానికి, ఆరోగ్యానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. అదీగాక చాలా ఈజీగా పెరిగే మొక్కల్లో కలబంద ఒకటి. ఇది ఒక ఎడారి మొక్క. ఎక్కువ నీరు లేకపోయిన బ్రతుకుతుంది. కలబందను ఆయుర్వేదంలో కుమారి అనే పేరుతో కూడా పిలుస్తారు. కలబందతో ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే సౌందర్య ఉత్పత్తులలో, ఆయుర్వేద చికిత్సలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
కలబందలో యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. మార్కెట్లలో దొరికే అనేక కాస్మోటిక్స్‌లో కలబందను వాడతారు. ఎందుకంటే చర్మ సంరక్షణలో కలబందను మించిన మొక్క లేదు. ముఖంపై మొటిమలను, మచ్చలను నివారించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కలబందతో మరిన్ని ప్రయోజనాను ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద ఉపయోగాలు:
- జీర్ణశక్తిని పెంపొందించడానికి, అజీర్తి, గుండె మంట తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
- ఇది నోటి పరిశుభ్రతను కాపాడుతుంది. నోటి అల్సర్లను కూడా తగ్గించే శక్తి దీనికి ఉంది.
- కీళ్లనొప్పులు తగ్గించేందుకు కలబంద గుజ్జు పనికొస్తుంది. తాజా కలబంద గుజ్జును వాడడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది.
- కలబంద కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులకు చెక్ పెడుతుంది. కలబంద గుజ్జుతో చేసిన రసాన్ని ఉదయాన్నే పరగడుపున తాగాలి.
- కలబంద చర్మ కాంతిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో కలబంద గుజ్జును కలిపి రాస్తే నలుపు, మచ్చలు పోయి సహజ కాంతిని ఇస్తుంది.
- శరీరంలో ఎక్కడైన పుండ్లు ఏర్పడితే వేంటనే కలబందను పూయడం వల్ల గాయాలు నయమవుతాయి.
- కలబందను రోజ్‌వాటర్‌ను కలపి శరీరానికి రాస్తే మృతకణాలు తొలగిపోతాయి.
- జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఇది అన్నింటికంటే వేగంగా పనిచేస్తుంది. జుట్టును సహజంగా ఉంచడంలో కలబంద పాత్ర కీలకంగా ఉంటుంది. అలాగే చుండ్రును నివారిస్తుంది. జుట్టు తెల్లదనం తగ్గి నల్లని నిగారింపును సంతరించుకుంటుంది. చాలా చక్కటి కండీషనర్‌లా పనిచేస్తుంది. జుట్టు మృదుత్వాన్ని కలిగి ఉంటుంది.
- ఎండలో చర్మం కాంతి పోయి ట్యాన్ ఏర్పడుతుంది. ఈ ట్యాన్ పోగొట్టడానికి కలబందను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో తేమ నిలిచి ఉండేలా చేయటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
- కలబందలో లభించే విటమిన్లు, మినరల్స్, అమైనోయాసిడ్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వయసు పైబడిన వారిలో ముడతలు రాకుండా నివారిస్తుంది.
- కలబందలో ఉండే కొలాజెన్ చర్మంలో సాగే గుణాన్ని నియంత్రించటంలో సహాయపడుతుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్