Home ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రభాస్‌ జంటగా దీపికా పదుకొనె

ప్రభాస్‌ జంటగా దీపికా పదుకొనె

0
ప్రభాస్‌ జంటగా దీపికా పదుకొనె
Image Source: instagram

ప్రభాస్‌ 21వ చిత్రంలో తనకు జంటగా దీపికా పదుకొనె నటించనున్నుట్ట వైజయంతీ మూవీస్‌ వెల్లడించింది. 50 ఏళ్ల తమ సినీ ప్రస్తానంలో ఎందరెందరో గొప్ప నటీమణులతో ప్రయాణం చేయగా.. ఇప్పుడు దీపికా పదుకొనెను తమ సినిమాకు హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు ప్రకటించింది.

‘మీకు ప్రామిస్‌ చేసినట్టుగా.. ఇదిగో మా భారీ అనౌన్స్‌మెంట్‌.. వెల్‌కమింగ్‌ సూపర్‌ స్టార్‌..’ అంటూ వైజయంతీ మూవీస్‌ వీడియో షేర్‌ చేసింది. ఇండియాలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్లు ఇద్దరినీ ఒక్కటిగా తెస్తున్నట్టు ప్రకటిస్తూ ఒక వీడియో క్రియేట్‌ చేసింది.

దీపికా పదుకునె కూడా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి ‘థ్రిల్‌కు మించి.. అద్భుతం కానుందని నమ్ముతున్న ఈ ప్రయాణం కోసం నేను ఇంకా వేచి ఉండలేకపోతున్నా..’ అంటూ పోస్ట్‌ చేసింది.

ప్రభాస్‌ 21వ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కింగ్‌కు సరిపడేంత క్వీన్‌ కావాలి కదా మరి.. చాలా ఆలోచించి తీసుకున్న డెసిషన్‌ ఇది.. పిచ్చెక్కించేద్దాం..’ అంటూ ట్విటర్‌లో ఆయన తన స్పందనను పంచుకున్నారు.

గత వారమే ప్రభాస్‌ చిత్రం రాధేశ్యామ్‌ ఫస్ట్‌ లుక్‌తో పండగ చేసుకున్న ప్రభాస్‌ అభిమానులు.. ఇప్పుడు దీపికా పదుకొనే హీరోయిన్‌గా ఉండబోతోందన్న వార్తతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజంగా ప్రభాస్‌ అభిమానులకు ఇది పండగే.

ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా వచ్చే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రావొచ్చు. ప్రభాస్ కు ఉత్తరాదిన కూడా అభిమానులు ఎక్కువే.

 

వైజయంతీ మూవీస్ దీపికా పదుకొనే కు స్వాగతం తెలుపుతూ రిలీజ్ చేసి వీడియో..

Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article పవర్ స్టార్ ట్రైలర్‌ చూడాలంటే రూ. 25 చెల్లించాల్సిందే..
Next article పిల్లలు అడల్ట్ కంటెంట్ చూడకుండా సేఫ్‌ సెర్చ్‌ నొక్కండి
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.