మీ మొబైల్ కాంటాక్ట్స్ పీడీఎఫ్ లో కావాలా..? అయితే ఇలా చేయండి మరి…ల్యాండ్ ఫోన్లు వాడే రోజుల్లో ఎవరి ఫోన్ నెంబర్ అయినా గుర్తు పెట్టుకోవాలంటే ఒక ఫోన్ బుక్ ఉండేది… దాంట్లో వారి పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాసుకునేవాళ్లం. దాదాపు ల్యాండ్ ఫోన్ ఉండేవాళ్లందరు ఈ రకంగా వినియోగించుకున్న వాళ్లే.
కొందరు పెద్ద వాళ్లు ఈ తరం స్మార్ట్ ఫోన్లలో నెంబర్లు వెతకలేక ఇప్పటికీ అదే అలవాటులో ఒక పాకెట్ ఫోన్ బుక్ లో నోట్ చేసుకుని కాల్ చేయాల్సినప్పుడు దాన్ని బయటకు తీసి నెంబర్ చూసుకుని చేస్తూ ఉంటారు. అయితే మన ఫోన్ బుక్ లో ఉన్న నెంబర్లు అలా ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలన్నా, లేక పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవాలనుకుంటున్నా సింపుల్ స్టెప్స్ లో చేసుకోవచ్చు.
అదెలాగో చూద్దాం.. రెండు స్టెప్పుల దూరంలోనే..
మీ మొబైల్ బ్రౌజర్ లో గూగుల్ కాంటాక్ట్స్ సైట్ ఓపెన్ చేసుకోవాలి. మీ గూగుల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కావాలి. తరువాత ఎడమవైపు పైన ఉండే మూడు గీతల మెనూ క్లిక్ చేయాలి. మోర్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
అక్కడ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ప్రింట్ చేసేందుకు ప్రాసెస్ చేస్తుంది. దాని కోసం 30 సెకన్ల వరకు సమయం తీసుకుంటుంది. మీ మొబైల్ లో ఉండే కాంటాక్ట్స్ బట్టి ఆ సమయం తీసుకుంటుంది.
తరువాత సేవ్ యాజ్ పీడీఎఫ్ ఎంపిక చేసుకోవాలి. అంతే మీ మొబైల్ లో ఉండే అన్ని ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ ఐడీలు, పేర్ల తో సహ పీడీఎప్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ సాయంతో ప్రింట్ కావాలనుకున్నా సరే తీసుకోవచ్చు.
డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ లో కూడా..
ఒకవేళ మొబైల్ బ్రౌజర్ లో ఇబ్బందులు ఎదరైతే నేరుగా ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ లలో ఇదే ప్రాసెస్ చేయొచ్చు.. మొబైల్ కన్నా అక్కడే సులభంగా చేసుకోవచ్చు. పీడీఎప్ గా మార్చుకోలేకపోతే.. ఇవి సరిచూసుకోండి.
మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫోన్ నెంబర్లు గూగుల్ ఖాతాలో సేవ్ చేసున్నాయా లేదా ఫోన్ మెమరీలో సేవ్ అయ్యాయో చూసుకోవాలి.
ఒక వేళ ఫోన్ మెమరీలో ఉంటే వాటిని కాపీ లేదా మూవ్ ఆప్షన్ ద్వారా గూగుల్ ఖాతాలోకి బదిలీ చేసుకోవాలి.
అంటే ఫోన్ బుక్ లోకి వెళ్లి కాంటాక్ట్స్ మేనేజర్ లేదా ఫోన్ బుక్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఇంపోర్టు అనే ఆప్షన్ ని ఉపయోగించి బదిలీ చేసుకోవచ్చు.
లేదా కాంటాక్ట్ టు డిస్ల్పే అనే చోట ఫోన్ మెమరీ ఎంపిక చేసుకోవాలి. దాంతో కేవలం ఫోన్ మెమరీలో ఉన్న నెంబర్లు మాత్రమే దర్శనమిస్తాయి. ఒక కాంటాక్ట్ పై లాంగ్ ప్రెస్ ఇచ్చి సెలెక్ట్ చేయాలి, తరువాత సెలక్ట్ ఆల్ కొట్టి కాపీ చేసుకోవచ్చు..
మొబైల్ మోడల్ ని బట్టి కాంటాక్ట్స్ ఇంపోర్టు, ఎక్స్‌పోర్టు అనేది ఉంటుంది. గూగుల్ ఖాతాలోకి నంబర్స్ వెళ్లిన తరువాత మొబైల్ సెట్టింగ్స్ > అకౌంట్స్ > మీ గూగుల్ ఖాతా > ఎంపిక చేసుకుని సింక్రనైజేషన్ చేయాలి.
అంటే మన మొబైల్ లోని ఫోన్ నెంబర్లు గూగుల్ సర్వర్ కు అప్డేట్ అవుతాయి. సింక్రనైజేషన్ చేసేటప్పుడు మొబైల్ నెట్ లేదా వైఫై కచ్చితంగా కనెక్ట్ అయి ఉండాలి. అంతే కచ్చితంగా కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవచ్చు.
– డియర్ అర్బన్ టీమ్
ఇవి కూడా చదవండి