Home లైఫ్‌స్టైల్ Clean Makeup Brushes : మేకప్ బ్రష్​లను శుభ్రం చేయకుంటే చర్మ సమస్యలు తప్పవట

Clean Makeup Brushes : మేకప్ బ్రష్​లను శుభ్రం చేయకుంటే చర్మ సమస్యలు తప్పవట

0
Clean Makeup Brushes : మేకప్ బ్రష్​లను శుభ్రం చేయకుంటే చర్మ సమస్యలు తప్పవట
మేకప్ బ్రష్​లు ఇలా శుభ్రం చేయండి.. (pixabay)

Clean Makeup Brushes : తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి చాలా మంది మేకప్ వేసుకుంటారు. అయితే మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని ఎలా శుభ్రం చేసుకుంటారో.. మేకప్ వేసుకోవడానికి వినియోగించే బ్రష్​లను కూడా శుభ్రం చేసుకోవాలంటున్నారు నిపుణులు.

రోజు రోజుకి మేకప్ వినియోగించేవారి సంఖ్య పెరిగిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ఆడ, మగ తేడా లేకుండా మేకప్ వేసుకుంటున్నారు. నలుగురిలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే మేకప్ వేసుకునే సమయంలో ముఖంపై ఎంత శ్రద్ధ తీసుకుంటామో.. మేకప్ వేసుకోవడానికి వినియోగించే బ్రష్​లపై కూడా అంతే శ్రద్ధ చూపించాలంటున్నారు.

ఓ మేకప్​ బ్రష్​ మీద బ్రాతూంలో ఉండేంత బ్యాక్టీరియా ఉంటుందట. కాబట్టి మనం వినియోగించే మేకప్ బ్రష్​లపై కచ్చితంగా కేర్ తీసుకోవాలి. లేదంటే మీరు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా చర్మ సమస్యలు తప్పవు. మీరు తరచుగా మేకప్ బ్రష్​లు వినియోగించేవారైతే.. కచ్చితంగా వాటిని తరచుగా శుభ్రం చేసుకోవాలి. డర్టీ మేకప్ బ్రష్​లు అనేక బ్యాక్టీరియాలు, సూక్ష్మక్రిములతో నిండి ఉంటాయి. అవి మొటిమల నుంచి చర్మ ఇన్ఫ్​క్షన్ల వరకు కారణమవుతాయి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మేకప్​ బ్రష్​లను ఎలా శుభ్రం చేయాలి? ఎప్పుడు శుభ్రం చేయాలి వంటి విషయాలపై అవగాహన ఉండడం చాలా ముఖ్యం. ప్రతి వినియోగం తర్వాత మేకప్​ బ్రష్​ను కడగడం లేదా శుభ్రం చేయడం కష్టమే. కాబట్టి కనీసం వారానికోసారి మేకప్ బ్రష్​లను కడగాలి. మీరు ఎక్కువ క్రీమ్, ద్రవ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటే మీరు ప్రతి వినియోగం తర్వాత వాటిని టిష్యు వైప్స్​తో తుడిచివేయండి. ముఖ్యంగా మీ స్నేహితులు లేదా మీ కుటుంబ సభ్యులతో మీ మేకప్ బ్రష్​లను షేర్ చేసుకోకండి.

బ్రష్​లను ఎలా కడగాలి?

మీ దగ్గర బ్లష్ క్లీనర్స్ ఉంటే మంచిదే. లేదంటే బేబీ సోప్ లేదా షాంపూలను మీరు మేకప్ బ్రష్​లను క్లీన్ చేయడానికి వినియోగంచవచ్చు. ఇవే వాటిని శుభ్రం చేయడంలో బాగా పనిచేస్తాయి. వీలైతే బ్రష్ క్లీనింగ్ మ్యాట్​ తీసుకోండి. ఇది కూడా మీ మేకప్ బ్రష్​పై బ్యాక్టీరియాను తొలిగిస్తాయి.

మీ బ్రష్​లను మగ్​లో లేదా గ్లాస్​లో పెట్టి నానబెట్టకూడదు. అలా చేస్తే అది బ్రష్​కు ముళ్లను పట్టుకునే జిగురు వదిలి.. బ్రష్ నుంచి విడిపోతాయి. కాబట్టి మేకప్ వదిలించుకోవడానికి బ్రష్​పై నీటిని వేసి కడగండి. మీ వేళ్లను ఉపయోగించి.. సున్నితంగా బ్రష్​ను కడిగి పిండండి. మేకప్ బ్రష్​లను బాగా శుభ్రం చేసిన తర్వాత మీరు వాటిని టవల్ లేదా ట్రేలో ఉంచి.. శుభ్రమైన, పొడి ప్రదేశంలో ఎండబెట్టాలి. మీ గదిలోకి ఎక్కువ దుమ్ము వచ్చే అవకాశం ఉంది అనుకుంటే.. మీ బ్రష్​లను బ్రష్ హోల్డర్స్​లో కాకుండా వార్డ్ రోబ్​లో ఉంచి.. సందర్భానుసారంగా బయటకు తీసి వినియోగించుకోవచ్చు.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.