Hugging Benefits: నచ్చినవారిని హగ్ చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

hugging
హగ్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు తెలుసా Pc: Pexels
Hugging Benefits: ఎలాంటి బాధనైనా.. ఒత్తిడినైనా తగ్గించే శక్తి ఒక్క హగ్ (కౌగిలింత)కు ఉందంటే నమ్ముతారా? నిజమేనండి కానీ కౌగిలింతకు ఇంత పవర్ ఉందా అని ఎవరిని పడితే వాళ్లని వెళ్లి హగ్ చేసుకోకండి. మీ మనసుకు నచ్చినవారిని, దగ్గరైన వారిని హగ్ చేసుకున్నప్పుడు మీలోని బాధ భారం సగం తగ్గిపోతుంది అంటున్నారు నిపుణులు. 
మనకి నచ్చిన వ్యక్తి దగ్గర ఎంత హ్యాపీగా ఉంటామో.. ఎవరితో అయితే మనం మనలా ఉండగలమో అలాంటివారిని హగ్ చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. హగ్గింగ్ అనేది కనెక్షన్, ఎదుటివారి దగ్గర మన సౌలభ్యాన్ని శారీరకంగా తెలియజేసే ఓ భాషగా చెప్పవచ్చు. మాటల్లో ఇవ్వలేని ఓదార్పును ఒక్క హగ్ ఇస్తుందని మీకు తెలుసా? 
 
మీ మనసులో చెప్పుకోలేనంత బాధ ఉందా? లేదా ఒత్తిడితో కూడిన జీవితంతో సతమతమవుతున్నారా? అయితే మీరు మీకు నచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లండి. వారికి ఏమి చెప్పకపోయినా మీ బాధను అర్థం చేసుకోగలిగేవారైతే హగ్ చేసుకోండి. లేదంటే మీ సమస్యను వారికి తెలిపి ఓ హగ్ ఇవ్వండి. ఇది మీలోని బాధను తగ్గించి ఓదార్పును అందిస్తుంది. ఇదే కాదండోయ్ హగ్ చేసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒత్తిడిని తగ్గిస్తుంది..

మీ ఇంట్లోవారు కానీ.. మీ ఫ్రెండ్స్ కానీ.. ఏదైనా ఒత్తిడితో బాధపడుతున్నారనని మీకు తెలిస్తే.. మీరు వారికి దగ్గర్లో ఉంటే.. వారి మాట్లాడి ఓ హగ్ ఇవ్వండి. అది ఒత్తిడితో బాధపడుతున్నవారికి ఎంతో ఓదార్పును ఇస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని పెంచుతుంది. ఆందోళనను తగ్గించి.. ప్రశాంతత, భద్రతను పెంచుతుంది. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

కొన్ని సందర్భాల్లో దగ్గరగా ఉంటే రోగాలు వ్యాపిస్తాయి అనుకుంటాము కానీ.. హగ్ చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని మీకు తెలుసా? ఒత్తిడి మనల్ని అనేక ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది. అయితే హగ్ చేసుకున్నప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్, కార్టిసాల్ మనలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయని పలు అధ్యయనాలు తెలిపాయి. 
 
తద్వారా ఒత్తిడి హార్మోన్ల క్షీణత, ఆక్సిటోసిన్ మెరైన రోగ నిరోధక ప్రతిచర్యను పెంచుతుంది. అనారోగ్యాలనుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అంతేకాకుండా మెరుగైన నిద్రను కూడా అందిస్తుంది. 

గుండె ఆరోగ్యానికి..

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిజమే నచ్చిన వ్యక్తిని హగ్ చేసుకుంటే మీ గుండె పదిలంగా ఉంటుందని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం జరిపిన ఓ అధ్యాయనం తెలిపింది. అంతేకాకుండా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని తేల్చింది. 
ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రభావం వల్లనే ఇది జరుగుతుందని వెల్లడించింది. ఆక్సిటోసిన్ అధిక రక్తపోటును తగ్గించి.. మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మంచి నిద్రకై

నచ్చినవారినుంచి హాగ్ తీసుకోవడం వల్ల మన నిద్ర చక్రం మెరుగుపడుతుంది అంటున్నారు. నిద్ర చక్రాన్ని నియంత్రించే కీలకమైన హార్మోన్ కార్టిసాల్‌ను తగ్గించి నిద్రను ప్రోత్సాహించడంలో హగ్ కీలకపాత్ర పోషిస్తుంది అంటున్నారు.
 
శరీరంలో కార్టిసాల్ స్థాయిలు తగ్గినప్పుడు ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. నిద్రలేమి అనేది మిమ్మల్ని అధిక ఒత్తిడికి గురిచేస్తుంది. కౌగిలించుకోవడం వల్ల విడుదలయ్యే ఆక్సిటోసిన్ విశ్రాంతినిచ్చి.. మంచి నిద్రను అందిస్తుంది. 

నొప్పి నుంచి ఉపశమనం

ఆక్సిటోసిన్ మీ మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా సహజ నొప్పిని తగ్గించే లక్షణాలు కూడా కలిగి ఉంది. నొప్పి నుంచి ఉపశమనం అందించి.. శారీరక అసౌకర్యం, నొప్పిని తగ్గిస్తాయి.
 
అంతేకాకుండా డ్రగ్స్, ఆల్కహాల్, స్వీట్స్ పట్ల కోరికలను తగ్గించడంలో హగ్స్ కీలకపాత్ర పోషిస్తాయి అంటున్నారు. మరి ఇంకేమి ఆలోచిస్తున్నారు.. మీరు కూడా మీకు నచ్చిన వారినుంచి హగ్స్ తీసుకుని శారీరక, మానసిక ప్రయోజనాలు పొందేయండి.
Previous articleBlack Grapes Benefits: నల్ల ద్రాక్షలు రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Next articleMasturbation Tips for women: స్త్రీలు హస్త ప్రయోగ సమయంలో పాటించాల్సిన చిట్కాలివే..