Beauty Hacks with Coconut Water : చర్మానికి, జుట్టుకు కొబ్బరి నీళ్లతో ఎన్ని ప్రయోజనాలో..

coconut water
డీహైడ్రేషన్ రెమెడీస్ (pixabay)

Beauty Hacks with Coconut Water : కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే దీనిని ఎక్కువ మంది తాగుతారు. కూల్​ డ్రింక్స్​కు బదులుగా కొబ్బరి నీళ్లు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అయితే కొబ్బరి నీళ్లు కేవలం ఆరోగ్యానికే కాదు మీ అందాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయని మీకు తెలుసా?

కొబ్బరి నీళ్లు రుచికరంగా ఉండి.. శరీరానికి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయి. అయితే ఈ సహజమైన పానీయం మీ చర్మం, జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. ఆరోగ్య ప్రయోజనాలు ఎలా పొందుతామో.. కొన్ని పద్ధతుల్లో కొబ్బరి నీళ్లు ఉపయోగించి.. అందాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఈ కొబ్బరి నీళ్లను మీ చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ దినచర్యలలో ఎలా చేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోనే ఈ బ్యూటీ హ్యాక్స్ ట్రై చేసి.. మీరు చర్మం, జుట్టు ప్రయోజనాలు పొందవచ్చు.

ఫేషియల్ మిస్ట్

మీకు పొడి, సెన్సిటివ్ స్కిన్ ఉందా? అయితే మీకు కొబ్బరి నీరు మీకు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. శరీరానికి తేమను అందించి చర్మానికి పోషణిస్తుంది. ఎందుకంటే దీనిలోని బహుళ సహజ చక్కెరలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ చర్మానికి సహజమైన, క్లియర్, హైడేటింగ్ స్కిన్ అందిస్తాయి.

ఈ ప్రయోజనాలు పొందాలంటే మీరు కొబ్బరి నీరు సగం, రోజ్ వాటర్ సగం తీసుకుని రెండింటినీ కలిపి స్ప్రే బాటిల్​లో వేసుకోవాలి. చర్మ సంరక్షణ ప్రయోజనాలు పొందడానికి దీనిని మీరు ఫేస్​ మిస్ట్​లా ఉపయోగించవచ్చు.

ఫేస్ ప్యాక్..

కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, అమినో యాసిడ్స్ వంటి చర్మాన్ని ప్రకాశవంతం చేసే వైద్య గుణాలు ఉన్నాయి. యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయని పలు అధ్యయనాలు తెలిపాయి. ఇవి మొటిమలతో పోరాడి మీకు క్లియర్ స్కిన్ అందిస్తాయి.

మిమ్మల్ని మొటిమల సమస్యలు వేదిస్తున్నా.. పొడి చర్మం మీకు చిరాకు రప్పిస్తున్న కొబ్బరి నీళ్లలో పసుపు, గంధం పొడి కలిపి ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీనిని ముఖంపై అప్లై చేసి.. తడి ఆరేవరకు ఉంచి చల్లని నీటితో ఫేస్ వాష్ చేయాలి. మెరుగైన ఫలితాల కోసం వారానికి మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు.

హెయిర్ ఫాల్ కంట్రోల్

కొబ్బరి నీరు తలలో మెరుగైన రక్త ప్రసరణను అందించి.. సరైన పోషణ ఇచ్చి.. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ వాష్​కు ముందు కొబ్బరి నీళ్లతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణను ప్రోత్సాహిస్తాయి. హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది.

మీకు డ్రై హెయిర్ ఉండి.. జుట్టు చివర్ల చిట్లిపోతున్న సమస్య ఉన్నా.. కొబ్బరి నీరు మీకు సహాయం చేస్తుంది. దీనిలోని హైడ్రేటింగ్ లక్షణాలు మీ జుట్టును మృదువుగా, సహజంగా మెరిసేలా చేస్తాయి. స్కాల్ప్ నుంచి జుట్టు చివర్లవరకు దీనిని అప్లై చేయడం వల్ల సహజమైన కండిషనింగ్ ఏజెంట్​గా పనిచేస్తుంది. పైగా కొబ్బరి నూనెల కాకుండా దీనితో మసాజ్ చేయడం వల్ల మీకు జిడ్డు ఫీలింగ్ కూడా ఉండదు. కాబట్టి మీరు షాంపూ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది.

చుండ్రుకై..

కొబ్బరి నీళ్లలో సహజమైన యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. తలలో చుండ్రు, స్కాల్ప్ ఇన్​ఫెక్షన్లను నిరోధిస్తుంది. ఈ సమస్యను పోగొట్టుకోవడానికి మీ హెయిర్ వాష్​కు ముంందు దానిని సిద్ధం చేసుకోండి.

ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు, ఆపిల్ సైడర్ వెనిగర్ సమపాలల్లో కలపండి. షాంపూ, కండీషనర్​తో తలను కడిగిన తర్వాత.. ముందు తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలపై నుంచి చివర్ల వరకు పోయాలి. నిమిషం అలాగే ఉంచి.. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెరిసే, ఫ్రిజ్​లేని జుట్టు మీ సొంతమవుతుంది.

Previous articleClean Makeup Brushes : మేకప్ బ్రష్​లను శుభ్రం చేయకుంటే చర్మ సమస్యలు తప్పవట
Next articleOnline Dating Tips : ఆన్​లైన్​ డేటింగ్​కి వెళ్తున్నారా? అయితే ఇది మీకోసమే..