ఆహారంలో గుడ్ ఫ్యాట్స్ ఏవి? బ్యాడ్ ఫ్యాట్స్ ఏవి?

fats
image source: pexels

గుడ్‌ ఫ్యాట్స్, బ్యాడ్‌ ఫ్యాట్స్‌ అని తరచూ వింటాం. అన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్, సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ అని ఆహార పదార్థాలపై మనం చదువుతూనే ఉంటాం. కానీ వాటిని చూసి వదిలేస్తాం. వాటి గురించి తెలిస్తే మనం మేలు చేసే ఆహారం తీసుకునే వీలుంటుంది. తద్వారా శరీరాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యంపై ఆందోళననూ వదిలేయవచ్చు.

ఆహార పదార్థాల్లో ఉండే ఫ్యాట్స్‌ రెండు రకాలు. ఒకటి మంచి చేస్తాయి. రెండోరకం హాని చేస్తాయి.

మంచి చేసే ఫ్యాట్స్‌ని అన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ అంటారు. ఇవి నియంత్రిత భాగాల్లో తింటే శరీరానికి ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో మళ్లీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్యూఫా (పాలిఅన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌), రెండోది మ్యూఫా (మోనో అన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌).

ప్యూఫా కొవ్వులు ఏంచేస్తాయి?

ముందుగా ప్యూఫా (పాలిఅన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌) గురించి తెలుసుకుందాం. ఈ కొవ్వులు వెజిటేబుల్‌ ఆయిల్స్‌లో ఉంటాయి. సోయాబీన్, కనోలా, సన్‌ఫ్లవర్‌ వంటి నూనెల్లో ఉంటాయి. ఇవి బ్లడ్‌కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్‌ లెవల్స్‌ను తగ్గిస్తాయి.

ప్యూఫాలో ఒక రకం ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌. ఇది గుండెకు మేలు చేస్తుంది. ఇది సాల్మన్, ట్రౌట్, కాట్‌ఫిష్, మాకెరెల్‌ వంటి చేపల్లో లభ్యమవుతుంది. అలాగే ఫ్లాక్స్‌ సీడ్‌(అవిసె గింజలు), వాల్‌ నట్స్‌లో కూడా లభ్యమవుతుంది.

మ్యూఫా కొవ్వులు ఏంచేస్తాయి?

ఈ మ్యూఫా కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటియాక్సిడెంట్లు, విటమిన్‌ ఇ వీటిల్లో ఉంటుంది. గది ఉష్ణోగత్రల వద్ద ఇవి ద్రవరూపంలో ఉంటాయి. ఫ్రిజ్‌లో పెడితే గడ్డ కడతాయి. ఆలివ్స్, బాదాం, జీడిపప్పు, నువ్వులు, గుమ్మడి గింజలు, వేరుశనగ(పల్లీలు)ల్లో ఈ కొవ్వులు ఉంటాయి.

ఈ మంచి కొవ్వులను ఏమేరకు తీసుకోవాలి?

రోజూ ప్రతి మనిషి రెండు నుంచి మూడు టీ స్పూన్ల ఆయిల్‌ వినియోగించవచ్చు. ఒక మనిషి నెలకు ఒక అరకిలో నూనె వాడొచ్చు. ఇప్పుడు మనం దాదాపు నెలకు లీటర్‌ వాడుతున్నాం కదా.. అందులో సగం తగ్గించేయాలన్నమాట. అందుకే మంచి కొవ్వులు కూడా నియంత్రిత భాగంలోనే వినియోగించాలని ముందుగా చెప్పుకొన్నాం.

సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్, ట్రాన్స్‌ ఫ్యాట్స్‌

సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్, ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ చెడు కొవ్వులుగా పరిగణిస్తాయి. సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ మాంసం, కోడి చర్మం, నెయ్యి, చీజ్, క్రీమ్, గుడ్లలో ఉంటాయి. అలాగే కొబ్బరి నూనె, పామాయిల్‌లో కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడంలో కంట్రోల్‌ లేకపోతే మన శరీరానికి ఇబ్బంది తెచ్చిపెడతాయి.

ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అంటే ద్రవరూపంలో ఉన్న నూనెలు. హైడ్రోజీనేట్‌ అయ్యాక గట్టిపడతాయి. ఫ్రైడ్‌ ఫుడ్, బేక్‌డ్‌ ఫుడ్, కుకీస్, ఐసింగ్స్, ప్యాకేజ్డ్‌ స్నాక్‌ ఫుడ్స్, మైక్రోవేవ్‌ పాప్‌కార్న్, వంటి వాటిలో ఉంటాయి. వీటిని పూర్తిగా దూరం పెట్టాలన్నమాట.

చెడు కొవ్వులను ఏమేరకు తీసుకోవచ్చు?

సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ రోజుకు 8 నుంచి 13 గ్రాముల వరకు తీసుకోవచ్చు. కానీ వీటిలో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ లేకుండా చూసుకోవాలి. ప్యాకేజ్డ్‌ స్నాక్స్, ఫుడ్‌ ప్యాకెట్లపై గమనిస్తే ట్రాన్స్‌ ఫాట్స్‌ ఉన్నాయో లేవో తెలుస్తుంది. అవి ఉంటే వాటిని పూర్తిగా దూరం పెట్టడం చాలా మంచింది.

మంచి కొవ్వులు, చెడు కొవ్వుల గురించి ఈజీగా అర్థమైంది కదా.. ఈ వార్త మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్‌ చేయగలరు.

Previous articleకరోనా మరణాల సంఖ్య 4 లక్షలు
Next articleకాకరకాయ ఫ్రై ఇలా చేస్తే ఇష్టంగా తినొచ్చు..!