ఈ వారం ఓటీటీలోకి టాప్ 5 సినిమాలు.. అస్స‌లు మిస్ అవ్వొద్దు

Netflix
ఓటీటీలో ఈ వారం విడుదల Photo by freestocks on Unsplash

ఈ వారం సినీ ల‌వ‌ర్స్‌కు ఓటీటీలు టాప్‌ లేచిపోయే సినిమాల‌ను అందించ‌నున్నాయి. స‌రికొత్త చిత్రాల‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేలా ఓటీటీలు సిద్ధమయ్యాయి. ఈ ఏప్రిల్ నెల‌లో వారం వారం ఎన్నో సూప‌ర్ హిట్ మూవీస్‌ ప్రేక్ష‌కుల ముందుకు వాల‌బోతున్నాయి. మ‌రి ఆ టాప్ 5 సినిమాలు ఏంటో? ఏ ఓటీటీలో అడుగు పెడుతున్నాయో ఇక్క‌డ తెలుసుకోండి.

ఫారే:

ఇది 2017 లో వ‌చ్చిన థాయ్ సినిమా బ్యాడ్ జీనియ‌స్‌కి రీమేక్. దీనికి సామేంద్ర పాధి ద‌ర్శ‌క‌త్వం చేయ‌గా హిందీలో రోనిత్ రాయ్, సాహిల్ మెహ‌తా, జైన్ షా,ప్ర‌స‌న్న బిష్త్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రాన్ని 54వ  ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో ప్ర‌ద‌ర్శించారు. ఇది ఏప్రిల్ 5 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఫ్యామిలీ ఆజ్ క‌ల్:

అపూర్వ ఆరోరా, నితీష్ పాండే, ప్ర‌క‌ర్ సింగ్, ఆక‌ర్ష‌న్ సింగ్ కీల‌క పాత్ర‌లలో న‌టించగా ప‌రీక్షిత్ జోషి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇది ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఫ్యామిలీ క‌థాంశం. ఈ చిత్రానికి అనుష్క షా ప్రొడ్యూస‌ర్. ఈ చిత్రం సోనీలివ్‌లో ఏప్రిల్ 3 న స్ట్రీమింగ్ అవుతుంది.

పారాసైట్ ది గ్రే:

ఇది సౌత్‌కొరియా సైన్స్ ఫిక్ష‌న్ హార్ర‌ర్ సిరీస్. హ‌త్య‌కు పాల్ప‌డిన ప‌రాన్న‌జీవుల‌తో పోరాటాన్ని ఇందులో చూపించ‌డం జ‌రిగింది. యోన్ సాంగ్ హో ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏప్రిల్ 5న  ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రాబోతుంది.

స్కూప్:

ఇది ఒక బ్రిటీష్ బ‌యోగ్రాఫిక‌ల్ సినిమా. 2019 బిబిసి న్యూస్ ఇంట‌ర్వూలో జ‌ర్న‌లిస్టు ఎమిలీ మైట్లిస్, ప్రిన్స్, ఆండ్రూను ఇంట‌ర్వూ చేసిన స్టోరీగా ఉంటుంది. ఇందులో బిల్లీ పైప‌ర్, కిలీ హాన్స్, గిలియ‌న్ ఆండ‌ర్స‌న్ త‌దిత‌రులు న‌టించారు. ఏప్రిల్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.

గామి:

మాస్ కా దాస్, విశ్వ‌క్ సేన్ న‌టించిన ఇంట్ర‌ెస్టింగ్ అడ్వెంచ‌ర్ సినిమా గామి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉంది. ఇందులో చాందినీ చౌదిరి, అభిన‌య కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. థియేట‌ర్లో మార్చి 8 న విడుద‌లై ఈ సినిమా మంచి వసూళ్ల‌ను రాబ‌ట్టింది. కాగిత విద్యాధ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం ఏప్రిల్ 12న జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది.

మంజుమ్మ‌ల్ బాయ్స్:

ఇండియాలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచిన స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం మంజుమ్మ‌ల్ బాయ్స్. సౌబిన్ షాహిర్, గ‌ణ‌ప‌తి, ఖ‌లీద్ రెహ‌మాన్, శ్రీ నాథ్ భాసి ప్ర‌ధాన పాత్ర‌ల్లో  చిదంబ‌రం ఎస్ పొదువ‌ల్  ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌ల‌యాళ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఇండస్ట్రీలో టాప్ హిట్‌గా నిలిచింది. ఇది 200 కోట్ల‌కు పైగా గ్రాస్‌తో వ‌సూళ్లు సాధించింది. ఈ చిత్రం త‌మిళంలో మంచి విజ‌యాన్ని సాధించింది. తెలుగు వెర్ష‌న్‌ కూడా అందుబాటులోకి రానుంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసిందని సమాచారం. కాగా ఏప్రిల్ 6న తెలుగులో థియేటర్లలో విడుదల కాబోతోంది. తెలుగులో థియేటర్లలో విడుదలైన అనంతరం కొద్దిరోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుందని సమాచారం. ఓ స్నేహితుల బృందం కొచ్చిలో మంజుమ్మ‌ల్ అనే చిన్న ప‌ట్ట‌ణం నుంచి వ‌చ్చి కొడైకెనాల్‌లో సెల‌వుల రీత్యా గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకుంటారు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ క్రేజ్ వర్కవుట్ అయిందా
Next articleఓటీటీలో అడుగు పెట్ట‌బోతున్న కాజల్ హార్ర‌ర్ మూవీ.. కార్తీక (కరుంగాపియం)