Latest

Betel Leaves uses: తమలపాకు యొక్క ఉపయోగాలు తెలిస్తే వాటిని మీరు కూడా తినడం మొదలుపెడతారు. వీటిని ఇంగ్లిషులో బీటిల్ లీవ్స్ (betel leaves) అంటారు. వీటికి ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యత ఉందో ఆహారంగా కూడా అంతే ప్రాధాన్యత ఉంది. హృదయాకృతిలో ఉండే ఈ తమలపాకులు ఆయుర్వేదంలో ఔషధంగా చోటు దక్కించుకున్నాయి. వివిధ వ్యాధులను నయం చేయడంలో ఔషధంగా పనిచేస్తాయి.

తమలపాకులతో ప్రయోజనాలు ఇవీ

  1. విటమిన్ సి: తమలపాకుల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అలాగే రైబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్, కెరోటిన్ కూడా అధిక మోతాదులో ఉంటాయి. అలాగే కాల్షియం కూడా లభిస్తుంది. ఈ కారణంగా ఇది మీ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది.
  2. నొప్పి నివారణ: తమలపాకుల రసం, లేదా గుజ్జు నొప్పి నివారణగా ఉపయోగపడుతుంది. చర్మం కోసుకుపోయినప్పుడు, గాయాలైనప్పుడు తమలపాకులు నొప్పి తగ్గిస్తాయి. తమలపాకు రసం తాగితే శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. శరీరంలో ఎక్కడైనా వాపు, మంట ఉంటే కూడా తగ్గుతాయి.
  3. జీర్ణక్రియ మెరుగవుతుంది: భోజనం అనంతరం పాన్ తింటే తమలపాకు నుంచి వచ్చే ఔషధ గుణాలు జీర్ణక్రియ మెరుగవడానికి దోహదం చేస్తుంది. మెటబాలిజం (జీవక్రియ) మెరుగవుతుంది. కడుపులో పేగులు సక్రమంగా పనిచేస్తూ కీలకమైన విటమిన్లు అన్నీ శరీరం సంశ్లేషించుకునేలా దోహదం చేస్తుంది.
  4. క్యాన్సర్‌పై పోరాటం: తమలపాకుల్లో ఫెనోలిక్ మిశ్రమాలు ఉంటాయి. వీటిలో బోలెడన్నీ యాంటాక్సిడంట్లు ఉంటాయి. అలాగే క్యాన్సర్ కణాలను అడ్డుకునే గుణాలు కలిగి ఉంటాయి.
  5. బరువు తగ్గడంలో సాయం: తమలపాకులు శరీరంలో అధిక కొవ్వులను తగ్గిస్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా శరీరం బరువు కోల్పోయేలా చేస్తాయి.
  6. నోటి ఆరోగ్యం: తమలపాకులు నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటిలోని బ్యాక్టీరియాను అంతం చేస్తాయి. నోటి దుర్వాసనను ఆరికడతాయి. దంతక్షయాన్ని ఆపుతాయి. దంతాలను పాడు చేసే క్రిములను చంపేస్తాయి.
  7. చర్మ సంరక్షణకు: తమలపాకులో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. చర్మ అలర్జీలను తొలగిస్తాయి. పొడి బారిన చర్మాన్ని నయం చేస్తాయి. నల్ల మచ్చలను తొలగిస్తాయి.
  8. వేసవి వేడిని తొలగించేలా: తాంబూలం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది.

తమలపాకు ఉపయోగాలు తెలుసుకున్నారు కదా.. మీరూ అప్పుడప్పుడు తిని చూడండి. దాని వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending