design muggulu latest: తెలుగింటి ముగ్గులు మాత్రమే కాదు.. కర్ణాటక, తమిళనాడు, కేరళలో, అలాగే మహారాష్ట్ర, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో ముగ్గులు చాలా పాపులర్. శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి ఏషియా దేశాల్లో చాలా చోట్ల ముగ్గులు వేస్తారు. మహారాష్ట్రలో రాంగోలీ అని, మిథిలా ప్రాంతంలో అరిపన్ అని, కర్ణాటకలో హాసే, రౌంగోళి(muggulu with colours) అని పిలుస్తారు.
సంక్రాంతి ముగ్గుల్లో ప్రకృతి ధర్మం, ధార్మిక క్రతువు దాగి ఉంటుందని పెద్దలు చెబుతారు. క్రిమికీటకాలకు ఆహారంగా పిండి ముగ్గులు వాడతారని, వాటితో పెట్టే గొబ్బెమ్మలు, నవధన్యాలు, పళ్లు పక్షులకు ఆహారంగా సమకూరుతుందని చెబుతారు. ధనుర్మాసం ఆరంభం నుంచి మొదలయ్యే ముగ్గుల సందడి నూతన సంవత్సర వేడుకలు (january 1st muggulu), భోగి (simple bhogi muggulu or bhogi rangoli), సంక్రాంతి పండగలకు భారీస్థాయిలో ఉంటుంది.
ఈ ముగ్గులు, రంగవల్లులు, muggulu for sankranthi with dots కేవలం దక్షిణాది రాష్ట్రాలకే పరిమితం కాదు. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లోనూ రంగవల్లులతో అలంకరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ రంగ వల్లులు ప్రకృతిలోని చెట్లు, పక్షులు, జంతువులతో కనిపిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో చుక్కలు, సరళ రేఖలు, వృత్తాలతో కూడి ఉంటాయి. ఆకాశంలో చుక్కలను (rangoli designs with dots) తలపిస్తాయి.
Sankranthi muggulu designs
rangoli designs with dots ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్య స్థానాన్ని సూచిస్తుందని, విభిన్న ఆకారాల్లో రంగవల్లులు విభిన్న గ్రహాలకు సంకేతాలని, విభిన్న నక్షత్రాలకు సంకేతాలని అంటుంటారు.
వాకిలి అలికిన తరువాత కాస్త తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేస్తే ఎక్కువ సేపు కనువిందు చేస్తుంది. ఆవు పేడతో అలికిన తరువాత తెల్ల పిండి లేదా వరి పిండి లేదా సుద్దతో ముగ్గు వేస్తే కాంట్రాస్టుగా ఉండి అందంగా కనిపిస్తుంది. రంగులు వేస్తే ఇంకా సూపర్.
పండక్కి అలంకరణగా, జీవితంలో ఒక మార్పునకు ఆహ్వానంగా ముగ్గులను, ఈ రంగవల్లులను వర్ణిస్తారు. రంగవల్లులంటే మిక్కిలి మక్కువ గల తెలుగింటి ఆడపడచులకు ఈ సంక్రాంతి చుక్కల ముగ్గులను మీకు డియర్ అర్బన్ డాట్ కామ్ ప్రత్యేకంగా అందిస్తోంది. తెలుగింట బాగా కనిపించే ముగ్గులు డిజైన్లు గ్యాలరీలో చూడొచ్చు.
చుక్కల ముగ్గులు రంగవల్లులు (sankranthi muggulu with dots)
ముగ్గులతో అలంకరణ మహాలక్ష్మికి స్వాగతం పలకడమే అని పెద్దలు చెబుతారు. గోపిక బొమ్మలనే గొబ్బెమ్మలని అంటారు. ఈ గొబ్బెమ్మలను రంగోలి మధ్యలో అలంకిరిస్తారు. ఈ గొబ్బెమ్మల చుట్టూ ఆడపిల్లలు తిరుగుతూ పాటలు పాడతారు. అంటే సంక్రాంతి పండగలో తెలుగింట ముగ్గుల ప్రాధాన్యత ఎంత ఉందో అర్థమవుతుంది.
ఇక మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండగలు పూర్తయ్యే వేళ రథం ముగ్గు వేయడం ఆనవాయితీ. పండగను ఆనందంగా సాగనంపడంలో భాగమే ఈ రథం ముగ్గు అంటారు.
సంక్రాంతి ముగ్గులు పెద్దవి
ముగ్గులు .. రంగవల్లులు సంపాదనకు మార్గం
రంగోలి డిజైన్లు వేస్తూ ఆదాయం కూడా పొందవచ్చండీ. ముగ్గులు డిజైన్లు బాగావేయడం నేర్చుకుని యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఆదాయం పొందుతున్నవారూ ఉన్నారు.
ఈజీరంగోలి యూట్యూబ్ ఛానెల్ చూసే ఉంటారు కదా.. హైదరాబాద్ కు చెందిన సునీత ఈ ఛానెల్ నిర్వాహకురాలు. ఏకంగా 14 లక్షల మంది చందాదారులు ఉన్నారు. నేనూ ఇటీవలే పుష్పాస్ రంగోలి పేరుతో యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నాను.
దీపికా రంగోలీస్, సింపుల్ రంగోలీ, తెలుగింటి ముగ్గులు వంటి ఛానెళ్లు లక్షలాది మంది చందాదారులను కలిగి ఉన్నాయి. ఆయా యూట్యూబ్ ఛానెళ్లు చూసేవారి సంఖ్య పెరిగేకొద్దీ వారి ఆదాయం పెరుగుతుంది.
రంగోలి డిజైన్లు, తెలుగింటి ముగ్గులు, సంక్రాంతి చుక్కల ముగ్గులు మీకు నచ్చితే ఈ కథనం షేర్ చేయడం మరిచిపోకండి.
మీకు నచ్చిన తెలుగింటి ముగ్గులు డిజైన్లు మా పాఠకులతో పంచుకోవాలనుకుంటే [email protected] మెయిల్ ఐడీకి షేర్ చేయడం మరిచిపోకండి..
ఇవి కూడా చదవండి