Condom Safety : కండోమ్​ చిరిగిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Condom Safety
కండోమ్ చిరిగిపోవడానికి కారణాలివే

Condom Tips : లైంగిక వ్యాధులు సోకకుండా, ప్రెగ్నెన్సీ ప్లానింగ్స్ లేనప్పుడు చాలామంది కండోమ్స్ ఉపయోగిస్తారు. అయితే కొన్నిసార్లు ఇవి చిరిగిపోతాయి. తద్వార గర్భం లేదా వివిధ లైంగికంగా సంక్రమించే వ్యాధులు సోకుతాయి. అసలు కండోమ్స్ చిరిగిపోవడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ భాగస్వామితో, లేదా మీకు నచ్చిన వ్యక్తితో మీరు హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు కండోమ్ చిరిగిపోతే.. అది మీకు ఆనందాన్ని ఇవ్వడం అటుంచి.. లేనిపోని భయాలు కలిగిస్తుంది. అయితే కండోమ్ అనేక కారణాల వల్ల చిరిగిపోవచ్చు. అయితే ఎందువల్ల కండోమ్ విచ్ఛిన్నమవుతుందో తెలుసుకుని తదుపరిసారి మీరు జాగ్రత్త పడొచ్చు. అవేంటంటే..

కండోమ్ పాతది కావచ్చు..

కండోమ్​లు వాటి గడువు తేదీ దాటినతర్వాత ఉపయోగిస్తే చిరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని వస్తువుల్లాగానే వీటికి కూడా గడువు ఉంటుందని గుర్తించుకోండి. కాబట్టి మీరు వాటిని కొనగోలు చేసేటప్పుడు గడువు తేదీని చెక్ చేసుకోండి.

అధిక వేడి..

అధిక వేడికి గురైనప్పుడు కండోమ్స్ చిరిగిపోతుంటుంది. కాబట్టి మీ ప్యాకెట్​లో లేదా బ్యాగ్​లో కండోమ్స్ పెట్టుకుని.. ఎండలో బయట ఎక్కువగా తిరిగినప్పుడు అవి బాగా వేడికి గురవుతాయి. పైగా అవి చాలా డెలికెట్​గా ఉంటాయి కాబట్టి ఎండ తీవ్రతకు, రాపిడి సమయంలో చిరిగిపోతుంటాయి కాబట్టి కండోమ్​లను చల్లని, చీకటి ప్రదేశాలలో సూర్యకాంతికి, వేడికి దూరంగా ఉంచాలి.

హార్డ్ సెక్స్

కాస్త బలం ప్రయోగించి జరిపే లైంగిక ప్రక్రియ ఆహ్లాదకరంగానే ఉండొచ్చు. అది మీ ఇద్దరికీ నచ్చినా సరే.. మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ఎక్కువ రాపిడి వల్ల కండోమ్ చిరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లూబ్రికెంట్ ఉపయోగిస్తే మంచిది. ఇది కండోమ్ చిరిగిపోకుండా సహాయం చేస్తుంది. వీలైతే లూబ్రికేటెడ్ కండోమ్​లను ఉపయోగించవచ్చు. మంచి లూబ్రికెంట్ ఎంచుకోవడం ద్వారా రాపిడి సమయంలో కండోమ్ చిరగకుండా ఉంటుంది.

సైజ్ ప్రాబ్లం

కొన్ని సందర్భాల్లో కండోమ్ చాలా చిన్నదిగా లేదా పెద్దదిగా ఉంటుంది. దీనివల్ల అది చిరిగిపోయే ప్రమాదం ఎక్కువ. కండోమ్​లు సరిగ్గా పెట్టకపోయినా.. పట్టకపోయినా అవి త్వరగా చిరిగిపోతాయి.

తయారీ లోపం

కొన్ని సందర్భాల్లో మీ తప్పు లేకపోయినా.. తయారీదారు చేసే లోపాల వల్ల కండోమ్ చిరిగిపోవచ్చు. కాబట్టి మీరు మంచి కంపెనీకి సంబంధించినవి ఉపయోగిస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. లేదంటే లైంగిక చర్యలో ఉండగా అవి చిరిగిపోయి.. మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి వాటిని కొనగోలు చేసేముందు బాగా పరీక్షించి అవి మీకు సెట్​ అవుతాయో లేదో చెక్ చేసుకోండి.

కండోమ్ చిరిగిపోతే ఏమి చేయాలి?

లైంగిక చర్యలో ఉన్నప్పుడు కండోమ్ చిరిగినట్లు గుర్తిస్తే మీరు వెంటనే ఆపేసి కొత్త కండోమ్​ని ఉపయోగించాలి. ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని అనుమానం మీకు కలిగితే వైద్యుడిని సంప్రదించండి. బ్రేకేజ్​ని నివారించడానికి, సురక్షితమైన సెక్స్​లో పాల్గొనేందుకు పైన పేర్కొన్న చిట్కాలను గుర్తించుకోండి.

Previous articleAfternoon Slump :లంచ్​ తర్వాత నిద్ర వచ్చేస్తుందా? ఇలా దూరం చేసుకోండి.. 
Next articleNatural Detox Diet : శరీరాన్ని డిటాక్స్ చేసే డైట్​ ప్లాన్ ఇదే.. ఫాలో అయిపోండి..