‘ఎ రైటర్‌’ షార్ట్‌ ఫిలిం : పాయల్‌ రాజ్‌ పుత్‌ బెంగ తీర్చిందా?

payalrajputh

షార్ట్‌ ఫిలిం: ఎ రైటర్ నిడివి: 16 నిమిషాలు
నటులు: పాయల్‌ రాజ్‌ పుత్, సౌరభ్‌ ధింగ్ర
రచయిత, దర్శకత్వం, డీవోపీ, ఎడిటర్‌: సౌరభ్‌ ధింగ్ర

కథః

తల్లి నుంచి ఫోన్‌ అందుకున్న ప్రీతి (పాయల్‌ రాజ్‌పుత్‌) తన యోగక్షేమాల గురించి చెప్పి తాను అనుకున్న కథ పై పని చేస్తున్నానని, కాన్సెప్ట్‌ పూర్తయిందని వివరిస్తుంది. ఈ లోపు డెలివరీ బాయ్‌ వచ్చి ప్రీతికి కొన్ని వస్తువులు ఇస్తాడు. అనంతరం కథ రాయడం ప్రారంభిస్తుంది ప్రీతి. ప్రారంభంలో కొంత రాసి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుటుంది.

తన భర్త అనిరుధ్‌ నుంచి ఫోన్‌ వస్తుంది. ఆఫీసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు ఫోటోలు తీసి పంపమంటే ఎందుకు పంపలేదని అనిరుధ్‌ కోప్పడతాడు. డాక్యుమెంట్‌ పేజీలను ఫోటోలు తీసి ఫోన్లో పంపుతుంది.

అనంతరం తన భర్త ఇటీవల బిజినెస్‌ టూర్‌ కు వెళ్లి రావడంతో సూట్‌ కేస్‌లో ఉన్న బట్టలను సర్దేందుకు తీస్తుంది. తీరా అందులో మహిళ దుస్తులు కనిపించడంతో, బిజినెస్‌ టూర్‌ అని చెప్పి వెళ్లి తన భర్త చేసింది ఇదా? అంటూ బాధ పడుతుంది. ఏడుస్తుంది.

కొద్దిసేపటికి వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌లో పాటలు వింటూ వంట చేయడంలో నిమగ్నమవుతుంది ప్రీతీ. భర్త ఆఫీసు నుంచి ఇంటికొచ్చి ఎంత సేపు తలుపు తట్టినా పలకదు. తీరా ఫోన్‌ చేస్తే డోర్‌ తీసిన ప్రీతిపై చేయి చేసుకుంటాడు అనిరుధ్‌.

ఈ క్రమంలో కొద్ది సేపటికి అనిరుధ్‌ టీవీ చూస్తూ మందు తాగుతుంటాడు. తీరా ప్రీతీ వచ్చి అన్నం వడ్డించమంటారా? అని అడిగితే అసహ్యించుకుంటూ వద్దని చెబుతాడు. అనిరుధ్‌ బాత్రూం వెళ్లినప్పుడు ప్రీతి వచ్చి మందు సీసా, గ్లాస్‌ తీసేసి అన్నం ప్లేటు ముందుంచుతుంది.

దీంతో కోపోద్రిక్తుడైన అనిరుధ్‌ వంటింట్లో ఉన్న ప్రీతిని విచక్షణారహితంగా కొడతాడు. ఆత్మరక్షణకు ప్రీతి కత్తితో దాడి చేసి కసితీరా పోడిచేస్తుంది. అనిరుధ్‌ చనిపోయాడా? ఆ తరువాత ప్రీతి ఏం చేసింది? తరువాత కాలింగ్‌ బెల్‌ కొట్టిందెవరు? వంటి అంశాలన్నీ క్లైమాక్స్‌లో చూడాల్సిందే.

కాన్సెప్ట్:

ఒక రచయిత్రి తాను నిర్దేశించుకున్న కథతో ఏ విధంగా ప్రయాణిస్తుంది, ఎలా అందులో జీవిస్తుంది, ఎలాంటి సంఘర్షణకు లోనవుతుంది అన్న విషయాలను దర్శకుడు ఈ షార్ట్‌ ఫిలింలో వివరించాడు. గృహహింస నేపథ్యంలో ప్రీతి అనుకున్న కాన్సెప్ట్‌తో ఆమె ఏ విధంగా ప్రయాణించింది. ఆ కథలోని పాత్రలో ఎలా లీనమైంది.. చివరికి గృహహింసను భరించలేక బాధితురాలు ఏ నిర్ణయం తీసుకుంది అన్న విషయాలను షార్ట్‌ఫిలిం ద్వారా చెప్పారు.

 

కెమెరా ముందు లేని లోటును తీర్చింది..

ఈ లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో కెమెరా ముందు లేను అన్న బెంగను ఈ ఫార్ట్‌ ఫిలిం తీర్చిందని ’ఎ రైటర్‌’ గురించి చెప్పుకొచ్చింది పాయల్‌ రాజ్‌ పుత్‌. 24 గంటల్లో చిత్రీకరించిన ఈ షార్ట్‌ ఫిలింలో తాను మేకప్‌ లేకుండా నటించానంది. తన అభిమానులందరికీ ఈ షార్ట్‌ ఫిలిం అంకితమిస్తున్నట్టు చెప్పింది పాయల్‌.

ఇవీ చదవండి

ఇన్ సైడ్ ఎడ్జ్ : వెబ్ సిరీస్ రివ్యూ

Previous articleఅడిసన్ వ్యాధి నుంచి సుస్మితాసేన్‌‌ ఎలా పోరాడింది?
Next articleకరోనా తరువాత మన జీవితం ఎలా ఉండబోతోంది?