Home గాడ్జెట్స్ POCO M8 5G Launch: అదిరిపోయే కర్వ్‌డ్ డిస్‌ప్లే.. మిలిటరీ గ్రేడ్ ధృడత్వంతో పోకో కొత్త 5G ఫోన్

POCO M8 5G Launch: అదిరిపోయే కర్వ్‌డ్ డిస్‌ప్లే.. మిలిటరీ గ్రేడ్ ధృడత్వంతో పోకో కొత్త 5G ఫోన్

0
POCO M8 5G Launch: అదిరిపోయే కర్వ్‌డ్ డిస్‌ప్లే.. మిలిటరీ గ్రేడ్ ధృడత్వంతో పోకో కొత్త 5G ఫోన్
పోకో ఎం8 5జీ స్మార్ట్ ఫోన్

పోకో (POCO) స్మార్ట్‌ఫోన్ ‘M’ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన పోకో ఎం8 5జీ (POCO M8 5G) ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన కర్వ్డ్ డిస్‌ప్లే, ఈవీ గ్రేడ్ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో ఈ ఫోన్ గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా రూ.16 వేల లోపు ధరకే ఈ ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది.

POCO M8 5G: ఆకట్టుకునే కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే

పోకో ఎం8 5జీ ఫోన్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఇందులో 6.77 అంగుళాల ఫ్లో అమోలెడ్ (Flow AMOLED) కర్వ్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. స్క్రీన్ ప్రకాశం (Brightness) ఏకంగా 3200 నిట్స్ వరకు ఉంటుంది. ఫలితంగా ఎండలో కూడా ఫోన్ స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు సినిమాటిక్ అనుభూతిని ఇస్తాయి.

POCO M8 5G: మిలిటరీ గ్రేడ్ ధృడత్వం.. అది కూడా బడ్జెట్‌లోనే

సాధారణంగా ఖరీదైన ఫోన్లలో మాత్రమే ఉండే SGS MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ ధృడత్వాన్ని పోకో ఈ ఫోన్లో అందించింది. అంటే ఫోన్ పొరపాటున కింద పడ్డా త్వరగా పాడవ్వదు. అలాగే దీనికి IP66 రేటింగ్ ఉంది. ఇది నీటి తుంపర్లు, దూళి నుంచి ఫోన్‌ను కాపాడుతుంది. ఇందులో వాడిన ‘వెట్ టచ్ టెక్నాలజీ’ (Wet Touch) వల్ల చేతులు తడిగా ఉన్నా స్క్రీన్ సులభంగా స్పందిస్తుంది.

POCO M8 5G: పెర్ఫార్మెన్స్ అదిరింది.. బ్యాటరీ సూపర్

ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 (Snapdragon 6 Gen 3) ప్రాసెసర్ వాడారు. యాప్స్ ఓపెన్ చేయడం, మల్టీ టాస్కింగ్ వంటివి వేగంగా జరుగుతాయి. దీని అంటుటు (AnTuTu) స్కోరు 8.25 లక్షలకు పైగా ఉంది.

బ్యాటరీ విషయానికొస్తే.. పోకో ఇందులో 5,520mAh ఈవీ-గ్రేడ్ బ్యాటరీని అమర్చింది. ఇది రోజంతా నిరంతరాయంగా పనిచేస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీనితో పాటు ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవడానికి 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం గమనార్హం.

POCO M8 5G: 50MP కెమెరా.. క్లారిటీగా ఫోటోలు

ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ ఏఐ (AI) కెమెరా సెటప్ ఉంది. దీనితో 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇది వీడియో కాల్స్, ఫోటోల కోసం మెరుగైన క్లారిటీని ఇస్తుంది.

POCO M8 5G: అప్‌డేట్లలో పోకో రికార్డు

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 2 (HyperOS 2) తో వస్తుంది. దీనికి ఏకంగా 4 ఏళ్ల ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్లో ఇన్ని ఏళ్ల పాటు అప్‌డేట్లు ఇవ్వడం ఇదే మొదటిసారి.

POCO M8 5G: ధర, లభ్యత

పోకో ఎం8 5జీ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. జనవరి 13 నుంచి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వేదికగా అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఇన్‌స్టంట్ రూ. 2 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.

వేరియంట్లాంచ్ ప్రైస్ఎమ్మార్పీ
6GB+128GBRs 15,999Rs 18,999
8GB+256GBRs 16,999Rs 19,999
8GB+256GBRs 18,999Rs 21,999


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.