Saturn Direct Transit: శని గ్రహ సంచారం అనేక రాశులపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం నవంబరు 3 వరకు కుంభ రాశిలో వక్రగమనంలో పయనిస్తాడు. నవంబరు 4వ తేదీన వక్ర గమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వెళతాడు. దీని కారణంగా పలు రాశులకు శుభ ఘడియలు ఆసన్నమవుతాయి.
శని దేవుడు మనం చేసే కర్మలకు ఫలితాలను ఇస్తాడు. మంచి చేస్తే మంచి ఇస్తాడు. చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు. మన జాతకంలో శని దేవుడు శుభ స్థితిలో ఉంటే మన జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఈనేపథ్యంలో శని భగవానుడు ప్రస్తుతం కుంభ రాశిలో తిరోగమనంలో కదులుతున్నాడు. నవంబరు నాలుగో తేదీన ప్రత్యక్ష మార్గంలో వెళతాడు. దీని వలన ఏయే రాశులకు మేలు జరుగుతుందో చూడండి.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు శని దేవుడి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. లావాదేవీలు కలిసొస్తాయి. పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందుతారు. కొత్త ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు తగ్గుతాయి. గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి శని ప్రత్యక్ష గమనం మంచి రోజులను తెస్తుంది. మీ ఆర్థిక చిక్కులు తొలగిపోతాయి. సొంతింటి కల నెరవేరుతుంది. వాహన కొనుగోలుకు అనుకూలం. లావాదేవీలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
సింహ రాశి
సింహ రాశి వారికి శని ప్రత్యక్ష గమనం శుభదాయకం. సొంతింటి కల నెరవేరుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు చూస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి.
కన్య రాశి
శని ప్రత్యక్ష మార్గం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆకస్మిక ధన లాభం చూస్తారు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు.
Discover more from Dear Urban
Subscribe to get the latest posts sent to your email.