Home ఫుడ్ కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే ఇష్టంగా తినొచ్చు..!

కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే ఇష్టంగా తినొచ్చు..!

0
కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే ఇష్టంగా తినొచ్చు..!
Pic: Lavanya

కాకరకాయ చేదుగా ఉండడంతో చాలా మందికి నచ్చదు. పిల్లలకు అసలే నచ్చదు. కానీ కాకరకాయ ఫ్రై చేసి ట్రై చేస్తే.. ఇక ఎప్పటికీ నో అనే ఛాన్సే లేదు. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, బయోటిన్, జింక్, ఫైబర్, కాల్షియం, బీటా కెరోటిన్, ప్రొటీన్‌ వంటివన్నీ మెండుగా ఉండే కాకర ఆరోగ్య పోషకాల ఖనిగా చెప్పొచ్చు.

కాకరకాయ శరీరంలో షుగర్‌ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్‌ వంటి పాలిపెప్టయిడ్ ‌–పి అనే పదార్థం చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.

లివర్‌ను ఆరోగ్యవంతంగా మార్చుతుంది. మోమోర్డికా చరంతియా అనే పదార్థం లివర్‌కు రక్షణ కవచంగా నిలుస్తుంది.

అలర్జీలను తొలగిస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే మీ స్కిన్‌ గ్లో అవ్వాలంటే కూడా కాకరకాయ తినాల్సిందే.

మరి ఇన్ని గుణాలున్న కాకరకాయను ఇష్టంగా తినాలంటే కాకరకాయ ఫ్రై చేయడమే. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కాకరకాయ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు

అర కిలో కాకరకాయలు

kakarakaya
ఫొటో : కె.లావణ్య

 పల్లీలు (వేరుశనగ) 2 టేబుల్‌ స్పూన్‌
మినప్పప్పు 1 టేబుల్‌ స్పూన్‌
ఆవాలు అర టీ‌ స్పూన్‌
జీలకర్ర 1 టీ‌ స్పూన్‌
కరివేపాకు తగినంత
మిర్చి పొడి 1 టేబుల్‌ స్పూన్‌
పచ్చి మిర్చి తగినంత
పసుపు అర టీ స్పూన్‌
కొబ్బరి పొడి 1 టేబుల్‌ స్పూన్‌
దనియాల పొడి 1 టీ స్పూన్‌
గరం మసాలా 1 టీ స్పూన్‌
వంట నూనె 3 టేబుల్‌ స్పూన్లు
ఉప్పు తగినంత (1 టీ స్పూన్‌కి కొద్దిగా తక్కువ)

తయారీ విధానం :

కాకరకాయను గుండ్రంగా ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

స్టవ్‌ వెలిగించి డీప్‌ ఫ్రైకి అనుగుణంగా ఉండే గిన్నెల్లో నూనె పోసి వేడెక్కేవరకు ఆగాలి.

ఇప్పుడు కాకరకాయ ముక్కలు నూనెలో వేయాలి. 50 శాతం ఫ్రై అవగానే తీసి పక్కనపెట్టుకోవాలి.

kakarakaya half fry
ఫొటో: కె.లావణ్య

ఇప్పుడు ఒక పాన్‌ (కాకరకాయ ఫ్రై చేసేందుకు అనువుగా ఉండేది ఏదైనా సరే) తీసుకుని
అందులో నూనె వేసి తరువాత పోపు గింజలు వేయాలి.

తదుపరి కరివేపాకు కూడా వేసుకోవాలి. కాస్త పచ్చి మిర్చి ముక్కలు వేసుకోవాలి.

ఇవన్నీ కాస్త వేగిన తరువాత ఇప్పటికే 50 శాతం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ గిన్నెలో వేయాలి.

మరికాస్త వేగిన తరువాత ఉప్పు, దనియాల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా వేయాలి. చివరలో మిర్చి పొడి వేయాలి.

5 నుంచి 10 నిమిషాలు సిమ్‌లో ఫ్రై అయ్యాక దించేయాలి. అంతే కాకరకాయ ఫ్రై రెడీ.

రెసిపీ : కె.లావణ్య


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article ఆహారంలో గుడ్ ఫ్యాట్స్ ఏవి? బ్యాడ్ ఫ్యాట్స్ ఏవి?
Next article మాస్క్‌ లేదని 441 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.