Mobile Data Saving Tips:మీ ఫోన్‌లో డేటా త్వ‌ర‌గా అయిపోతుందా! అయితే ఈ చిట్కాలు పాటించండి

Mobile data
మొబైల్ డేటా సేవింగ్ టిప్స్ Photo by PhotoMIX Company on Pexels

Mobile Data Saving Tips: మీ మొబైల్‌లో డేటా త్వరగా అయిపోతుందా? అయితే ఈ సింపుల్‌ డేటా సేవింగ్‌ టిప్స్‌ మీకోసమే. ఈ రోజుల్లో ప్ర‌తిఒక్క‌రి చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో ఇంట‌ర్‌నెట్ త‌ప్ప‌నిస‌రి అయిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇంటర్నెట్ ధరలు కూడా  భారీగానే పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఫోన్‌లో ఇంట‌ర్‌నెట్ వినియోగం పెరుగుతూనే వస్తోంది. అయితే చాలామంది ఎదుర్కొనే స‌మ‌స్యల‌లో మొబైల్‌లో డేటా త్వ‌ర‌గా అయిపోవ‌డ‌మే. దీనితో వినియోగ‌దారులు అద‌నంగా డేటాను మ‌ళ్లీ రీఛార్జ్ చేసుకునే ప‌రిస్థితి వ‌స్తుంది. మరి ఈ డేటా త్వ‌ర‌గా అయిపోకుండా ఉండేందుకు ఈ చిట్కాల‌ను మీరూ పాటించండి.

డేటా రక్షణకు చిట్కాలు

1. స్మార్ట్‌ఫోన్‌లలోని కొన్ని యాప్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. దీని కారణంగా ఇంటర్నెట్ డేటా చాలా త్వరగా అయిపోతుంది. అందుకే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోమేటిక్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ ఆఫ్ చేయండి. WiFi ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే యాప్‌లను అప్‌డేట్ చేయడం మంచిది.

2. మొబైల్ డేటా వాడుతున్న‌ప్పుడు డేటా ఎక్కువ‌గా ఉప‌యోగించే యాప్‌ల వినియోగం త‌గ్గించాలి. సోష‌ల్ మీడియాలో ఎక్కువగా వీడియోలు చూడ‌డం వ‌ల‌న డేటా తెలియ‌కుండానే చాలా త్వ‌ర‌గా అయిపోతుంది.

3. ఆండ్రాయిడ్ ఫోన్లలో డేటా సేవింగ్ మోడ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఉన్నవారు ఎనేబుల్ చేస్తే డేటాను సేవ్ చేసుకోవచ్చు. డేటా సేవింగ్ మోడ్ ఫీచర్ సహాయంతో, వీలైనంత ఎక్కువ డేటాను సేవ్ చేయడానికి అవకాశం ఉంది.

4. డేటా సేవింగ్ కోసం సెట్టింగ్‌ల‌లో డేటా లిమిట్ అనే ఆప్ష‌న్‌ను సెట్ చేసుకుంటే మంచిది. దీన్ని సెట్ చేయ‌డం కోసం డేటా యూసేజ్ ఆప్ష‌న్‌ను నొక్కండి. ఇందుకోసం డేటా లిమిట్, బిల్లింగ్ సైకిల్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

5. చాలామంది  గూగుల్ మ్యాప్ వినియోగిస్తూ ఉంటారు. ఈ సంద‌ర్భంలో కూడా డేటా త్వర‌గా  అయిపోవడానికి అవ‌కాశం ఉంది. కానీ ఈ గూగుల్ మ్యాప్ వంటి యాప్‌లను ఆన్‌లైన్ మోడ్‌లో కాకుండా ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉపయోగిస్తే  ఇది ఇంటర్నెట్ డేటాను వీలైనంత వరకు సేవ్ చేస్తుంది.

6. చాలామంది నైట్ నిద్ర‌పోయే ముందు డేటా ఆఫ్ చేయ‌కుండా అలానే ఉంచేస్తారు. అలా చేయ‌డం మంచిది కాదు. దీని వ‌ల్ల త్వ‌ర‌గా డేటా అయిపోతుంది. ఇంక డేటా ఎప్పుడైతే వినియోగించాలి అనుకుంటామో అప్పుడే ఆన్ చేసుకోవ‌డం ఉత్త‌మం. ఖాళీ స‌మ‌యంలో డేటాను ఆఫ్ చేసి ఉంచ‌డ‌మే మంచిది. దీని వ‌ల్ల డేటాతో పాటు బ్యాట‌రీ సామ‌ర్థ్యం కూడా ఎక్కువ కాలం ఉంటుంది.

7. కొన్ని సంబంధం లేని యాప్‌ల నుంచి త‌రుచూ నోటిఫికేష‌న్‌లు వ‌స్తూనే ఉంటాయి. ఈ నోటిఫికేష‌న్లు రాకుండా సెట్టింగ్‌ల‌ను ఆఫ్ చేయాలి. ఎందుకుంటే అన‌వ‌స‌ర‌మైన నోటిఫికేష‌న్ల వ‌ల్ల కూడా డేటా త్వ‌ర‌గా అయిపోవ‌డానికి ఛాన్స్ ఉంటుంది.

8. 5జి డేటా చాలా వేగంగా ప‌నిచేస్తుంది. 4జి తో పోలిస్తే ఎక్కువ డేటాను, బ్యాట‌రీని  వినియోగిస్తుంది. అయితే మీ స్మార్ట్ ఫోన్ 5జి, 4జి  స‌పోర్ట్ చేస్తే 4జి కి ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం మంచిది. అలా అయితే డేటాను సేవ్ చేసుకోవ‌చ్చు.

9. వాట్సాప్‌లో కనిపించే ఫోటోలు, వీడియోలు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవ్వడం డేటా అయిపోవడానికి మరో ప్రధాన కారణం. ఆటోమేటిక్ డౌన్‌లోడ్ ఎంపిక నుండి వీడియోలు, ఫోటోలను తీసివేయండి. లేదంటే డేటా వేగంగా అయిపోతుంది.

10. సాధారణంగా  ప్రయాణాల సమయంలో ఓటీటీ  ప్లాట్‌ఫారమ్‌లు లేదా యూట్యూబ్  వీడియోలను చూస్తుంటారు. అలా కాకుండా, ఎక్కడైనా WiFi అందుబాటులో ఉన్నప్పుడు కొన్ని వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్ డేటాను సేవ్ చేయవచ్చు. వాటిని ఖాళీ సమయాల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో చూడవచ్చు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleNuvvula Laddu recipe: నువ్వుల ల‌డ్డు రెసిపీ.. రోజూ ఒక ల‌డ్డు తింటే చాలు ఎంతో బలం
Next articleWeekend Releases: ఈ వీకెండ్ థియేట‌ర్, ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న సినిమాలివే!