Home ఎంటర్‌టైన్‌మెంట్‌ గౌతమ్ ఎంట్రీపై మహేష్ బాబు ఏమన్నాడు

గౌతమ్ ఎంట్రీపై మహేష్ బాబు ఏమన్నాడు

0
గౌతమ్ ఎంట్రీపై మహేష్ బాబు ఏమన్నాడు

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మూడో తరం వారసుడు గౌతమ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నాడు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. ఇప్పుడు ఆయన వారసుడిగా తన కుమారుడు గౌతమ్.. ఘట్టమనేని విజయపరంపరను కొనసాగించే పనిలో ఉన్నాడు.

గౌతమ్ సినీ ప్రయాణం విషయమై మహేష్ బాబు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. insta లైవ్ చాట్ లో గౌతమ్ భవిష్యత్తులో హీరో అవుతాడా? అని యూజర్స్ అడిగిన ప్రశ్నకు మహేష్ స్పందించాడు.

గౌతం కూడా హీరో అవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తనకు అనిపిస్తోందని తేల్చేశాడు. ఈ విషయంలో వేచి చూద్దామని, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని స్పష్టం చేశాడు. ఇప్పటికే గౌతమ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన 1 నేనొక్కడినే చిత్రంలో మహేష్ బాల నటుడి పాత్రలో మెప్పించాడు.

ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ లో గౌతం ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడంపై స్పందించిన సుకుమార్.. ఇంకో సూపర్ స్టార్ ను ఇండ్రడ్యూస్ చేసిన ఘనత మాత్రం తనకే దక్కుతుందని చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ లో నటన విషయంలో గౌతమ్ తనకు షాక్ ఇచ్చాడని, డబ్బింగ్ కూడా ఒకే టేక్ లో చెప్పి మరో షాక్ ఇచ్చాడని సుకుమార్ అన్నారు.

మరి గౌతం హీరోగా తొలి చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తారా? లేదా ఇంకెవరికైనా మహేష్ అవకాశం ఇస్తారా? అన్నది కూడా కాలామే సమాధానం ఇవ్వాలి. ఇక మహేష్ బాబు కుమార్తె సితారా డిస్నీ-2లో బేబీ ఇల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పి మెప్పించిన విషయం తెలిసిందే.

మార్పును అంగీకరించి జీవిద్దాం..

ఇక ప్రేక్షకులతో చాట్ సందర్భంగా మహేష్ మరిన్ని విషయాలను పంచుకున్నాడు. అందరి దృష్టిలో మహేష్ ఎలా గుర్తుండి పోవాలనుకుంటున్నారని అడిగితే.. ఒక గొప్ప నటుడిగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా గుర్తుండిపోవాలని అన్నాడు.

ఇక క్రేజీ కాంబినేషన్ రాజమౌళి, మహేష్ చిత్రంపై స్పందిస్తూ.. తామిద్దరం ఖచ్చితంగా కలసి సినిమా చేయనున్నట్టు చెప్పాడు.

ఖాళీ సమయాల్లో పిల్లలతో ఆడుకోవడం, గౌతమ్ తో కలసి ఆన్ లైన్లో టెన్నిస్, గోల్ఫ్, బేస్ బాల్ ఆడడం, పుస్తకాలు చదవడం, ఈత కొట్టడం తనుకు ఇష్టమని చెప్పాడు మహేష్.

ఇక దర్శకుడు పరశురామ్ తో చేయనున్న సర్కారు వారి పాట చిత్రానికి హీరోయిన్ ఎవరని అడిగితే.. ఎవరైతే బాగుంటుందో సలహా ఇవ్వమని ప్రేక్షకులను తిరిగి అడిగేశాడు. ఇక చివరగా ఈ లాక్ డౌన్ తరువాత జీవితం భిన్నంగా ఉంటుందని, ఆ మార్పును అందరూ అంగీకరించి జీవించాలని సూచించాడు మన టాలీవుడ్ సూపర్ స్టార్.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article జ్ఞాపకాలు మిఠాయి డబ్బా లాంటివి.. 
Next article పెద్ద హీరోల పారితోషికాలు తగ్గించుకోవాల్సిందేనా..!
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.