Raisins Health Benefits: ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్లొచ్చు

raisins in wooden bowl
ఎండు ద్రాక్షల ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండిPhoto by Neva Kuruyemiş on Unsplash

Raisins Health Benefits: ఎండు ద్రాక్షలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే శరీర బరువు తగ్గడానికి కూడా ఎండుద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది.

ఎండు ద్రాక్ష వల్ల ఉప‌యోగాలు:

1.జీర్ణక్రియకు సహాయప‌డుతుంది

ప్రతిరోజూ కొన్ని ఎండు ద్రాక్షలు తినడం వల్ల  జీర్ణ‌క్రియ సాజావుగా సాగుతుంది. ఎండుద్రాక్షలో  ఫైబర్ అధికంగా ఉండ‌డం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. ఇవి ప్రేగు కదలికను క్రమబద్ధంగా ఉంచుతాయి. ఫైబర్ మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చిన్న‌పిల్ల‌ల్లొ జీర్ణ‌శ‌క్తి  బాగా పెరిగేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

2. కంటి సంర‌క్ష‌ణ‌కు:

ఎండు ద్రాక్ష కళ్లకు ఎంతో  మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలో పాలీఫెనోలిక్ ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. కంటి చూపును బలంగా ఉంచడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ చర్యను తగ్గించడం, కంటిశుక్లాల వంటి స‌మ‌స్య‌ల‌కు కారణమవుతుంది. అలాగే, ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, బీటా-కెరోటిన్, కెరోటినాయిడ్లు ఉంటాయి. అవి కళ్లకు చాలా మేలు చేస్తాయి.

3. ఎసిడిటీని నియంత్రిస్తుంది:

ఎండు ద్రాక్షలో పొటాషియం,  మెగ్నీషియం ఉంటాయి. ఇవి అసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి. శ‌రీరం నుండి టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్, కిడ్నీ స్టోన్స్ మరియు గుండె జబ్బులు వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

4. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది:

ఎండు ద్రాక్షలు రోజూ తిన‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు శ‌క్తివంతం అవుతుంది.  పాలీఫెనాల్స్, టానిన్లు మరియు ఫినోలిక్ యాసిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల అధికంగా ఉంటాయి. వీటిని   తీసుకోవడం వల్ల  వృద్ధాప్య  ఛాయ‌లు త‌గ్గుతాయి. అలాగే  జ్ఞాపకశక్తిని పెంచుతాయి. 

5. రక్తహీనతను నివారిస్తుంది

ఎండుద్రాక్షలో అధిక శాతం ఐరన్ కంటెంట్, బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తహీనతకు చికిత్సలో సహాయపడతాయి. ఎండుద్రాక్షలో ఉండే కాపర్ కంటెంట్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. అలాగే ఎండుద్రాక్ష‌లోని ఐర‌న్ ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించి మ‌ధుమేహాన్ని త‌గ్గిస్తుంది. వృద్ధులలో, మ‌హిళ‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా 85 ఏళ్లు పైబడిన వారిలో ర‌క్త‌హీనత స‌ర్వ‌సాధార‌ణం. వృద్ధులలో, రక్తహీనత కేసుల్లో మూడింట ఒక వంతు ఐరన్, ఫోలేట్ లేదా విటమిన్ B12 లోపం వంటి పోషకాహార లోపాల వల్ల సంభవిస్తుంది. క‌నుక మ‌హిళ‌లు వారి ఆహ‌రంలో  తగినంత ఐర‌న్ కంటెంట్  ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు ఋతు చక్రాల సమయంలో రక్తాన్ని కోల్పోవడం వల్ల పిల్లలను కనే వయస్సులో ఉన్న స్త్రీలలో ఐర‌న్ లోపం రక్తహీనత స‌మ‌స్య‌కు కార‌ణ‌మ‌వుతుంది.

6. ఇన్ఫెక్షన్లను త‌గ్గిస్తుంది:

ఎండుద్రాక్షలోని పీచు ప‌దార్థం, యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా ప‌నిచేసి  బాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్ల‌ను తగ్గిస్తాయి.  ఇవి జ్వరం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. బ్యాక్టీరియాను చంపుతాయి. రోజుకు కొన్ని ఎండుద్రాక్షలను తీసుకోవడం వల్ల జలుబు మరియు ఇతర ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

7. మెరిసే చ‌ర్మానికి ఎండు ద్రాక్ష:

ఎండుద్రాక్ష‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కాపాడుకోవ‌చ్చు. చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నాన‌బెట్టిన ఎండుద్రాక్ష‌ను త‌రుచూ తీసుకోవ‌డం మేలు. వీటిలో మెగ్నీషియం, పొటాషియం, కాప‌ర్, పాస్ప‌ర‌స్ వంటి ఖ‌నిజ ల‌వ‌ణాలు ఉంటాయి. ఇవి శ‌రీర ఆరోగ్యానికి, చ‌ర్మ సంరక్ష‌ణ‌కు తోడ్ప‌డ‌తాయి. ఎండు ద్రాక్ష చ‌ర్మ మెరుపును కోల్పోకుండా చేస్తుంది. తేమ‌ను అందిస్తుంది. కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్‌లను దెబ్బతీయకుండా నిరోధిస్తుంది. అలాగే  ముడతలు, గీతలు మరియు మచ్చలు వంటి వృద్ధాప్య ఛాయ‌ల నుంచి ర‌క్షిస్తుంది.  

8. బరువు త‌గ్గ‌డానికి ఎండు ద్రాక్ష:

ఎండుద్రాక్ష బరువు త‌గ్గించ‌డంలో సహాయపడుతుంది. బరువు త‌గ్గాల‌నుకునే వారు ఈ ఎండు ద్రాక్షను తింటే చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక శక్తిని అందిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తూ బరువు త‌గ్గడానికి  ఉప‌క‌రిస్తాయి. ఎండుద్రాక్ష‌లో కాల్షియం కూడా ఉండ‌డం వ‌ల్ల ఎముకలకు మేలు చేస్తాయి.

9. జుట్టు సంర‌క్ష‌ణ‌కు ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష మీ జుట్టును అందంగా మార్చుతుంది. ఆరోగ్య‌వంత‌మైన జుట్టును అందించడంలో ఎండుద్రాక్ష స‌హాయ‌ప‌డుతుంది. కాప‌ర్ మెల‌నిన్ ఉత్ప‌త్తి కారణంగా జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా మార‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. జుట్టు మెరిసే ల‌క్ష‌ణాన్ని క‌లిగి ఉండేందుకు కాప‌ర్ ఎక్కువ‌గా ఉంగే ఎండుద్రాక్ష‌ను తినాల్సిందే. అంతేకాక పొటాషియం, ఐర‌న్ జుట్టుకు రక్త‌ ప్ర‌స‌ర‌ణ‌ను పెంచి జుట్టు బలంగా త‌యారవ్వ‌డంలో ప్ర‌ధానంగా ప‌నిచేస్తుంది. జుట్టుకు మంచి కండీష‌న్‌లా ప‌నిచేసి నిగారింపును ఇస్తుంది. అలాగే చుండ్రు స‌మ‌స్య‌ను ద‌రిచేర‌న‌వ్వ‌దు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleచిల‌గడ‌దుంప వంకాయ కూర.. చిటికెలో చేసేయొచ్చు
Next articlePudina Rice: పుదీనా రైస్ ఇలా చేయండి! ఈజీ, టేస్టీ రెసిపీ