Pudina Rice: పుదీనా రైస్ ఇలా చేయండి! ఈజీ, టేస్టీ రెసిపీ

a plate of rice with onions and onions
పుదీనా రైస్ తయారీ విధానం తెలుసుకోండి Photo by Kalyani Akella on Unsplash

Pudina Rice: పుదీనా రైస్ అన్నింటికంటే సులువైన రెసిపీ. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా లాభ‌దాయ‌క‌మే. మంచి సువాసనను క‌లిగి ఉంటుంది. పుదీనా చలువ చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. పుదీనా తిన‌డం వ‌లన ఎటువంటి జీర్ణ సమస్యలు తలెత్తవు. ఇది బరువు తగ్గడంలో కూడా పోరాడుతుంది. పుదీనా కఫం, శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ అనారోగ్యాలను దూరం చేస్తుంది. ఇంకా పుదీనాలోని యాంటీఆక్సిడెంట్ రోస్మరినిక్ యాసిడ్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇది మీ చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో, వృద్దాప్య సంకేతాలను త‌గ్గించ‌డంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పుదీనా వల్ల  శారీరకంగా, మానసికంగా రిఫ్రెష్ చేస్తుంది. పుదీనాలో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లిగి ఉన్నందున దీనిని త‌ప్ప‌నిస‌రిగా ఆహ‌రంలో భాగం చేసుకోవాలి. చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ రెసిపీ చేసుకోవడానికి వీలుంటుంది. పైగా పిల్ల‌ల లంచ్ బాక్స్‌లో కూడా దీనిని ఈజీగా స‌ర్వ్ చేయొచ్చు. మ‌రి దీన్ని చేసే ప‌ద్ద‌తి ఇక్కడ తెలుసుకోండి.

పుదీనా రైస్ త‌యారీకి కావ‌ల‌సిన ప‌దార్థాలు:

  1. పుదీనా ఆకులు – ఒక క‌ప్పు
  2. బియ్యం –  ఒక క‌ప్పు
  3. క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు
  4. ఆవాలు – స్పూన్
  5. పసుపు -చిటికెడు
  6. టేబుల్ స్పూన్ నిమ్మరసం
  7. పచ్చి మిరపకాయలు  – రెండు
  8. తురిమిన అల్లం – అర స్పూన్
  9. శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్
  10. మినపపప్పు – ఒక టేబుల్ స్పూన్
  11. వేరుశనగ లేదా జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్
  12. నూనె – రెండు టేబుల్ స్పూన్లు

పుదీనా రైస్ త‌యారీ విధానం:

స్టెప్ 1: ముందుగా బియ్యం కడిగి, కనీసం 15 నుండి 20 నిమిషాలు నానబెట్టాలి. 

స్టెప్ 2: త‌ర్వాత ఒక బ్లెండర్ జార్‌లో పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు  మెత్తని పేస్ట్‌లా చేయాలి.

స్టెప్ 3: ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో నూనె పోసి వేడి చేయండి. ఇందులో కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు మొదలైన పోపు దినుసులు వేసి వేయించండి. అవ‌స‌ర‌మైతే ఇక్క‌డ కొన్ని మ‌సాలా దినుసులు వేసి వేయించండి. 

స్టెప్ 4: ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేయించండి, బాగా కలపండి.

స్టెప్ 5: ఆ తర్వాత బియ్యం ఉడికించేందుకు అవసరం మేరకు నీరు పోయండి, కొద్దిగా ఉప్పువేసి మరిగించండి. ఒక మరుగు వ‌చ్చిన  తర్వాత నానబెట్టిన బియ్యం వేసి కలపండి. నీరు ఆవిరయ్యేంత వరకు ఉడికించండి.

స్టెప్ 6: నీరు కొద్దిగా ఉన్నప్పుడు కుక్కర్ మూతపెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి.

స్టెప్ 7: అంతే, ఎంతో టేస్టీగా ఉండే క‌మ్మ‌ని  పుదీనా అన్నం రెడీ. ఇష్ట‌మైన వాళ్లు ఇందులో  నిమ్మరసం క‌లుపుకోవ‌చ్చు. మ‌రింత రుచిని ఇస్తుంది. దీనిని రైతా లేదా బంగాళదుంప కుర్మా కూరతో సర్వ్ చేసుకోవచ్చు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleRaisins Health Benefits: ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్లొచ్చు
Next article వేస‌వి సెల‌వుల్లో మీ పిల్ల‌ల‌కు వినోదంతో పాటు ఇలాంటి ప‌నులు నేర్పించండి!