క్యారెట్ పెస‌ర‌ పప్పు ఫ్రై రెసిపీ ఇలా చేయండి.. పిల్ల‌లు ఇష్టంగా తినేస్తారు

carrot cuts
క్యారట్ పెసర పప్పు ఫ్రై రెసిపీ"Friedr Dick Knife Cutting Carrots" by Didriks is licensed under CC BY 2.0

క్యారెట్ కూర అంటే చాలామంది ఇష్ట‌ప‌డ‌రు. ముఖ్యంగా పిల్లలు క్యారెట్ కూర అంటే ఆమ‌డ దూరంలో ఉంటారు. క్యారెట్ మంచి పోష‌కాహారం. పిల్ల‌ల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా ఏదో ఒక రూపంలో క్యారెట్‌ తినిపించడం మంచిది. ముఖ్యంగా దీనిలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపుకు మేలు చేస్తుంది. అయితే క్యారెట్‌ను మామూలుగా వండితే తినాల‌నే ఆసక్తి ఉండ‌దు. క‌నుక క్య‌ారెట్‌లో పెస‌ర‌ప‌ప్పు, కొబ్బ‌రి జోడించి వండితే ఎంతో రుచిగా ఉంటుంది. పిల్ల‌లు లంచ్ బాక్స్‌లో పెడితే ఇష్టంగా తినేస్తారు. మ‌రి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

క్యారెట్ పెస‌ర‌ పప్పు ఫ్రై రెసిపీకి కావ‌ల‌సిన ప‌దార్థాలు

  1. క్యారెట్ –  అర కిలో

2. కొబ్బ‌రికాయ – కాయ‌లో స‌గం

3. పెస‌ర‌ ప‌ప్పు – ఒక క‌ప్పు

4. ప‌చ్చిమిర్చి –  నాలుగు

5. నూనె – రెండు టేబుల్ స్పూన్లు

6. ఆవాలు – ఒక టీ స్పూన్

7. జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్

8. క‌రివేపాకు – కొద్దిగా

9. అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్సూన్

10. ప‌సుసు – చిటికెడు

11. ఉప్పు – త‌గినంత

12. కొత్తిమీర –  కొద్దిగా

క్యారెట్ పెసర పప్పు ఫ్రై రెసిపీ త‌యారీ విధానం

స్టెప్ 1: ముందుగా క్యారెట్‌పై ఉన్న తొక్క‌ను తొల‌గించి వాటిని శుభ్రంగా క‌డిగాలి.

స్టెప్ 2: త‌ర్వాత వాటిని వీలైనంత చిన్న ముక్క‌లుగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెస‌ర‌ ప‌ప్పును ఒక ఐదు నిమిషాలు నాన‌బెట్టుకోవాలి. అలాగే కొబ్బ‌రి కాయ‌ను తురిమి ప‌క్క‌న పెట్టుకోవాలి.

స్టెప్ 3: ఇప్పుడు స్టౌ మీద క‌ళాయి పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి అవి కొంచెం మ‌రిగాక క్యారెట్ ముక్కలు, పెస‌ర‌ పప్పు వేసుకుని కొద్దిసేపు ఉడ‌క‌నివ్వాలి.

స్టెప్ 4: ఇప్పుడు మ‌ర‌లా ప్యాన్ పెట్టుకుని నూనె పోసుకుని కొంచెం వెడి అయ్యాక అందులో ఆవాలు, జీల‌క‌ర్ర‌, కొద్దిగా క‌రివేపాకు వేసుకోవాలి. ఇలా వేపుకున్న త‌ర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయేలా కలుపుకోవాలి.

స్టెప్ 5: త‌ర్వాత ప‌చ్చిమిర్చిని కొద్దిగా పేస్ట్ చేసుకుని అందులో వేసుకోవాలి.

స్టెప్ 6: అది కొంచెం వేగాక ముందుగా ఉడ‌క‌బెట్టిన క్యారెట్ పెస‌ర‌ ప‌ప్పును వేసుకోవాలి.

స్టెప్ 7: ఆపై కొబ్బ‌రి తురుమును కూడా వేసి వేయించుకోవాలి. అందులో స‌రిప‌డా ఉప్పును కూడా వేసి కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మీడియం మంట‌పై మ‌గ్గ‌నివ్వాలి. చివ‌రిగా కొత్తిమీర‌ను వేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. 

అంతే  క్యారెట్ రెసిసీ రెడీ. దీనిని పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా  ఇష్టంగా తినేయ‌చ్చు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleSapota Health benefits: వేసవిలో సపోటా పండ్లతో అద్భుతమైన ప్రయోజనాలు.. తప్పక తినాల్సిందే
Next articleAP Tourist Places: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చూడ‌వ‌ల‌సిన బెస్ట్ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు ఇవే