Online Dating Tips : ఆన్​లైన్​ డేటింగ్​కి వెళ్తున్నారా? అయితే ఇది మీకోసమే..

first meet
ఆన్​లైన్​ డేటింగ్​ (pixabay)
Online Dating Tips : ఈ మధ్య ఆన్​లైన్​లో అన్ని దొరుకుతున్నాయి. ఆర్డర్ చేయడానికే కాదు.. ప్రేమ, స్నేహం ఇలా దాదాపు అన్ని లభ్యమవుతున్నాయి. ప్రస్తుత జనరేషన్​లోని చాలా మంది ఆన్​లైన్ డేటింగ్ వైపు తమ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ ఈ ఆన్​లైన్ డేటింగ్ కరెక్టేనా? లేక ఇలాంటి డేట్​కి వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్​లైన్​ డేటింగ్​ యాప్​ల పెరుగుదలతో చాలామంది ఆన్​లైన్​ డేటింగ్​ వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు కూడా. ఆన్​లైన్​లో ఎవరో తెలియని వ్యక్తితో డేటింగ్​ వెళ్లాలి అంటే మాటలా మరి? అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా ఇలాంటి డేటింగ్ లేదా రిలేషన్​లోకి వెళ్లాలి అనుకుంటే కచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఆన్​లైన్​లో పరిచయమైన వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసేప్పుడు మనసులో చాలా ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఒకరకమైన ఉత్సాహంతో పాటు.. గందరగోళం కూడా ఉంటుంది. ప్రత్యేకించి మీకు ఆ వ్యక్తి కేవలం ఆన్​లైన్​లో మాత్రమే తెలిసి.. కామన్ ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు ఆ పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆ వ్యక్తితో డేట్​కి వెళ్లాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు మీరు పరిగణలోకి తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భద్రతే ముందు..

మీ ఆన్‌లైన్ భాగస్వామిని మొదటిసారి కలవడానికి వెళ్తున్నప్పుడు వారి కంటే ముందు మీ భద్రతను దృష్టిలో ఉంచుకోండి. మీరు వెళ్లే ప్లేస్ సేఫో కాదో తెలుసుకోండి. ఎందుకంటే అవతలి వ్యక్తి డేటింగ్ ప్రొఫైల్, మెసేజ్​లు, కాల్స్ తప్పా మీకు వ్యక్తిగతంగా వారి గురించి మీకు ఏమి తెలియదు. వారు చెప్పిందే మీరు నమ్మాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ భద్రతకోసం బహిరంగ ప్రదేశాల్లో కలిసేందుకు మొగ్గు చూపండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీ ఫ్రెండ్స్​కి లేదా మీ కుటంబసభ్యులకు చెప్పండి.

నిజాయితీగా ఉండండి..

మీ రిలేషన్​ని మీరు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మీరు కచ్చితంగా నిజాయితీగా ఉండాలి. అప్పుడేవారు మీతో ఉండగలరో లేదో మీకు తెలుస్తుంది. అలాగే మీకున్న అనుమానాలు క్లియర్ చేసుకోండి. కొన్ని విషయాలపై క్లారిటీ తెచ్చుకోవడం కోసం ప్రశ్నలు అడగడానికి సంకోచించకండి. ఈ సమయంలో మీరు వారు కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలో, ఏ విషయాన్ని ఎక్కడివరకు చెప్పాలో ముందే ఫిక్స్ అవ్వండి. ఇది మీ ఇద్దరి రిలేషన్​కి మంచిది.

వ్యక్తిగత అభిప్రాయాలు

ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం, గౌరవించుకోవడం చాలా మంచి విషయం. వారు మీతో ఏదైనా చెప్పడానికి ఇబ్బందిపడుతుంటే వారికి కంఫర్ట్ జోన్ ఇవ్వండి. తద్వారా వారు మీతో తమ విషయాన్ని పంచుకుంటారు. ఎదుటివారు చెప్పలేక సతమతమవుతుంటే వారిని పదేపదే ఆ ప్రశ్నలు అడగకుండా వేరే టాపిక్స్ తీయండి. వారికి నచ్చే టాపిక్స్​ చర్చించండి. ఇది వారికి మీపై మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తుంది.

మెమరబుల్​గా మార్చుకోండి..

మీ మొదటి డేట్ మీకు గుర్తుండాలనుకుంటే మీరు ఆ విషయంపై కాస్త దృష్టిపెట్టాలి. అవతలి వ్యక్తి మీతో నిజంగా ప్రేమలో ఉంటే వారిని అర్థం చేసుకోవడానికి మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. అలాంటప్పుడు సినిమా వంటి వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు మాట్లాడే అవకాశం ఎక్కువ ఉండకపోవచ్చు. లేదా మీ దృష్టి సినిమా వైపే ఉంటుంది. వారితో కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది మీరు వారిని మరోసారి కలవచ్చో లేదో తెలియజేస్తుంది.

ఓపెన్ మైండ్​తో ఉండండి

ఓ మనిషి ఆన్​లైన్​లో ప్రొఫైల్ చూసి, ఫోటోలు చూసి ఓ నిర్ణయానికి రాకూడదు. వారితో నేరుగా మాట్లాడినప్పుడు మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. అది మంచి అయినా చెడు అయినా. లేదంటే మీ అంచనాలకు పూర్తిగా వారు భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిగతంగా కలిసేవరకు మీరు ఎదుటివారిపై పూర్తిగా అంచనాకు వచ్చేయకండి. ఈ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని మీరు ఆన్​లైన్​ డేట్​కి వెళ్లవచ్చు.
Previous articleBeauty Hacks with Coconut Water : చర్మానికి, జుట్టుకు కొబ్బరి నీళ్లతో ఎన్ని ప్రయోజనాలో..
Next articleUttanasana Benefits : ఈ ఆసనం రోజూ నిమిషంపాటు వేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?