Home కెరీర్ టాప్ 40 మెడికల్ కాలేజీలు ఇవే

టాప్ 40 మెడికల్ కాలేజీలు ఇవే

medical colleges
Photo by Retha Ferguson from Pexels

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో టాప్ – 40 కాలేజీ ర్యాంకులను ఎంహెచ్ఆర్డీ ప్రకటించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ కు అనుగుణంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. తొలిసారిగా 2016లో ర్యాంకులను ప్రకటించగా.. తాజాగా ఐదో ఏడాది ర్యాంకులు ప్రకటించారు. ఈసారి కొత్తగా డెంటల్ కాలేజీల విభాగంలో కూడా ర్యాంకులు ప్రకటించారు. 

అత్యుత్తమ మెడికల్ కాలేజీల్లో ఎక్కువ శాతం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్సెస్ ( స్విమ్స్) 38 వ స్థానంలో నిలిచింది. 

మొత్తం 119 వైద్య కళాశాలలు ఈ ర్యాంకింగ్ ల కోసం ప్రతిపాదనలు పంపగా.. టాప్ 40 మెడికల్ కాలేజీలకు ర్యాంకులు ప్రకటించారు. 

టీచింగ్, లెర్నింగ్‌ అండ్‌ రీసోర్సెస్‌(టీఎల్‌ఆర్‌), రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌(ఆర్‌పీ), గ్రాడ్యుయేషన్‌ ఔట్‌కమ్స్‌(జీవో), ఔట్‌రీచ్‌ అండ్‌ ఇంక్లూజివిటీ(ఓఐ), పర్సెప్షన్‌(పీఆర్‌) వంటి అంశాల ప్రాతిపదికగా స్కోర్ ఇచ్చి ర్యాంకులు ప్రకటించారు

టాప్ – 40 మెడికల్ కాలేజీల జాబితా

ఇనిస్టిట్యూట్లొకేషన్స్కోర్ర్యాంకు
ఎయిమ్స్ఢిల్లీ90.691
పీజీఎంఈఆర్చంఢీగఢ్80.062
క్రిష్టియన్ మెడికల్ కాలేజ్వెల్లూర్73.563
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్, న్యూరో సైన్సెస్బెంగళూరు71.354
సంజయ్ గాంధీ పీజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లక్నో70.215
బనారస్ హిందూ యూనివర్శిటీవారణాసి64.726
అమృత విశ్వ విద్యాపీఠంకోయంబత్తూర్64.397
జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీజీఎంఈఆర్పుదుచ్చేరి63.178
కస్తూర్భా మెడికల్ కాలేజీమణిపాల్62.849
కేఎన్ఆర్ జార్జి మెడికల్ యూనివర్శిటీలక్నో62.2010
ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ఢిల్లీ61.5811
మద్రాస్ మెడికల్ కాలేజీ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్చెన్నై58.8412
శ్రీరామ చంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్చెన్నై57.9013
సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్బెంగళూర్57.8314
అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీఅలీగఢ్, యూపీ56.2215
వర్దమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్, సప్థర్జంగ్ హాస్పిటల్ఢిల్లీ56.1216
మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజి ఢిల్లీ55.3117
క్రిష్టియన్ మెడికల్ కాలేజ్లుధియానా55.0118
యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ఢిల్లీ55.0019
జేెఎస్ఎస్ మెడికల్ కాలేజీమైసూర్54.3220
కస్తూర్భా మెడికల్ కాలేజీమంగళూర్53.8321
జామియా హమ్ దర్ద్ఢిల్లీ52.8722
శిక్షా ఓ అనుసంధాన్భువనేశ్వర్52.7223
డాక్టర్ డీవై పాటిల్ విద్యా పీఠ్పూణే52.0524
గవర్నమెంట్ కాలేజ్ అండ్ హాస్పిటల్ఛండీగఢ్52.0125
దయానంద్ మెడికల్ కాలేజ్ లుధియానా51.7426
స్వామి మాన్ సింగ్ మెడికల్ కాలేజ్జైపూర్50.4427
పీఎస్జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్కోయంబత్తూర్50.4427
దత్త మెఘే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్వార్దా, మహారాష్ట్ర50.2129
ఎం.ఎస్.రామయ్య మెడికల్ కాలేజ్బెంగళూరు50.0230
ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీచెన్నై49.0631
కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీభువనేశ్వర్48.1832
మహర్షి మార్కండేశ్వర్అంబాల48.1333
సవీతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్చెన్నై46.4934
అన్నమాలై యూనివర్శిటీఅన్నమాలైనగర్46.4735
కె.ఎస్.హెగ్డే మెడికల్ అకాడమీమంగళూరు46.3136
కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్కరద్, మహారాష్ట్ర46.0037
శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్సెస్తిరుపతి45.9338
రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ఇంపాల్ వెస్ట్45.9338
మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్పుదుచ్చేరి45.6240

ఇవీ చదవండి

Exit mobile version