పండ‌గ‌ల సెలవులు.. ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాతర

black and silver laptop computer
నెట్‌ఫ్లిక్స్‌లొ ఈవాకం విడుదల Photo by Nadjib BR on Unsplash

పండగ సెలవులు, వేసవి సెలవుల నేపథ్యంలో ఓటీటీలో సరికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఏప్రిల్ నెలలో వ‌ర‌స పండ‌గ‌లు ఉన్నాయి. ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి సంద‌ర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మోత‌మోగిస్తున్నాయి. గోపీచంద్, ప్రియాభ‌వాని శంకర్ న‌టించిన భీమా ఈ వారం ఓటీటీ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీ డిజిట‌ల్ ప్రీమియ‌ర్ విభిన్న భాషల్లో రిలీజ్ కానుంది.

అలాగే క్రైమ్ డ్రామా ఫిలిమ్‌గా తెర‌కెక్కిన శ‌ర్మ అండ్ అంబానీ డైరెక్ట్‌గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ల్‌లో రిలీజ్ కాబోతుంది. అంతేకాకుండా మల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ప్రేమ‌లు మూవీ కూడా స్ట్రీమింగ్‌కు రెడీగా ఉంది. అలాగే హాలీవుడ్  సిరీస్‌లు ఉండనే ఉన్నాయి. యానిమేష‌న్ చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాబోతున్నాయి. ఏ ఫ్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా సంద‌డి చేయ‌బోతుందో ఇక్క‌డ చూడండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజెస్:

అమ‌ర్ సింగ్ చ‌మ్కీలా (హిందీ సినిమా ) – ఏప్రిల్ 12

యాజ్ ది క్రో ఫైల్స్- సీజ‌న్ 3 – (ట‌ర్కీష్ వెబ్ సిరీస్ ) – ఏప్రిల్ 11

హార్ట్ బ్రేక్ హై సీజ‌న్ 2 ( ఆస్ట్రేలియ‌న్ టీన్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 11

స్పిరిట్ రేంజ‌ర్స్ సీజ‌న్ 3 – ( కిడ్స్ యానిమేటెడ్ సిరీస్) – ఏప్రిల్ 08

ఆంత్రాసైట్ – (ఫ్రెంచ్ వెబ్ సిరీస్ ) – ఏప్రిల్ 10

నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్ ( స్టాండ్ అప్ కామెడీ స్పెష‌ల్) – ఏప్రిల్ 09

ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ ఎక్స్‌పెరిమెంట్ – (డాక్యుమెంట‌రీ సిరీస్ ) – ఏప్రిల్ 10

మిడ్ స‌మ్మ‌ర్ నైట్ – సీజ‌న్ 2 (నార్వే థ్రిల్ల‌ర్ సిరీస్ ) – ఏప్రిల్ 11

గుడ్ టైమ్స్ – (యానిమేటెడ్ సిట్‌కామ్) – ఏప్రిల్ 12

అన్‌లాక్డ్: ఏ జైల్ ఎక్స్‌పెరిమెంట్ – (డాక్యుమెటరీ సిరీస్) – ఏప్రిల్ 10

జెన్నీఫ‌ర్ వాట్ డిడ్ – ( బ్రిటీష్ రియ‌ల్ క్రైమ్ డాక్యుమెంట‌రీ ) – ఏప్రిల్ 10

ల‌వ్ డివైడెడ్ – ( స్పానిష్ రొమాంటిక్ కామిడీ)- ఏప్రిల్ 12

స్టోలెన్ – (స్వీడిష్ చిత్రం) – ఏప్రిల్ 12

పారాసైట్ ది గ్రే – ( కొరియ‌న్ సిరీస్) – ఏప్రిల్ 5 నుంచి అందుబాటులో ఉంది

ఊడీ ఉడ్‌పెక్క‌ర్ గోస్ టూ క్యాంప్ – ఏప్రిల్ 12

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ రిలీజెస్:

ఫాల్ అవుట్ (అమెరిక‌న్ సిరీస్) – ఏప్రిల్ 11

అన్‌ఫ‌ర్‌గాట‌న్ సీజ‌న్ -5 (వెబ్ సిరీస్) – ఏప్రిల్ 08

ది ఎక్సార్సిస్ట్:బిలీవ‌ర్ (హార్ర‌ర్ మూవీ) – ఏప్రిల్ 09

ఎస్‌డ‌బ్ల్యూఎస్ఎల్‌(అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ) – ఏప్రిల్ 12

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్:

ప్రేమ‌లు – ఏప్రిల్ 12

జీ 5 ఓటీటీ :

గామి (తెలుగు సినిమా) – ఏప్రిల్ 12

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleఉగాది నేతి బొబ్బ‌ట్లు రెసిపీ: ఇలా చేయండి.. ఇట్టే నోట్లో క‌రిగిపోవాల్సిందే
Next articleపూర్ణం బూరెలు రెసిపీ: ఈ సులువైన చిట్కాలతో మీ కుటుంబ సభ్యుల మెప్పు పొందండి