Afternoon Slump :లంచ్​ తర్వాత నిద్ర వచ్చేస్తుందా? ఇలా దూరం చేసుకోండి.. 

Afternoon Slump
భోజనం తర్వాత నిద్ర వస్తుందా?
Drowsiness after a Meal : మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కునుకు వేయకపోతే తలనొప్పి వచ్చేస్తాదని చాలామంది గృహిణులు చెప్తారు. అయితే ఇది కేవలం వారికి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆఫీస్​లకు వెళ్లేవారికి కూడా భోజనం చేసిన తర్వాత కాస్త మగతగా ఉంటుంది. దీనికి గల కారణలేమిటో.. దీనిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లంచ్ చేసిన తర్వాత శరీరంలో కాస్త శక్తి తగ్గి.. కనురెప్పలు బరువెక్కడం అనేది చాలా సాధారణమైన విషయం. ఆ సమయంలో పనిచేయడం కష్టంగా ఉంటుంది. అందుకే కొందరు ఆఫీస్​లో పడుకునే వీలులేకుంటే.. పని చేయకుండా కొంచెం సేపు అలానే కూర్చొంటారు. అయితే అన్ని వేళల ఇది పనికి రాదు. మీరు కూడా దీనితో ఇబ్బంది పడుతుంటే కొన్ని మార్గాలతో దీనిని దూరం చేసుకోండి.

ఆరోగ్య సమస్యలు

థైరాయిడ్, స్లీప్ ఆప్నియా, రక్తహీనత, శారీరక, మానసిక ఒత్తిడి, మధుమేహం వంటి వైద్య సమస్యలున్నవారికి కూడా మధ్యాహ్నం తిన్న తర్వాత మగతగా ఉంటుంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ లేనప్పుడు, తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా మధ్యాహ్నం నిద్ర వస్తుంది.

ఆహారంలో మార్పులు

మీ సిర్కాడియన్ రిథమ్ మీరు తీసుకునే ఆహారం, చేసే పనుల వల్ల ప్రభావమై భోజనం తర్వాత మగతగా అనిపించవచ్చు. కాబట్టి తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. అధిక ప్రోటీన్ కలిగిన ఫుడ్ కంటే అధిక కార్బ్స్, అధిక కొవ్వు కలిగిన ఫుడ్స్ మీకు నిద్ర వచ్చేలా చేస్తాయి.
తేలికైన ఆహారం కంటే.. భారీ భోజనం మీకు మరింత నిద్రను కలిగిస్తుంది. నిద్ర రావడం తప్పు కాదు కానీ.. పగటి వేళ నిద్ర అంత మంచిది కాదు. అన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. కడుపు కాస్త వెలితిగా ఉండేలా ఆహారాన్ని తీసుకుంటే మరీ మంచిది.

నాప్ తీసుకోండి

భోజనం తర్వాత నిద్ర బాగా ఇబ్బంది పెడుతుంటే ఓ పది నిముషాలు నిద్రపోండి. లేదంటే అలా కళ్లు మూసుకుని రెస్ట్ తీసుకోండి. అనంతరం మీరు మీ పనిని మరింత చురుకుగా చేస్తారు. పడుకోమన్నారు కదా అని గంటలు గంటలు పడుకోకుండా పది నుంచి పదిహేను నిముషాలు నిద్రపోతే సరిపోతుంది. దీనివల్ల మీకు అనే ప్రయోజనాలు కూడా ఉంటాయి. నిద్ర ఫీలింగ్ పోతే మీరు ఆ తర్వాత సమయాన్ని పనిపై బాగా శ్రద్ధ పెట్టగలరు.

రాత్రి నిద్ర

రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోండి. చాలామంది రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోరు. ఉదయాన్నే లేచి బయటకు వెళ్లాక నిద్రతో ఇబ్బందిపడుతూ ఉంటారు. కాబట్టి రాత్రి వీలైనంత త్వరగా నిద్రపోండి. ఇది మీకు మధ్యాహ్న నిద్ర నుంచి ఉపశమనం అందిస్తుంది.
మీ రాత్రి నిద్ర 8 గంటలు ఉండేలా చూసుకుంటే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. నిద్రలేమి, ఆందోళన, స్లీప్ ఆప్నియాతో ఇబ్బంది పడుతుంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోండి.

కాస్త ఎండలోకి వెళ్లండి..

నిద్ర చక్రం సూర్యకాంతికి ఎక్కువగా ప్రభావితమవుతుంది. కాబట్టి మీకు లంచ్ తర్వాత మీకు మగతగా అనిపిస్తే ఎండలో బయటకు వెళ్లి రండి. ఇది మీ ఇంద్రియాలను స్లీప్​మోడ్​ నుంచి బయటకు తీసుకువస్తుంది. మీ కనురెప్పల్ ఎండ ప్రభావంతో మేల్కొంటాయి.

వ్యాయామం

మీకు మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంటే తేలికపాటి వ్యాయామం చేయవచ్చు. తిన్న తర్వాత కొంచెం సమయం ఆగి వాక్ చేయవచ్చు. లేదంటే కూర్చొన్న ప్లేస్​లోనే బేసిక్ స్ట్రెచ్స్ చేయండి. ఇది మిమ్మల్ని చురుకుగా ఉండేలా మందగించకుండా చేస్తుంది. లేదంటే కొన్ని యోగ ఆసనాలు ట్రై చేయండి. ఇవి కూడా నిద్రను దూరం చేయడంలో ప్రభావితంగా ఉంటాయి.
Previous articleApple iPhone 15 Launch: భారత్​లో యాపిల్ ఐఫోన్ 15 గ్రాండ్​ లాంచ్.. ధర, వివరాలివే..
Next articleCondom Safety : కండోమ్​ చిరిగిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..