food for joint pain: ఎముకల నొప్పులకు బలమైన ఆహారం ఈ 3 పొడులు

bones pain powder

food for joint pain: బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, భుజాలు, కీళ్ల నొప్పులు ఇలా అనేక రకాలుగా ఎముకల బలహీనత వల్ల శరీరంలో నొప్పులు బాధిస్తుంటాయి. కాల్షియం లోపం ఇందుకు ప్రధాన కారణం.

ఎముకల నొప్పులు తగ్గాలంటే మంచి ఉపాయం ఒకటుంది. మూడు రకాల గింజల పొడుల మిశ్రమం మీ ఎముకల పటిష్టతకు తోడ్పడి నొప్పులు శాశ్వతంగా దూరం అవుతాయి. ఈ మూడు రకాల గింజలు మార్కెట్లో దొరికేవే.

అవిశె గింజలు, చియా సీడ్స్, గుమ్మడి కాయ గింజలు.. ఈ మూడు రకాల గింజల పేర్లు వినే ఉంటారు కదా..

ఇవన్నీ అమెజాన్ లేదా లోకల్ మార్కెట్లో లభిస్తాయి.

Food for bone strength: ఎముకల పటుత్వానికి, కండరాల నొప్పి నుంచి ఉపశమనానికి

అవిశ గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) (flax seeds) :

ఫ్లాక్స్ సీడ్స్ ఒమెగా 3 పోషకాల గని. కాల్షియం, ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. ఒమెగా 3 శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే వీటిల్లో ఉంటే కాల్షియం ఎముకలను పటిష్టం చేస్తుంది. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా.. ఇది మన అనవసరపు ఆకలిని తగ్గించి శరీర బరువును అదుపులో కూడా ఉంచుతుంది. అమెజాన్‌లో 400 గ్రాముల ధర రూ. 130 వరకూ ఉంది. బ్రాండును బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.

చియా సీడ్స్ (Chia Seeds) :

ఆవాల కంటే చిన్నగా కనిపించే చియా సీడ్స్‌లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం మీ ఎముకలు పటిష్టంగా ఉండేలా తోడ్పాటు అందిస్తాయి. ఇందులో కూడా ఒమెగా 3 ఉంటుంది. అలాగే చియా సీడ్స్ యాంటీఆక్సిడంట్స్‌గా పనిచేస్తాయి. చియా సీడ్స్ ధర 200 గ్రాములకు రూ. 135 వరకు ఉంది.

గుమ్మడి గింజలు (Pumpkin Seeds):

ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఒమెగా 3, మెగ్నీషియం, జింక్ పోషకాలు ఉంటాయి. బాగా శక్తినివ్వడంతో పాటు మీ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. 200 గ్రాముల ధర రూ. 180 వరకు ఉంది.

పొడి మిశ్రమం ఎలా చేయాలి?

అవిశ గింజలు, చియా సీడ్స్, గుమ్మడి గింజలను వేర్వేరుగా సమ పాళ్లలో వేర్వేరుగా వేయించుకోవాలి ఉదాహరణకు ఒక రకం గింజలను 100 గ్రాములు తీసుకుంటే మిగిలిన వాటిని కూడా వంద వంద గ్రాములే తీసుకోవాలి. దోరగా వేగిన తరువాత చల్లార్చి మిక్సీలో వేర్వేరుగా పొడి చేసుకోవాలి.

మిక్సీ వేయడం పూర్తయ్యాక మూడు పొడులను కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. రోజూ ఈ మిశ్రమం నుంచి ఒక టీ స్పూన్ ఆహారంగా తీసుకోవాలి. మజ్జిగలో కలుపుకొని తాగడం సులువుగా ఉంటుంది. లేదా అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు.

ఇలా కొద్ది రోజులు తింటే మీ శరీరంలో మార్పులు గమనిస్తారు. రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ ఎముకల నొప్పులు, నడుము నొప్పి మాయం అవడమే కాకుండా.. మళ్లీ నొప్పులు రావు.

Previous articleపెళ్లితో కలిసొస్తుందంటే.. మర్డర్ చేసి..
Next articleస్పేస్ టూరిజం : కుబేరుల నయా ట్రావెల్ డెస్టినేషన్