ఈవారం ఓటీటీ, థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

Netflix
ఓటీటీలో ఈ వారం విడుదల Photo by freestocks on Unsplash
ప్ర‌తీ వారంలానే ఈ వారం కూడా థియేట‌ర్లు, ఓటీటీ ఫ్లాట్‌ఫాంల‌లో సినిమాల సంద‌డి మొద‌లుకానుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు హోలీ కానుక‌గా ఏకంగా 15 సినిమాలు థియేట‌ర్ మ‌రియు ఓటీటీల్లో విడుద‌ల‌కు సిద్దమయ్యాయి. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీషు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, త‌మిళం ఇలా అన్ని భాష‌ల‌లోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌తో స‌రికొత్త సినిమాల‌ను అందిచ‌డంలో ఓటీటీలు స‌త్తా చాటుతున్నాయి.
ఈ వారం రాబోయే కొత్త చిత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జై భీమ్, గుడ్‌నైట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న మ‌ణికంద‌న్ ఇప్పుడు ట్రూ ల‌వ‌ర్ సినిమాతో మ‌ళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి ప్ర‌భురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా గౌరీ ప్రియ హీరోయిన్‌గా న‌టించింది.ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న థియేట‌ర్‌లో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఓటీటీలో మార్చి 27న రిలీజ్ కాబోతుంది. మ‌రెన్నో చిత్రాలు ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసుకుందాం.

థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు:

క‌లియుగ ప‌ట్నంలో – మార్చి 29
ఆడు జీవితం – మార్చి 28
మ‌గ‌థీర – రీ రిలీజ్ – మార్చి 27
టిల్లు స్క్వేర్ – మార్చి 29
గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ – మార్చి 29

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల‌లో:

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీ:

ప‌ట్నా శుక్లా ( హిందీ ) మార్చి 29
ట్రూ ల‌వ‌ర్ – (తెలుగు) మార్చి 27
ప్రేమలు – మార్చి 29
ర‌నెగేడ్ నెల్లె ( వెబ్ సిరీస్‌) మార్చి 29

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:

ది గ్రేడ్ ఇండియ‌న్ క‌పిల్ షో (హిందీ) – మార్చి30
లాల్ స‌లామ్ – మార్చి 29
టెస్టామెంట్ (వెబ్ సిరీస్) – మార్చి 27
హార్ట్ ఆఫ్ ది హంట‌ర్ (హాలీవుడ్) – మార్చి29
ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) – మార్చి 29

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ:

సిద్దార్థ్ రాయ్ – మార్చి 29
ఇన్‌స్పెక్ట‌ర్ రిషి (వెబ్ సిరీస్‌) – మార్చి 29
ది బాక్ప్ ట‌ర్స్ (వెబ్ సిరీస్) – మార్చి 28

ఆహా ఓటీటీ:

తిక‌మ‌క తాండ – మార్చి 25
సుంద‌రం మాస్ట‌ర్ – మార్చి 28

ఈ టీవి విన్ ఓటీటీ:

ఏమి చేస్తున్నావ్ – మార్చి 28
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
Previous articleBobbara Pappu vadalu: బొబ్బ‌ర ప‌ప్పుతో రుచిక‌ర‌మైన వ‌డ‌లు.. ఇలాఈజీగా చేసేయండి
Next articleపుట్ట‌గొడుగుల్లో లాభాలు పుష్క‌లం.. వారానికోసారి తినాల్సిందే